తాటికుంట మైసమ్మ ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణలోని రంగారెడ్డిజిల్లా, యాచారం మండలం తాడిపర్తి గ్రామ సమీపంలో దట్టమైన అడవి, చెరువుల తీరాన ఈ ఆలయం వెలసింధి.[1]

స్థల పురాణం

[మార్చు]

పురాతన కాలంలోనే మైసమ్మ దేవత వెలిసింది. ఆ కాలంలో చిన్నచిన్న రాళ్లతో కట్టిన చిన్న ఆలయం ఇది. అందులో ఓ రాతివిగ్రహం ఉండేదట. ఎన్నో ఏళ్లుగా దీపధూప నైవేద్యాలకు నోచుకోకుండా వెలవెలబోయింది. ఆలయం పశువుల కాపరులు, గొర్రెల కాపరులకు, అడవిలో కట్టెలు కొట్టే గిరిజనులకు మాత్రమే తెలుసు. వీరంతా కట్టకింద ఉన్న కుంటలో పశువులకు, గొర్రెలకు నీళ్లు తాగించి, అక్కడే సద్ది తిని సేద తీరేవారు. వారికి కష్టాలు వచ్చినప్పుడు అమ్మవారితో పంచుకునేవారు.

త్వరలోనే వారి కోర్కెలన్నీ తీర్చడంతో వారు కొబ్బరి కాయలు కొట్టడం, దీపధూప నైవేద్యం సమర్పించడం మొదలు పెట్టారు. ఆది ఆనోట ఈనోటా పడి, అమ్మవారిని చూడడానికి భక్తులు అడవి ప్రాంతం నుంచి కాలినడకన వెళ్లి, దర్శనం చేసుకునేవారు. అలా అమ్మవారి ప్రసిద్ధి క్రమంగా వెలుగు చూసింది. దీంతో అడవి నుంచి ఆమె ప్రస్థానం జనాల్లోకి వెళ్లింది. 2012లో ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. లక్షల రూపాయలు ఖర్చుచేసి ఆలయం నిర్మించారు. సాయిరెడ్డిగూడ గ్రామానికి చెందిన నర్సింహ్మ అనే వ్యక్తి సహాయంతో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయం ముందు కలపతో చేసిన ధ్వజస్థంభాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం ముందు పుట్ట వద్ద భక్తులు పూజలు చేయడం ఆనవాయితీ.

పూజలు

[మార్చు]

ప్రతీ ఆదివారం, గురువారం ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. జాతరలు, బోనాల ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించారు.

విశిష్టత

[మార్చు]

తాటివనానికి చిరునామా అయిన ఈ ఆలయం, రెండు జాతీయ రహదారుల మధ్యనున్న రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌లో చెరువు కట్టపై గ్రామ దేవత తాటికుంట మైసమ్మ ఆలయం వెలసింధి. .

రవాణా సౌకర్యం

[మార్చు]

హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ జాతీయ రహదారి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. ఇబ్రహీంపట్నం నుంచి యాచారం మీదుగా నందివనపర్తి తాడిపర్తి మీదుగా 20 కిలోమీటర్ల దూరంలో తాటికుంట మైసమ్మ ఆలయాన్ని చేరుకోవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. తాటికుంట మైసమ్మ ఆలయం. "తాటి వనపు మేటి దేవత తాటికుంట మైసమ్మ!". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Archived from the original on 15 ఫిబ్రవరి 2018. Retrieved 11 February 2018.