అక్షాంశ రేఖాంశాలు: 25°41′N 89°59′E / 25.68°N 89.98°E / 25.68; 89.98

దక్షిణ సల్మారా-మంకాచార్ జిల్లా

వికీపీడియా నుండి
(దక్షిణ సల్మారా జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దక్షిణ సల్మారా జిల్లా
అసోం రాష్ట్ర జిల్లా
అస్సాంలోని ప్రదేశం ఉనికి
అస్సాంలోని ప్రదేశం ఉనికి
Coordinates: 25°41′N 89°59′E / 25.68°N 89.98°E / 25.68; 89.98
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
డివిజన్దిగువ అసోం
ముఖ్య పట్టణంహాట్సింగరి
విస్తీర్ణం
 • Total568 కి.మీ2 (219 చ. మై)
జనాభా
 (2011)
 • Total5,55,114
భాషలు
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
ISO 3166 codeIN-AS
Vehicle registrationఏఎస్-34

దక్షిణ సల్మారా జిల్లా, అస్సాం రాష్ట్రంలోని ఒక జిల్లా. గువహాటికి 245 కి.మీ.ల దూరంలో ఉన్న హాట్సింగరి గ్రామంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. అంతకుముందు ఇది ధుబ్రి జిల్లా ఉపవిభాగంగా ఉండేది.

పద వివరణ

[మార్చు]

దక్షిణ సల్మారా శాసనసభ నియోజకవర్గం పేరు నుండి ఈ జిల్లాకు దక్షిణ సల్మారా అనే పేరు వచ్చింది.

చరిత్ర

[మార్చు]

2016లో దక్షిణ ధుబ్రి జిల్లాను విభజించి దక్షిణ సల్మారా జిల్లా ఏర్పాటుచేయబడింది. 2015, ఆగస్టు 15న అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అస్సాం రాష్ట్రంలో ప్రకటించిన 5 కొత్త పరిపాలనా జిల్లాల్లో దక్షిణ సల్మారా జిల్లా ఒకటి. 2016, ఫిబ్రవరి 9న దిగువ అస్సాం, మధ్య అస్సాం డివిజన్ కమిషనర్ ఎండి. మహాతాబ్ ఉద్దీన్ అహ్మద్ (ఐఏఎస్) చేత పరిపాలనా జిల్లాగా ప్రారంభించబడింది. ఈ జిల్లాలో మీర్ జుమ్లా సమాధి, కామాఖ్యా ఆలయం వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

దక్షిణ సల్మారా జిల్లా విస్తీర్ణం 568 చ.కి.మీ. (219 చ.మై.ల) ఉంది. బ్రహ్మపుత్ర నది తన ఉపనదులతో కలిసి ఈ జిల్లాలో తూర్పు నుండి పడమర వరకు దాని ప్రవహిస్తోంది. జిల్లాలో వార్షిక వర్షపాతం 2,916 మి.మీ.గా ఉంది.

విభాగాలు

[మార్చు]

ఈ జిల్లాలో ఒక సబ్ డివిజన్, 2 రెవెన్యూ సర్కిల్స్ ఉన్నాయి:

  1. దక్షిణ సల్మారా రెవెన్యూ సర్కిల్ కార్యాలయం
  2. హాట్సింగరి సబ్ డివిజన్
  3. మంకాచార్ రెవెన్యూ సర్కిల్ కార్యాలయం

జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్లు, రెండు అస్సాం శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి: 21 మంకాచార్, 22 దక్షిణ సల్మారా.[1] ఇవి రెండు ధుబ్రీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.[2]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 5,55,114 మంది ప్రజలు నివసిస్తున్నారు.

దక్షిణ సల్మారా జిల్లాలో మతం

[మార్చు]

ఇక్కడి జనాభాలో 95.2% మంది ముస్లింలు, 4.5% మంది హిందువులు, మిగిలిన 0.3% మంది క్రైస్తవులు, సిక్కులు ఉన్నారు.

దక్షిణ సల్మారా జిల్లాలో మాట్లాడే భాషలు

[మార్చు]

జిల్లా జనాభాలో 1,21,006 మంది అస్సామీ భాష, 4,07,735 మంది బెంగాలీ భాష, 4.76% మంది ఇతర మైనారిటీ భాషలు మాట్లాడుతున్నారు.[3]

సంస్కృతి

[మార్చు]

ఈ జిల్లాలో అస్సామీ, బెంగాలీ సంస్కృతుల కలయిక ఉంది. చాలామంది ప్రజలు తంగైలీ బంగ్లా (తూర్పు బెంగాల్ మాండలికం) మాట్లాడగా, కొద్దిమంది గోల్పారియా మాండలికం మాట్లాడతారు. గోల్పారియా మాండలికం మాట్లాడేవారిని ఉజని అని, తంగైలి బెంగాలీ మాట్లాడేవారిని భాటియా అంటారు. ఉజని, భాటియా సంస్కృతుల మధ్య కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. జిల్లాలో పురుషులు లుంగీ, కుర్తా ధరించగా, మహిళలు చీరలను ధరిస్తారు.

రవాణా

[మార్చు]

వాయుమార్గం

[మార్చు]

హాట్సింగరి నుండి 72.8 కి.మీ.ల దూరంలోని రూపశి వద్ద సమీప విమానాశ్రయం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో సైనిక ప్రయోజనాల కోసం బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విమానాశ్రయం నిర్మించబడింది. 1983వ సంవత్సరం వరకు ఈ విమానాశ్రయం నుండి ఇండియన్ ఎయిర్ లైన్స్, ఇతర ప్రైవేట్ విమానాల ద్వారా కోల్‌కాతా, గువహాటి, ధుబ్రి నగరాల మధ్య విమాన రాకపోకలు ఉండేవి. ప్రస్తుతం ఈ విమానాశ్రయం పూర్తిగా మూసివేయబడింది.

జలమార్గం

[మార్చు]

బ్రహ్మపుత్రా నది ఒడ్డున ఉన్న ఈ పట్టణ ఓడరేవు ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. బ్రిటిష్ కాలంలో ఇతర దేశాలతో అంతర్జాతీయ వాణిజ్య సంబంధం కోసం దీనిని ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ ఓడరేవులో వాణిజ్య రవాణా పనులేవి జరగడంలేదు. ప్రతిరోజు ఇక్కడినుండి ధుబ్రికి ప్రజా రవాణా కోసం చిన్నచిన్న పడవలు వెలుతుంటాయి.

రైల్వేమార్గం

[మార్చు]

ఈ జిల్లాలో రైల్వే స్టేషను లేదు.

రోడ్డుమార్గం

[మార్చు]

ఈ జిల్లాలో జాతీయ రహదారి లేదు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిడబ్ల్యు రోడ్ల ద్వారా ఇక్కడ రవాణా జరుగుతుంది. హాట్సింగరి పట్టణంలోని ఒక భాగం అస్సాం-మేఘాలయ రాష్ట్రాల సరిహద్దుతో కలుపబడింది. దక్షిణ సల్మారా - మంకాచార్ ల మధ్య పిడబ్ల్యుడి రోడ్డు లేదు.

పట్టణం

[మార్చు]

జిల్లా ముఖ్య పట్టణమే కాకుండా జిల్లాలో ఉన్న ఏకైక పట్టణం ఇది.

మూలాలు

[మార్చు]
  1. "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 March 2012. Retrieved 23 December 2020.
  2. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 March 2012. Retrieved 23 December 2020.
  3. "C-16 Population By Mother Tongue - South Salmara". censusindia.gov.in. Retrieved 23 December 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]