తెలంగాణ ఇంటి పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ ఇంటి పార్టీ
స్థాపకులుచెరుకు సుధాకర్
స్థాపన తేదీ2 జూన్ 2017
(6 సంవత్సరాల క్రితం)
 (2017-06-02)
ప్రధాన కార్యాలయంఆదర్శ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ 500063
రాజకీయ విధానంతెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక శక్తులకు గుర్తింపు, సామాజిక తెలంగాణ
Coloursఆకుపచ్చ

తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2017లో ఏర్పడిన ప్రాంతీయ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన చెరుకు సుధాకర్ తెలంగాణ ఆత్మగౌరవం కోసం, సామాజిక శక్తులకు గుర్తింపు, సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఈ పార్టీని 2017 జూన్ 02న ఏర్పాటు చేశాడు.[1]

పార్టీ ఆవిర్భావం[మార్చు]

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 2017 జూన్ 2న తెలంగాణ ఆత్మగౌరవం కోసం, సామాజిక శక్తులకు గుర్తింపు, సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ‘తెలంగాణ ఇంటి పార్టీ’ని స్థాపిస్తున్నట్లు చెరుకు సుధాకర్‌ ప్రకటించాడు. పార్టీ ఆవిర్భావం సభకు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉ.సా), మారొజు వీరన్న కుమార్తె మరోజు దీక్ష, చెరుకు లక్ష్మి, దోరం హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


పోరాటాలు[మార్చు]

తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భావం మొదలు అనేక పోరాటాలు చేశారు. 2017లో విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్ కూల్చడాన్ని నిరసిస్తూ అనేక పోరాటాలు చేసి ప్రభుత్వం వెనక్కి తగ్గేలా చేసింది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చెయ్యాలని TSU వరంగల్ జిల్లా అధ్యక్షుడు దోరం హరీష్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది. RTC ఉద్యమంలో JACపిలుపు మేరకు దోరం హరీష్ యాదవ్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ ముట్టడి చెయ్యడం జరిగింది. తెలంగాణ ఇంటి పార్టీ చేసిన ప్రతి పోరాటంలో హరీష్ యాదవ్ పాత్ర చాల ముఖ్యమైనది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వల పై నిరంతరం పోరాటాలు చేసింది. SC/ST అట్రాసిటీ చట్టంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై, యురేనియం తవ్వకాలపై, నావి రాడార్ ప్రాజెక్ట్ పై, మంథాని మధుకర్ ఘటన ఆలా మొదలగు ఎన్నో పోరాటాల్లో తెలంగాణ ఇంటి పార్టీ క్రియాశీల పాత్ర పోషించింది.

ఎన్నికల్లో పోటీ[మార్చు]

  1. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ పోటీ చేసింది. నకిరేకల్ ఎన్నికల్లో తెరాస ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకచించింది. పోటీ చేసిన ప్రతి స్థానంలో మంచి ఓట్ బ్యాంకు సంపాదించింది.
  2. హుస్నాబాద్ నియోజకవర్గంలో దేవసాని తిరుపతి రెడ్డి ఇంటి పార్టీ తరుపున మూడవ స్థానంలో నిలిచారు.
  3. 2021 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ - ఖమ్మం - వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి తెలంగాణ ఇంటి పార్టీ తరపున చెరుకు సుధాకర్ పోటీ చేసి ఓడిపోయాడు.[2]

పార్టీలోని నాయకులు[మార్చు]

  • దోరం హరీష్ యాదవ్
  • వెదిరె చల్మారెడ్డి[3]
  • ఎర్ర రామేశ్వర్‌గౌడ్‌[4]
  • బత్తుల సోమన్న[5]
  • బుర్ర శ్రీనివాస్‌గౌడ్
  • కుందూరు దేవేందర్ రెడ్డి
  • రాజనాల చంద్రకాంత్ రెడ్డి
  • దొమ్మాట వెంకటేశ్వర్లు
  • కొమురయ్య
  • సందీప్ చమార్
  • తిరుపతి రెడ్డి

విలీనం[మార్చు]

తెలంగాణ ఇంటి పార్టీని 2022 ఆగష్టు 5వ తేదీన కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం జరిగింది.

మూలాలు[మార్చు]

  1. Sakshi (3 June 2017). "ఆత్మగౌరవం కోసం మరో పోరాటం". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  2. Andrajyothy (15 January 2021). "బతుకు తెలంగాణ కోసం ఉద్యమిద్దాం". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  3. Sakshi (29 September 2020). "తెలంగాణ ఇంటి పార్టీలో చేరిన వెదిరె చల్మారెడ్డి". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  4. Sakshi (12 March 2018). "రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తాం". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  5. Sakshi (1 January 2019). "బీసీల లెక్కలు తేల్చాకే 'పంచాయతీ'". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.