రమ్యకృష్ణ
కొంతకాలం క్రితం తెలుగు చలన చిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన కధానాయక రమ్యకృష్ణ. ప్రముఖ చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన ఈమె నటించింది. 1985లో వచ్చిన ఇద్దరు మిత్రులు చిత్రంతో కధానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రంద్వారా మంచినటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి.
రమ్యకృష్ణ నటించిన తెలుగు చిత్రాలు [మార్చు]
- ఇద్దరు మిత్రులు
- పైలా పచ్చీసు
- సూత్రధారులు
- అల్లుడుగారు
- అల్లరి మొగుడు
- అల్లరి ప్రియుడు
- అల్లరి ప్రేమికుడు
- ఘరానా బుల్లోడు
- ముద్దుల ప్రియుడు
- మేజర్ చంద్రకాంత్
- ముగ్గురు మొనగాళ్లు
- అల్లుడా మజాకా
- ఇద్దరు మిత్రులు (చిరంజీవి)
- ఇంగ్లీష్ పెళ్లాం - ఈస్ట్ గోదావరి మొగుడు
- మానవుడు - దానవుడు
- అదిరింది అల్లుడూ
- పెళ్లాల రాజ్యం
- ధర్మ చక్రం
- ఆవిడే శ్యామల
- సోగ్గాడి కాపురం
- సంకీర్తన
- రాజసింహం
- సమ్మక్క - సారక్క
- ఆయనకిద్దరు
- అమ్మోరు
- అన్నమయ్య
- క్రిమినల్
- బడ్జెట్ పద్మనాభం
- కంటే కూతుర్నే కను
- క్షేమంగా వెళ్లి లాభంగా రండి
- ఒకే మాట
- ప్రేమకు వేళాయెరా
- శ్రీఆంజనేయం
- శ్రీకృష్ణ 2006
- సింహాద్రి (ప్రత్యేక నృత్యం)
- ఈష్వర్ (ప్రత్యేక నృత్యం)
- శ్రీ రాజ రాజేశ్వరి
- లవ్ స్టోరీ 1999
- ఆహ్వానం
- హలో బ్రదర్
- బృందావనం
- చిన్నబ్బాయి
- బలరామకృష్ణులు
- బంగారు బుల్లోడు
- వంశోద్ధారకుడు
- దేవుడు
- చక్రవర్తి
- చంద్రలేఖ
- నా అల్లుడు
- తులసి
తెలుగు తల్లి\
తెలుగు రాత్రి