Coordinates: 8°57′0″N 77°4′0″E / 8.95000°N 77.06667°E / 8.95000; 77.06667

తెన్మల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెన్మల
గ్రామం
తెన్మలలోని 13 ఆర్చ్ రైల్వే వంతెన
తెన్మలలోని 13 ఆర్చ్ రైల్వే వంతెన
తెన్మల is located in Kerala
తెన్మల
తెన్మల
భారతదేశము,కేరళ లో స్థానము
తెన్మల is located in India
తెన్మల
తెన్మల
తెన్మల (India)
Coordinates: 8°57′0″N 77°4′0″E / 8.95000°N 77.06667°E / 8.95000; 77.06667
దేశంభారతదేశం ( India)
రాష్ట్రంకేరళ
జిల్లాకొల్లాం జిల్లా
భాషలు
 • అధికారిక భాషలుమలయాళం, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationKL-25
దగ్గరి ప్రదేశంకొల్లాం (63 కి.మీ)

తెన్మల భారతదేశం, కేరళ రాష్ట్రం, కొల్లాం జిల్లాలో ఉన్న గ్రామం. ఇది భారతదేశంలోని మొట్టమొదటి పర్యావరణ-పర్యాటక కేంద్రానికి (ఎకో-టూరిజం ప్రాజెక్ట్) నిలయం.[1] తెన్మల అనే పదానికి మలయాళ భాషలో "తేనె కొండ" అని అర్థం. ఇది నాణ్యమైన తేనె ఎగుమతికి ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం కొల్లాం నగరానికి 66 కి.మీ దూరంలో, రాష్ట్ర రాజధాని త్రివేండ్రం నుండి 69 కి.మీ దూరంలో ఉంది, తమిళనాడు రాష్ట్ర సరిహద్దు నుండి కేవలం 14 కి.మీ దూరంలో ఉంది.[2] అంతర్ రాష్ట్ర జాతీయ రహదారి-744, కొల్లాంను తమిళనాడులోని మధురైతో కలుపుతుంది, రాష్ట్ర రహదారి-2 కేరళ రాష్ట్రంలోని తెన్మల గుండా పోతుంది. కేరళలోని అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ అయిన కల్లాడ ప్రాజెక్ట్, చెంత్రుణి (శెంత్రుని) వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడ ఉన్నాయి.

వ్యుత్పత్తి శాస్త్రం[మార్చు]

తెన్మల అనే పదానికి మలయాళ భాషలో "థేన్" అంటే తేనె, "మల" అంటే పర్వతం అని అర్థం. తెన్మలలో పలు మలయాళం, తమిళ సినిమాల చిత్రీకరణ జరిగింది.[3][4]

చరిత్ర[మార్చు]

తెన్మలలో మట్టితో కప్పబడిన రాతియుగం సంస్కృతికి సంబంధించిన అనేక చారిత్రక అవశేషాలు కనుగొనబడ్డాయి. కల్లాడ నీటిపారుదల పథక కుడి కాలువ ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్న పురాతన గృహోపకరణాలు ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ గ్రామంలో పాండ్య రాజుల కాలంలో నిర్మించబడిన మాంబజ్తర ఆలయం ఉంది. ఇది తెన్మలలోని పురాతన ఆలయం.

పర్యాటకం[మార్చు]

తెన్మలలో బోటింగ్, రోప్ బ్రిడ్జ్, పర్వతారోహణ, మ్యూజికల్ ఫౌంటెన్, కులతుపుజ శాస్తా ఆలయం, అంచల్ పినాకిల్ వ్యూ పాయింట్, కుడుక్కతు పారా, పునలూర్ సస్పెన్షన్ బ్రిడ్జి వంటివి ఉన్నాయి.[5] పాలరువి అనే జలపాతం సమీపంలోని ప్రధాన ఆకర్షణ. అంతేకాకుండా జింక పునరావాస కేంద్రం కూడా ఉంది.[6] తెన్మలకు త్రివేండ్రం, పునలూర్ నుండి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. దీనికి సమీప రైల్వే స్టేషన్ పునలూర్ రైల్వే స్టేషన్. పాలరువి జలపాతం నుండి 16 కి.మీ దూరంలో ఉంది.

వ్యవసాయం[మార్చు]

ప్రధానంగా ఎర్రమట్టి, బంకమట్టి నేలలు తెన్మలలో సమృద్ధిగా ఉన్నాయి. తెన్మలలో టాపియోకా, వరి, చెరకు, చిక్కుడు, జీడి, కొబ్బరి, మిరియాలు, కముక్, అరటి, రబ్బరు సాగు చేస్తారు. ఈ గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో టేకు, యూకలిప్టస్ తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం తర్వాత పశువుల పెంపకం, వ్యాపారం స్థానికులకు జీవనాధారం. తెన్మలలో రిండర్‌పెస్ట్ చెక్ పోస్ట్, అనేక పాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.

విద్య[మార్చు]

తెన్మల విద్య, పరిశ్రమల పరంగా వెనుకబడిన ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ రెండు ఉన్నత పాఠశాలలతో సహా 11 పాఠశాలలు ఉన్నాయి.

వన్యప్రాణుల అభయారణ్యం[మార్చు]

తెన్మల వన్యప్రాణుల డివిజన్ పరిధిలోని కులతుపుజా రిజర్వ్ ఫారెస్ట్ 25 ఆగస్టు 1984న చెంత్రుణి వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించబడింది. 100 చ.కి.మీ. విశాలమైన వన్యప్రాణుల అభయారణ్య ప్రధాన కార్యాలయం తెన్మలలో ఉంది.

ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉష్ణమండల సతతహరిత, పాక్షిక-సతతహరిత, ఆకురాల్చే, పర్వత ప్రాంతాలలో అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లో సహజసిద్ధంగా టేకు పెరగకపోవడం విశేషం. ఎర్ర మల్బరీ ఈ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే చెంకురుంజి చెట్టు ఆధారంగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చెంత్రుణి అని పేరు పెట్టారు.[7] ఈ అభయారణ్యంలో పర్వత హార్న్‌బిల్, అడవి కోతి, సింహం తోక గల కోతి, నల్ల కోతి, ఉడుత, పర్వత ఉడుత, అడవి దున్న, జింక, అడవి పంది, ఏనుగులు[8] వంటి జంతువులు అనేక పక్షి జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Thenmala, India's First Planned Eco-Tourism Destination Is Full of Scenic Surprises". The Better India. 23 July 2016. Retrieved 13 March 2020.
  2. "Thenmala: A green getaway at foothills of Western Ghats". On Manorama. 12 October 2019. Retrieved 13 March 2020.
  3. "Touring in Thenmala".
  4. "Photos of Thenmala".
  5. "5 BEST Places to Visit in Thenmala - UPDATED 2023 (with Photos & Reviews)". Tripadvisor. Retrieved 2023-07-18.
  6. "Thenmala Ecotourism - Home". www.thenmalaecotourism.com. Retrieved 2023-07-18.
  7. Abdul (2022-07-05). "Chenkurinji Tree: Saving Chenkurinji from climate change". ForumIAS Blog. Retrieved 2023-07-18.
  8. "Shendurney wildlife sanctuary - Kerala Travels". www.keralatravels.com. Retrieved 2023-07-18.
"https://te.wikipedia.org/w/index.php?title=తెన్మల&oldid=3936541" నుండి వెలికితీశారు