శిలాలోలిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిలాలోలిత
జననంలక్ష్మి
1958,జూలై 12
హైదరాబాద్
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుడాక్టర్. పి. లక్ష్మి
వృత్తిఅధ్యాపకురాలు
ప్రసిద్ధిమహిళా సాధికారత సాహిత్యం
పదవి పేరుడాక్టర్
భార్య / భర్తకవి యాకూబ్
పిల్లలు2, సందీప్, సాహిర్ భారతి

శిలాలోలిత కలం పేరుతో తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్న రచయిత్రి డాక్టర్ పి. లక్ష్మి. ఆమె కవయిత్రి, విమర్శకురాలు కూడా[1]

జననం

[మార్చు]

ఈమె 1958, జూలై 12హైదరాబాద్ లోని శంషాబాద్లో జన్మించారు. తల్లిదండ్రులు పి.యం మణి (రచయిత్రి), పి. రామిరెడ్డి (హిందీ ఉపాధ్యాయులు).[2]

విద్యాభ్యాసం

[మార్చు]
  • ప్రాథమిక విద్య రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లో,
  • ఉన్నత విద్య సుల్తాన్‌బజార్ లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో,
  • బి.ఏ (రాజనీతి శాస్త్రం, 1985) దూరవిద్యద్వారా ఆంధ్రా విశ్వవిద్యాలయం లో,
  • యం.ఏ (తెలుగు, 1987) కోఠి మహిళా కళాశాలలో,
  • తెలుగు పండిత శిక్షణ (1988 ), మసాబ్ ట్యాంక్ లోని కాంప్రహెన్సివ్ కళాశాలలో
  • యం.ఫిల్ (1989)
  • పి.హెడ్ డి (1998)లో చదివారు.

కుటుంబం

[మార్చు]

1991 మే 10న కవి యాకూబ్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సందీప్, సాహిర్ భారతి.

నివాసం - ఉద్యోగం

[మార్చు]

ప్రస్తుతం హైదరాబాద్ లోని చైతన్యపురిలో స్వంత ఇంటిలో నివసిస్తున్నారు. 1993 నుండి జి.యల్.ఆర్ న్యూ మోడల్ జూనియర్ కళాశాలలో తెలుగు జూనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

ప్రచురణలు

[మార్చు]
  1. 1993 - కవయిత్రుల కవిత్వంలో స్త్రీల మనోభావాలు ( యం.ఫిల్ పరిశోధనా వ్యాసం)
  2. 1999 - పంజరాన్నీ నేనే పక్షినీ నేనే (కవిత్వం)
  3. 2005 - ఎంతెంత దూరం (కవిత్వం)
  4. 2006 - కవయిత్రుల కవితా మార్గం ( పి.హెడ్ డి పరిశోధనా వ్యాసం)
  5. 2006 - నారి సారించి (సాహిత్య విమర్శనా వ్యాసం)
  6. 2013 - గాజునది (కవిత్వం)

మూలాలు

[మార్చు]
  1. 10టివి, అక్షరం (July 24, 2016). "ప్రగతి శీల భావాలతో కవిత్వాలు". Archived from the original on 28 July 2016. Retrieved 27 July 2016.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. నవతెలంగాణ, మానవి, ముఖాముఖి (13 January 2016). "అంత‌రంగ మ‌థ‌న‌మే క‌విత్వం". Retrieved 27 July 2016.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]