దారిలో లాంతరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రక్షిత సుమ అనే ఒక చిన్నారి కవయిత్రి రాసిన తొలికవితా సంకలనం పేరు ఇది. తెలుగు, ఆంగ్ల భాషలతో ద్విభాషా సంకలనం (బైలింగ్యువల్ ఆంథాలజీ) గా ఈ పుస్తకం వెలువడినది.

సంకలనం వివరాలు[మార్చు]

13 వ ఏట నుంచి రాసిన 13 కవితల సమాహారంగా దారిలో లాంతరు అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పదమూడు కవితలను వేర్వేరు అనువాదకులు ఆంగ్లంలోకి అనువదించారు.

ముఖచిత్రం[మార్చు]

చేతిలో వేళ్ళడుతూ వున్నట్లు కనిపించే ముఖపత్రాన్ని వర్చస్వి గీసారు. పుస్తకం వెనక అట్టపై కనిపించే రచయిత్రి పోట్రెయిట్ పెయింటింగ్ కూడా కవి, రచయత అయిన వర్చస్వి గీసినదే.

కవర్ డిజైన్[మార్చు]

చీకట్లను పోలిన స్మో గ్రే రంగుతో వర్చస్వి గీసిన చిత్రాలను తగిన విధంగా వాడుకుంటూ మొత్తంగా కవర్ డిజైన్ ను భావనా గ్రాఫిక్స్ నుంచి బంగారు బ్రహ్మం రూపొందించారు.

లే అవుట్, పుస్తక రూపకల్పన[మార్చు]

గీటురాయి గ్రాఫిక్స్, హైదరాబాద్ వారు ఈ పుస్తకాన్ని లేఅవుట్ చేయడంతో పాటు పుస్తక రూపకల్పన చేసారు

ముద్రణ[మార్చు]

హైదరాబాద్, ఛత్తా బజార్ లోని కాస్మిక్ ప్రింటర్స్ నుంచి ఈ పుస్తక ప్రచురణ జరిగింది.

వెల[మార్చు]

తొలిసంచిక వెల యాభై రూపాయిలు

అంకితం[మార్చు]

దారిలో లాంతరు పుస్తకాన్ని కవయిత్రి తన నాయనమ్మ కట్టా లీలావతికి అంకితం ఇస్తున్నట్లుగా పేర్కొంది.

పరిచయ వాక్యాలు[మార్చు]

ప్రముఖ కవయిత్రి శిలాలోలిత దారిలో లాంతరు అనే పేరుతో పుస్తకానికి తొలి ముందుమాట రాసారు.
రక్షిత సుమ అడుగులు కవితపై కవిసంగమం పేస్ బుక్ గ్రూప్ లో శీర్షికగా రాసి తర్వాత పుస్తకంగా ముద్రించిన ‘ఈనాటి కవిత’ లోని నారాయణ శర్మగారి పరిచయ వాక్యాలు
కవిసంగమం సమకాలీన కవులపై ఒక్కమాట పేరుతో కవి యశస్వి సతీష్ రాసిన పుస్తకం నుంచి రక్షిత సుమ పరిచయం వున్న పేజీ
వన్ ఇండియా వెబ్ పత్రికలో కవిస్వరం శీర్షికలో ‘అదేనేను’ కవితపై శ్రీ కాసుల ప్రతాప రెడ్డిగారి విశ్లేషణ.
బివివి ప్రసాద్, తణుకు గారి ఆత్మీయాభినందనలు
భావస్థిరాణి జననాంతర సౌహృదాని అంటూ కవి యాకూబ్ గారి ఆశిస్సులు
ఆకుపాట కవితా సంకలనం రచయిత శ్రీనివాస్ వాసుదేవ్ గారి ‘సుమవాక్యం’ పేరుతో కవితా శుభాభినందనలు
అచ్చంగా నా బాల్యాన్ని చూసుకున్నట్లుంది అంటూ అత్తయ్యగా డాక్టర్ సుధా మోదుగు గారి అభిలాష
నీలాగే ఒకడుండే వాడు కవితా సంకలనం కవి, సినీగీత రచయిత నందకిశోర్ కవిత్వ చందమామ అంటే అన్నగా ఆశిస్సులు
సృజన సాహితీ వేదిక సత్తుపల్లి నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బి.మధుసూదన రాజు, నిర్వాహకులు రామకృష్ణ గార్ల ఆశీస్సులు, ఆకాంక్షలు
some words about suma poetry అంటూ సాయి పద్మ గారి ఆశిస్సులు
my advice పేరుతో విజయ్ లెంక గారి సూచనలు
Rediscovering the world in her own way అంటూ అనగనగా మార్టిన్ గారి వివరణాత్మక విశ్లేషణ
రక్షిత కవితా సుమాలు పేరుతో ది 17-08-2014న అప్పటి ప్రజాశక్తి (తెలంగాణా ఏర్పడిన తర్వాత నవతెలంగాణా పత్రికగా) దినపత్రికలో శాంతిశ్రీ గారు నిర్వహించిన ఇంటర్వూ
దీనిలో పొందుపరచబడినాయి

పుస్తక ఆవిష్కరణ[మార్చు]

కవి సంగమం వార్షికోత్సవం సందర్భంగా 2014 డిసెంబరు నెలలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన తమిళ కవయిత్రి రాజిత సల్మా గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది.

రాజిత సల్మా గారి చేతుల మీదుగా దారిలో లాంతరు పుస్తక ఆవిష్కరణ
రాజిత సల్మా గారి చేతుల మీదుగా దారిలో లాంతరు పుస్తక ఆవిష్కరణ

సంకలనం లోని కవితలు[మార్చు]

  • పండుగ వెన్నెలల మామ : రంజాన్ వినాయక చవితి ఒకేరోజు రావడంతో ఒకరు చంద్రుడిని చూడాలని మరోక చూడొద్దనీ అనుకోవడాన్ని గురించి
  • అశాశ్వతం : జీవితం బుద్భుద ప్రాయం అంటూ నాలుగు లైన్ల మినీ కవిత
  • ధ్యాన భంగిని : తరగతి గదిలో ధ్యానాన్నీ ధ్యాసనీ భగ్నం చేస్తున్న దోమని తపస్సుభగ్నం చేసే అప్సరసతో పోల్చుతూ రాసిన కవిత మెరుపులాంటి ముగింపుతో
  • కొలిమి : పర్యావరణం పై జరుగుతున్న విధ్వంసానికి బాధపడుతూ రాసిన కవిత
  • పిల్లవాళ్ళకు చాలు : పుస్తకాల్లోవున్నది బట్టీ పట్టించడం కాదు కాస్త ప్రపంచంతో కుస్తీలు పట్టడం కూడా నేర్పమంటూ సార్లకు చెపుతున్న సందర్భం
  • చెకుముకి రాయి : పనివిలువ తెలిపే ప్రభోదాత్మక సందేశం
  • అడుగులు : జీవితంలో ఏయే సందర్భంలో ఎవరి ఆసర అవసరం అవుతుంది. అయినా తూకం ఎంత అవసరమో చెప్పే కవిత
  • తోకతెగిన పిట్ట : ఇది పుస్తకంలోని రెండో మినీ కవిత ఉత్తరం పై చిరునామా లేకపోతే ఎంత వ్యర్ధమో, ముఖంపై చిరునవ్వులేకున్నా అంతేనంటుందీ చిన్నారి.
  • అవిజ్ఞులు : వినాయకుడు విఘ్నాతిపతి అయితే ఆయనద్వారానే విఘ్నాలు కల్పిస్తారేమిట్రా అంటూ హైదరాబాద్ నగర నిమజ్జన హడావుడిపై హైటెక్ పద్ధతిలో విసుక్కుంటుంది
  • గడ్డిపోచ : ఒద్దికగా వుండటంలోని అత్యవసరం ఏమిటో చెపుతూ
  • కొత్త చీకట్లు : దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ళ నేపథ్యంలో అల్లావుద్దీన్ దీపమైనా రుద్దేముందు జాగ్రత్త అంటూ ట్రెండు మారింది గురూ కవిత
  • ఒక్కసమిధ వెలిగినా చాలు : ధైర్యం ఆరిపోవద్దు, చీకట్లోకి జారిపోవద్దు అంటూ ప్రభోదాత్మక కవిత
  • అదే నేను : (వెనుక అట్టపై వేసిన కవిత) : మీరు ఏదనుకుంటే అలా నేను కనిపిస్తాను అంటూ భగవత్ రూపం గురించి ఒక సమకాలీన సినిమా ప్రేరణతో రాసిన కవిత.

తన రచనలు రక్షిత సుమ బ్లాగులో లభ్యం అవుతాయి.

మూలాలు[మార్చు]



బయటి లింకులు[మార్చు]