టాటా నానో
టాటా నానో అనేది ప్రధానంగా మధ్యతరగతి వారి కోసం 2008-2018 మధ్య కాలంలో భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తయారు చేసిన వెనుక ఇంజన్ కలిగిన హ్యాచ్ బ్యాక్ కారు. దీని ప్రారంభ ధర ₹100,000.[1]
టాటా మోటార్స్ సంస్థ మొదట్లో సంవత్సరానికి 250,000 కార్లను ఉత్పత్తి చేయాలని అంచనా వేసింది. కానీ ఇది సాధ్యం కాలేదు. సింగూరు నుండి సనంద్‌కు ఫ్యాక్టరీని మార్చే సమయంలో ఆలస్యం కావడం, నానోకు మంటలు అంటుకోవడం, నానో సురక్షితం కాదని, ఇంకా దాని తక్కువ ఖరీదు కారణంగా నాణ్యత లోపించిందని భావించడం వంటి అనేక కారణాల వల్ల విక్రయాల పరిమాణం తగ్గుముఖం పట్టింది. 2016-2017 మోడల్ సంవత్సరానికి వాస్తవ అమ్మకాలు 7,591కి చేరుకున్నాయి. 2017 నాటికి టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, టాటా మోటార్స్ మేనేజ్‌మెంట్ ధృవీకరించినట్లుగా, ప్రాజెక్ట్ నష్టాలు చవిచూసింది.[2][3]
2017లో, టాటా మోటార్స్ ప్రాజెక్ట్ పట్ల కంపెనీ యొక్క భావోద్వేగ నిబద్ధత కారణంగా తయారీ కొనసాగుతుందని తెలిపింది.[4][5] కానీ చివరికి మే 2018లో ఉత్పత్తిని నిలిపివేశారు.[6] సనంద్ ప్లాంట్ తరువాత టియాగో మరియు టిగోర్‌లతో సహా ఇతర హ్యాచ్‌బ్యాక్‌లను తయారు చేస్తుంది.[7]
మూలాలు
[మార్చు]- ↑ Chang, Richard S. "Tata Nano: The World's Cheapest Car".
- ↑ "Tata Motors Shuts Down Loss Making Small Car Tata Nano Production". Pixr8. Archived from the original on 19 January 2017.
- ↑ "Nano a loss-making product, says Tata Motors". Hindustan Times. 4 November 2016.
- ↑ "Tata Motors to continue Tata Nano production for now". Overdrive. 27 September 2017.
- ↑ "Tata Nano sales to continue in spite of no demand". The Hans India. 29 September 2017.
- ↑ "Air Asia Case Puts Spotlight Once Again on Cyrus Mistry's 'Legacy Hotspots'". The Wire. Retrieved 5 June 2018.
- ↑ "Tata Motors' Sanand facility reaches 100% utilization". Ahmedabad: Tata Motors. 7 August 2018. Archived from the original on 13 నవంబరు 2021. Retrieved 13 November 2021.