అక్కినేని నాగార్జున
| నాగార్జున | |
| జన్మ నామం | అక్కినేని నాగార్జునరావు |
| జననం | ఆగష్టు 29 1959 (వయసు 52) |
| ఇతర పేరు(లు) | నాగ్, యువసామ్రాట్ |
| ప్రముఖ పాత్రలు | శివ (1989), అన్నమయ్య (1997), శ్రీరామదాసు (2006) |
అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించిన) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. ఇతను 1960, 70లలో ప్రఖ్యాత నటుడైన అక్కినేని నాగేశ్వర రావు యొక్క కుమారుడు.
విషయ సూచిక |
[మార్చు] వ్యక్తిగతం
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాధమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించాడు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. తరువాత మిచిగన్ విశ్వ విద్యాలయంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్నత విద్యను అభ్యసించాడు [1]. ఇతని ప్రధమ వివాహం ఫిబ్రవరి 18, 1984 [2] నాడు లక్ష్మితో [1] జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ కు సోదరి [3]. వీరిరువురు విడాకులు తీసుకున్నారు[4]. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడాడు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986) [2] మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994)[2] రెండవ భార్య కొడుకు.
[మార్చు] సినిమా జీవితము
నాగార్జున మొదటి చిత్రం విక్రం, మే 23, 1986లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కధానాయకుడి పాత్ర పోషించాడు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధుడు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించాడు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. మరియు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కధానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉన్నది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. శివ చిత్రాన్ని హిందీలో ద్రోహి అనే పేరుతో పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టాడు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించాడు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచినది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడి గా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడ అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు.
2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నాడు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించాడు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. నాగార్జున ఫొన్ నంబర్:- 9603635667
[మార్చు] అవీ-ఇవీ
- ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలములో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకొన్నాడు. భరణికి ఇతను మంచి మిత్రుదు.
[మార్చు] నటించిన చిత్రాలు
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store
- ↑ 2.0 2.1 2.2 http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html
- ↑ http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms
- ↑ http://www.totaltollywood.com/articles/nag2.html
ఫార్మాటు చేయకూడని పాఠ్యాన్ని ఇక్కడ చేర్చండి==బయటి లింకులు==