దేవదాస్ (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవదాస్
దేవదాస్ (2018) సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీరామ్ ఆదిత్య టి
నిర్మాతసి. అశ్వినీదత్
తారాగణంఅక్కినేని నాగార్జున
నాని
రష్మికా మందన్న
ఆకాంక్ష సింగ్
ఛాయాగ్రహణంశ్యామ్‌దత్. ఎస్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లువియాకామ్18 మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
27 సెప్టెంబరు 2018 (2018-09-27)
సినిమా నిడివి
159 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్20 కోట్లు[2]
బాక్సాఫీసుest. 50 కోట్లు[3]

దేవదాస్ 2018, సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం.[4] వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మాణ సారథ్యంలో టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, నాని, రష్మికా మందన్న, ఆకాంక్ష సింగ్ నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం 2019, నవంబరులో జీ స్టూడియోస్ సంస్థ డాన్ ఔర్ డాక్టర్ పేరుతో అనువాదం చేసింది.[5]

కథా నేపథ్యం

[మార్చు]

పదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్‌ దేవ (నాగార్జున), తనను ఆదరించి పెంచిన దాదా (శరత్‌ కుమార్‌)ను ప్రత్యర్థులు చంపేయటంతో బయటకు వస్తాడు. దేవ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు దేవాను పట్టుకోవాలని ప్లాన్ వేస్తారు. దీంతోపాటు దాదాను చంపిన డేవిడ్‌ (కునాల్ కపూర్‌) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఓ పోలీస్‌ దాడిలో గాయపడిన దేవకు డాక్టర్‌ దాస్‌ (నాని) చికిత్స చేస్తాడు. తన గురించి తెలిసినా కూడా పోలీసులకు పట్టివ్వని దాస్‌ మంచితనం చూసి, దేవ అతనితో స్నేహం చేస్తాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడిన దాస్‌, తరువాత దేవకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. ఇద్దరి మధ్య స్నేహం ఎలా కుదిరింది, పోలీసుల నుంచి, డేవిడ్‌ గ్యాంగ్‌ నుంచి దేవ తప్పించుకున్నాడా, దాదాను చంపిన వారి మీద పగ తీర్చుకున్నాడా అన్నది మిగతా కథ.[6]

నటవర్గం

[మార్చు]
ప్రధాన నటవర్గం
సహాయక నటవర్గం

సాంకేతికవర్గం

[మార్చు]

చిత్రీకరణ

[మార్చు]

ఇది హైదరాబాదు మెట్రో రైలు లో చిత్రీకరణ జరిగిన తొలిచిత్రం.[7][8]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. 2018, సెప్టెంబరు 21న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా, సినీరంగం ముఖ్యుల సమక్షంలో పాటల విడుదల కార్యక్రమం జరిగింది.[9] పాటలకు మిశ్రమ స్పందన లభించింది.[10]

దేవదాస్
పాటలు by
Released21 సెప్టెంబరు 2018 (2018-09-21)
Recorded2018
Genreపాటలు
Length29:16
Labelఆదిత్యా మ్యూజిక్
Producerమణిశర్మ
మణిశర్మ chronology
ఈ మాయ పేరేమిటో
(2018)
దేవదాస్
(2018)
పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వారు వీరు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఅనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య4:26
2."చెట్టు కింద డాక్టర్ (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిపద్మలత5:10
3."లక లక లకుమికర (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రినురాగ్ కులకర్ణి, శ్రీకృష్ణ4:53
4."హేయ్ బాబు (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రికార్తీక్, రమ్య బెహరా5:00
5."ఏమో ఏమో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిసిద్ శ్రీరామ్, రమ్య బెహరా4:26
6."మనసేదో వెతుకుతూ ఉంది (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రియాజిన్ నిజార్, అనురాగ్ కులకర్ణి5:21
మొత్తం నిడివి:29:16

స్పందన

[మార్చు]

ఈ చిత్రానికి సినీ విమర్శకుల, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.[11][12][13][14]

రేటింగ్

అవార్డులు - ప్రతిపాదనలు

[మార్చు]
కార్యక్రమ తేది అవార్డు విభాగం విజేత, నామినీ ఫలితాలు మూలాలు
15 & 16 ఆగస్టు 2019 దక్షణ భారత అంతర్జాతీయ సినిమా పురస్కారాలు ఉత్తమ ప్రతినాయకుడు – తెలుగు కునాల్ కపూర్ ప్రతిపాదించబడింది [17]

మూలాలు

[మార్చు]
  1. "DEVADAS – British Board of Film Classification". www.bbfc.co.uk. Retrieved 29 March 2020.
  2. Hooli, Shekhar H. (2 అక్టోబరు 2018). "Devadas box office collection 5-day: Nagarjuna-Nani starrer crosses Rs 30 crore mark worldwide". International Business Times, India Edition. Archived from the original on 11 అక్టోబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020.
  3. "Devadas Latest Box Office Collections Report". The Hans India. 14 అక్టోబరు 2018. Archived from the original on 19 జనవరి 2019. Retrieved 2 ఏప్రిల్ 2020.
  4. "Nagaruna and Nani-starrer Devadasu gets a release date – Times of India". The Times of India. Archived from the original on 28 ఆగస్టు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020.
  5. ZEE Cinema - Miliye superstars Nagarjuna aur Nani se jo... | Facebook (in ఇంగ్లీష్), retrieved 2 April 2020
  6. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
  7. "Nani- Akkineni Nagarjuna starrer is the first film to be shot in Hyderabad Metro".
  8. "Nagarjuna-Nani starrer becomes first film to shoot in Hyd metro".
  9. "Devadas (Audio launch)". Filmibeat. Archived from the original on 15 డిసెంబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020.
  10. "Devadas Music Review: Lacklustre album". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 31 అక్టోబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020.
  11. "Devadas review". www.thenewsminute.com. Archived from the original on 30 జనవరి 2019. Retrieved 2 ఏప్రిల్ 2020.
  12. "Review : DevaDas Review: An interesting first-half (2018)". www.sify.com. Archived from the original on 13 ఫిబ్రవరి 2019. Retrieved 2 ఏప్రిల్ 2020.
  13. Dundoo, Sangeetha Devi (27 సెప్టెంబరు 2018). "'Devadas' review: The N factor". Archived from the original on 28 సెప్టెంబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020 – via www.thehindu.com.
  14. kavirayani, suresh (30 సెప్టెంబరు 2018). "Devadas movie review: It's Nag and Nani show completely". Deccan Chronicle. Archived from the original on 16 నవంబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020.
  15. "Devadas Movie Review {3.5/5}: The Deva and Das show is thoroughly entertaining". Archived from the original on 16 జనవరి 2019. Retrieved 2 ఏప్రిల్ 2020 – via timesofindia.indiatimes.com.
  16. Venkat (27 సెప్టెంబరు 2018). "Devadas, Devadas Movie Review, Devadas Rating, Devadas Telugu Review". greatandhra.com. Archived from the original on 29 జనవరి 2019. Retrieved 2 ఏప్రిల్ 2020.
  17. "SIIMA Awards 2019: Here's a complete list of nominees". Times of India. 19 July 2019. Retrieved 2 April 2020.

ఇతర లంకెలు

[మార్చు]