తలిశెట్టి రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తలిశెట్టి రామారావు
తలిశెట్టి రామారావు
జననంతలిశెట్టి రామారావు
(1896-05-20)1896 మే 20
జయపురం
మరణం(1947-03-14)1947 మార్చి 14
ఇతర పేర్లుతెలుగు కార్టూన్ పితామహుడు
వృత్తిన్యాయవాది
ఉద్యోగంజయపురం సంస్థానంలో అసిస్టెంట్ దివాన్
ప్రసిద్ధితెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు)
భార్య / భర్తజయలక్ష్మి
పిల్లలుకుమారుడు జయరాం, కుమార్తెలు రామకుమారి, రాఘవకుమారి, సీతాకుమారి
తండ్రిశీతయ్య
తల్లిరామానుజమ్మ
తెలుగులో మొదటి కార్టూనిస్టు తలిశెట్టి రామారావు యొక్క కార్టూన్

తలిశెట్టి రామారావు (1896 - 1947) తొలి తెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు). ఇతని కార్టూన్లు భారతి పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. ఇతన్ని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు.

వ్యక్తిగత వివరాలు[మార్చు]

తలిశెట్టి రామావారు 1896 మే 20న రామానుజమ్మ, సీయయ్య దంపతులకు జయపురంలో జన్మించాడు. గిడుగు రామమూర్తి పంతులు కుమారుడు గిడుగు సీతాపతి వద్ద శిష్యరికం చేశాడు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. జీవనం కోసం తల్లితో కలిసి దర్జీపని చేశాడు. ఆ తరువాత కార్టూన్లు గీయటంలో ఈ వృత్తి లోని అనుభవం కూడా దోహదం చేసింది. ఉన్నత విద్య జయపురంలోనూ, ఆ తరువాత పర్లాకిమిడి, ఆ తరువాత విజయనగరంలో బి.ఏ చదివాడు. ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగిపోయి, ఆ తరువాత జయంపురం రాజా వారి సహాయంతో మద్రాసులో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం పార్వతీపురంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. మద్రాసులో ఉన్నప్పుడే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు భారతి, ఆంధ్రపత్రిక పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కార్టూన్ శకానికి నాంది పలికాడు.

రచనలు[మార్చు]

"పరిచర్య" తలిశెట్టి రామారావు గీచిన వర్ణచిత్రం
  1. భారతి, ఆంధ్ర పత్రికల్లో కార్టూన్లు
  2. చిత్రలేఖనము (1918)
  3. 1930వ సంవత్సరంలో భారతీయ చిత్రకళ అనే పుస్తకం. ఆంధ్రగ్రంథమాల ప్రచురణ.

తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం[మార్చు]

తలిశెట్టి రామారావు పుట్టినరోజునే "మే 20" న ప్రతీ సంవత్సరం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం గా జురుపుతున్నారు.

మూలాలు[మార్చు]

  • తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు - పుస్తకం. సేకరణ ముల్లంగి వెంకట రమణారెడ్డి.

బయటి లింకులు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: