తుషార్ కాంతి బెహరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుషార్ కాంతి బెహరా

ఎలక్ట్రానిక్స్ & ఐటి, సాంకేతిక సమాచార శాఖ మంత్రి
పదవీ కాలం
2022 జూన్ 5 – ప్రస్తుతం
నియోజకవర్గం కాకత్‌పూర్ నియోజకవర్గం

క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
2019 మే 29 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2019 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1950-06-01) 1950 జూన్ 1 (వయసు 73)
బలిదియా, జగత్‌సింగ్‌పూర్ జిల్లా, ఒడిషా రాష్ట్రం
తల్లిదండ్రులు సురేష్ చంద్ర బెహెర

తుషార్‌కాంతి బెహరా ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కాకత్‌పూర్ నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న ఎలక్ట్రానిక్స్ & ఐటి, సాంకేతిక సమాచార, క్రీడలు & యువజన సర్వీసులు శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

తుషార్‌ కాంతి బెహరా బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో కాకత్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2019 మే 29న రాష్ట్ర క్రీడలు-యువజన వ్యవహారాల మంత్రిగా భాద్యతలు చేపట్టి[2] తిరిగి 2022లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 జూన్ 5న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ఎలక్ట్రానిక్స్ & ఐటి, సాంకేతిక సమాచార, క్రీడలు & యువజన సర్వీసులు శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]

మూలాలు[మార్చు]

  1. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. Prajasakti (12 December 2020). "మరోసారి ఒరిస్సా వేదికగా హాకీ ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
  3. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.