దగ్గుబాటి వెంకటేష్
| వెంకటేష్ | |
|---|---|
వెంకటేష్ |
|
| జననం | దగ్గుబాటి వెంకటేష్ డిసెంబరు 13 1960 (వయసు 52) కారంచేడు,ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
| బిరుదు(లు) | వెంకీ విక్టరీ వెంకటేష్ |
| వృత్తి | సినిమా నటుడు |
| భార్య / భర్త(లు) | నీరజ |
వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు,మరియు తెలుగు సినిమా అగ్రకథానాయకులలో ఒకడు.ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డు స్థాపించిన డి.రామానాయుడు కుమారుడు. ఈయన డిసెంబర్ 13, 1960 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. వెంకటేష్ అమెరికాలోని మాంటెర్రీ విశ్వవిద్యాలయములో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుళ్ళు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే,మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు.
ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఫరా, తబు, దివ్యభారతి, గౌతమి, ప్ర్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు.
సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. సౌందర్య తో ఆయన ఏడు సినిమాలు చేసారు. మీనా తో నాలుగు సినిమాలు చేసారు. ఆ నాలుగు విజయం సాధించాయి. అవి చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం. ఆర్తీ అగర్వాల్ తో మూడు సినిమాలు చేసారు.అవి నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి. ఆమూడు కూడా విజయం సాధించాయి.
వెంకటేష్ రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఎక్కువ సినిమాలు చేసారు.పైగా రాఘవేంద్రరావు వెంకటేష్ ని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడుగా పరిఛయం చేశారు.ఈ సినిమా అద్భుత ప్రజాదరణ పొందడంతో పాటు వెంకటెష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ లభించింది. ఆతర్వాత ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలు వెంకటేష్ కు నంది అవార్డులను అందించాయి.
విషయ సూచిక |
వ్యక్తిగత జీవితం [మార్చు]
వెంకటేష్ ప్రఖ్యాతి గాంచిన డాన్ బోస్కో, ఎగ్మోర్, మద్రాసు (ప్రస్తుత చెన్నై) నుండి పట్ట భదృడయ్యారు. మోంటెరే ఇన్స్టిస్టూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, యు.ఎస్.ఎ నుండి ఎంబిఎ పట్టా అందుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం చిత్ర నిర్మాణం చేబడదామనుకున్నారు, కాని తెలుగు చిత్రాలలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈయన తండ్రి, డి. రామానాయుడు గారు మరియు సోదరుడు డి. సురేష్ బాబు గారు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను నడుపుతున్నారు.
వెంకటేష్ నీరజ గారిని వివాహమాడారు. వీరికి ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు సంతానం. అబ్బాయి పేరు అర్జున్ రామంత్, అమ్మయిల పేర్లు ఆశ్రిత, హయవాహిని మరియు భావన.
నట జీవితం [మార్చు]
వెంకటేష్ 1986 లో కలియుగ పాండవులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. నటుడిగా రెండేళ్ళ ప్రాయంలోనే, ఆయన కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలం లో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చాడు, చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది. కొన్ని పరాజయాల తర్వాత మొదటి విజయం బొబ్బిలి రాజా రూపంలో లభించింది. బొబ్బిలి రాజా సంగీతపరంగా కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన శత్రువు సినిమాలో వెంకటేష్, న్యాయస్థానాల్లో అవినీతిని అరికట్టలేక, విసుగు చెంది, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ఒక ఆవేశపూరితుడైన యువ న్యాయవాది పాత్రను పోషించాడు. ఆ తరువాత విలక్షణ దర్శకుడైన రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో, విజయవంతమైన చిత్రం, క్షణక్షణం లో నటించాడు. ఆ తరువాత కొన్నేళ్లు వివిధ విజయవంతం కాని చిత్రాల్లో నటించాడు. అయితే, 1991లో తమిళ సినిమా చిన్నతంబిని తెలుగులో పునర్నిర్మించి విడుదల చేసిన చంటి సినిమా వెంకటేష్ సినీ వ్యాసాంగాన్ని ఒక మలుపుతిప్పిన చిత్రంగా భావించబడుతుంది. అప్పటిదాకా అవేశపూరిత యువకుని పాత్రలు ఎక్కువగా పోషించిన వెంకటేష్, చంటి పాత్రను చాలా శ్రమతో పండించాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో అదే సినిమా తిరిగితీసినప్పుడు (అనారీ) అందులో కుడా ప్రధాన పాత్రను వెంకటేషే పోషించాడు. ఈ చిత్రంతో వెంకటేష్ కుటుంబ తరహా చిత్రాలు కూడా చేయగలడన్న ముద్ర ఏర్పడింది. మహిళా ప్రేక్షకులలో ఆదరణ కూడా పెరిగింది. ఆ తరువాత వచ్చిన చాలా సినిమాలలో ఆయన ఫ్యామిలీ హీరో పాత్రలను ధరించాడు. ఈయన ఇటీవలి చిత్రాలు, లక్ష్మి , ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే మరియు తులసి చిత్రాలు వరుసగా విజయవంతమై వెంకటేష్ కు హ్యట్రిక్కును సాధించాయి.
వెంకటేష్ తన పనిని చాలా పట్టుదలతో చేస్తాడు. తనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయని పలు సందర్భాలలో చెప్పుకున్నారు. వెంకటేష్ వినోదభరిత చిత్రాలు కుటుంబసమేతంగా చూడదగినవి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. హాస్య ప్రధాన పాత్రలలో పోషిస్తూనే ఈయన ఘర్షణ , లక్ష్మి వంటి యాక్షన్ చిత్రాలను కూడా చేశాడు. ఈయన నటించిన కుటుంబ ప్రధాన చిత్రాలు ఈయనకు అనేక మంది మహిళా అభిమానులను సంపాదించాయి. 2007లో ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రానికి గానూ ఈయనకు స్వర్ణ నంది అవార్డు లభించింది.
చిత్రసమాహారం [మార్చు]
పురస్కారాలు [మార్చు]
- 1988 బ్రహ్మపుత్రుడు చిత్రమునకు గానూ ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారము
- 1988 స్వర్ణకమలం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము
- 1989 ప్రేమ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము
- 1989 ప్రేమ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారము
- 1990 బొబ్బిలి రాజా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కారము
- 1991 శత్రువు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా భాగ్యనగర్ పురస్కారము
- 1991 కూలీ నం. 1 చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కారము
- 1991 కూలీ నం. 1 చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా మద్రాస్ చిత్ర అభిమానుల పురస్కారము
- 1992 సుందరకాండ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా యువవాహిని పురస్కారము
- 1992 సుందరకాండ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కారము
- 1993 అబ్బాయిగారు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారము
- 1993 అబ్బాయిగారు చిత్రానికి గానూ ఉత్తమ నటనకు సినీగోయర్స్ పురస్కారము
- 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము
- 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారము
- 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారము
- 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా వంశీ బర్కిలీ పురస్కారము
- 1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము
- 1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారము
- 1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారము
- 2000 కలిసుందాం రా! చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము
- 2007 ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము