ఆర్తీ అగర్వాల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆర్తీ అగర్వాల్
AARTHI AGARWAL.jpg
జననం (1984-03-05) మార్చి 5, 1984 (వయస్సు: 31  సంవత్సరాలు)
 United States , New Jersey
భార్య / భర్త Ujjwal Kumar

ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమా నటీమణి. అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో న్యూజెర్సీలో పుట్టి పెరిగిన ఈమె 16 యేళ్ల వయసులో 2001 లో విడుదలైన హిందీ చిత్రము పాగల్‌పన్ తో భారతీయ సినిమాలలో అడుగుపెట్టింది. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్. నువ్వు నాకు నచ్చావ్ ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీ రంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన చిరంజీవి,వెంకటేష్,బాలకృష్ణ మరియు నాగార్జున ల సరసన నటిండమే కాక యువతరం కథానాయకులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్, తరుణ్ లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. బి.గోపాల్ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది (చివరిది అతిధి పాత్ర). వెంకటేష్ సరసన నటించిన మూడు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.అవి నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి.

వ్యక్తిగత జీవితము[మార్చు]

ఆర్తీ అగర్వాల్ అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలైంది. 2005లో క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఒక సహనటునితో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పని చేసినట్టు ఆర్తీ చెప్పింది.[1] 2007 నవంబర్ 22 న ఆర్తీ రాణీ గంజ్‌లోని ఆర్యసమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాసభారతీయుడు ఉజ్జ్వల్ కుమార్ ను వివాహమాడింది. వివాహం తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండి తిరిగి తెలుగు సినిమా రంగంలో రెండవ అంకాన్ని ప్రారంభించడానికి వచ్చింది. ఆర్తీ చెల్లెలు అదితి కూడా తెలుగు సినిమాలలో నటిగా అల్లు అర్జున్ చిత్రం గంగోత్రితో పరిచయమైంది.

నటించిన చలన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

హింది[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Actress Aarti Agarwal attempts suicide? The Hindu మార్చి 24, 2005

బయటి లింకులు[మార్చు]