ది షాషాంక్ రిడంప్షన్
| The Shawshank Redemption | |
|---|---|
Theatrical release poster |
|
| దర్శకత్వము | Frank Darabont |
| నిర్మాత | Niki Marvin |
| రచన | Novella: Stephen King Screenplay: Frank Darabont |
| వ్యాఖ్యాత | Morgan Freeman James Whitmore |
| తారాగణం | Tim Robbins Morgan Freeman |
| సంగీతం | Thomas Newman |
| సినిమెటోగ్రఫీ | Roger Deakins |
| కూర్పు | Richard Francis-Bruce |
| డిస్ట్రిబ్యూటరు | Columbia Pictures (1994-1999) Warner Bros. (1999-present) |
| విడుదలైన తేదీలు | September 23, 1994 |
| నిడివి | 142 min. |
| దేశము | United States |
| భాష | English |
| బడ్జెట్ | $25 million |
| Gross revenue | $28,341,469 |
| All Movie Guide profile | |
| IMDb profile | |
స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడినది. రెండు దశాబ్దాలకు పైగా జైలులో ఒక వ్యక్తి సాగించిన జీవితం ఈ చిత్ర కథాంశం. సినీ చరిత్రలో ఒకానొక గొప్ప చిత్రంగా, అత్యంత ఉత్తేజపూరితమయిన చిత్రంగా పేరు తెచ్చుకుంది.
విషయ సూచిక |
కథాంశం [మార్చు]
1947 లో తన భార్యను, ఆమె ప్రియుడిని హత్య చేసాడన్న ఆరోపణలవల్ల ఆండీ అనే బ్యాంక్ ఉద్యోగి రెండు జీవితఖైదు శిక్షలను అనుభవించడానికి అత్యంత పటిష్టమయిన షాషాంక్ జైలుకు పంపించబడతాడు. జైల్లో అప్పటికే 20 ఏళ్ళకు పైగా శిక్ష అనుభవిస్తున్న రెడ్ అనే వ్యక్తితో మితృత్వం పెంచుకొని తనకు తనకు అవసరమయిన వస్తువులు జైలులోకి తెప్పించుకుంటాడు.
ఆండీ ఓకప్పుడు బ్యాంకు ఉద్యోగి కావడం వల్ల తన తెలివితేటలతో జైలు అధికారులకు ట్యాక్స్ కట్టడంలో లోటుపాట్లు తెలుపుతూ వారికి ట్యాక్సుల్లో మరింత డబ్బు మిగిల్చి ఆదరణ చురగొంటాడు. క్రమంగా జైలు వార్డెన్ కు ప్రీతిపాత్రుడవుతాడు. ప్రతి రోజు ఒక ఉత్తరం చొప్పున ఆరేళ్ళ పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి జైలులో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి మిగతా ఖైదీలలో మార్పు తీసుకొస్తాడు.
1965లో ఒక యువకుడు జైలుకు వచ్చి ఆండీ దగ్గర చదువు నేర్చుకుంటూ ఆండీ గతం తెలుసుకొంటాడు. ఆ రెండు హత్యలు చేసిన వ్యక్తి మరొక జైల్లో తన తోటీ ఖైదీగా ఉండేవాడని వివరిస్తాడు. ఆ యువకుడి మాటల ఆధారంగా తనపైన విచారణ తిరిగి మొదలుపెట్టించమని వార్డన్‌ను కోరుతాడు ఆండీ. ఆండీ నిర్దోషిగా బయట వెళ్తే జైల్లో తాను చేస్తున్న కార్యకలాపాలు తెలిసిపోతాయని ఆ యువకుడిని చంపిస్తాడు జైలు వార్డన్.
తాను ఎప్పటికయినా జైలు నుండి తప్పించుకొని మెక్సికోలో ఒక చిన్న వూరిలో హోటల్ పెట్టుకొని ఒక బోటు తయారు చేసుకుంటానని రెడ్‌తో చెప్తాడు ఆండీ. చివరగా రెడ్ జైలునుండి విడుదలయి మెక్సికోలో ఆండీని కలుసుకుంటాడు.
నిర్మాణం [మార్చు]
నూతన దర్శకులు కేవల ఒక్క డాలరు ($1) చెల్లించి తన కథలను సినిమా తీయవచ్చునని స్టీఫెన్ కింగ్ క్రొత్త దర్శకులను ప్రోత్సహించేవాడు. ఈ చిత్రం కూడా ఆ కోవకే చెందినది. ఈ చిత్ర దర్శకుడు ఆండీ పాత్రకు టాం హ్యాంక్స్ ను తీసుకోవాలి అనుకున్నా టాం హ్యాక్స్ అప్పటికే ఫారెస్ట్ గంప్ చిత్రంలో నటిస్తుండడం వల్ల ఈ చిత్రంలో నటించలేకపోయాడు. ఆండీగా టిం రాబిన్స్, రెడ్‌గా మోర్గాన్ ఫ్రీమన్ నటించారు.
దాదాపు మొత్తం షూటింగ్ ఒహాయో రాష్ట్రంలోని ఒక పాడుబడిన జైలులో జరిగింది.
స్పందన [మార్చు]
ఈ చిత్రం విడుదలయిన ఏడాది లయన్ కింగ్, ఫారెస్ట్ గంప్, పల్ప్ ఫిక్షన్ మొదలయిన చిత్రాలు విడుదల కావడంతో బాక్సాఫీసు వద్ద ఎక్కువ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఏడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయినప్పటికీ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. తరువాతి కాలంలో ఈ చిత్రం ఎంతో ఉత్తేజపూరితమయినది, నిరాశను పారద్రోలగలిగే చిత్రంగా ఎంతో ఆదరణ చురగొన్నది.
2002లో ఛానెల్ 4 నిర్వహించిన సర్వేలో ఈ చిత్రం మూడవ అతి గొప్ప చిత్రంగా ఎన్నికయినది.
2006లో ఎంపైర్ మేగజైన్ పాఠకులు ఈ చిత్రాన్ని ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత గొప్ప చిత్రంగా ఎన్నుకున్నారు.
2008లో ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో ఈ చిత్రం అప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న ది గాడ్‌ఫాదర్ చిత్రాన్ని రెండవ స్థానానికి నెట్టి ప్రథమ స్థానం ఆక్రమించింది.
బయటి లింకులు [మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో The Shawshank Redemption పేజీ
- The script for the film - varies slightly from the final version.
- The Shawshank Redemption at the Arts & Faith Top100 Spiritually Significant Films list
- A review from The Washington Post
- A review from PrisonFlicks.com