జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2007లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రఘువాన్ష్ ప్రసాద్ సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మీడియా సమావేశం నిర్వహించారు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇది పంచాయతీ రాజ్ చట్టంలో భాగంగా, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ[1] ఆధ్వర్యంలో ఏర్పడిన ఒక సంస్థ. ఇది గ్రామాలలో పేదరిక నిర్మూలన, ఇతరత్రా వివిధ రకాల అభివృద్ధి పనులను నిర్వహించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ప్రతి జిల్లాకి ఒకటి చొప్పున జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి.

ఇవి సంఘాల చట్టం కింద ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలు. వీటి నిర్వహణాధికారిని ప్రాజెక్టు డైరెక్టరు అంటారు. అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కలెక్టరు వుంటారు. నిధులను కలెక్టరు నియంత్రిస్తారు. వీటి ముఖ్యమైన పనులు: ఉపాధి పధకం అమలు, స్త్రీ స్వయం సహాయ బృందాల ఏర్పాటుకి ప్రోత్సాహం, వాటి పనుల అనుసంధానం, ప్రపంచ బ్యాంకు సహాయంతో పేదరిక నిర్మూలనా పధకం (ఇందిరా క్రాంతి పధకం) మొదలగువాటి నిర్వహణ దీని అజమాయిషీలో జరుగుతాయి.

వనరులు[మార్చు]

  1. "గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్సైటు". Archived from the original on 2014-07-30. Retrieved 2020-07-21.