దేవాంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Devala Maharshi.jpg
దేవాల మహర్షి (వీరికి దేవాంగ పురాణం అనే గ్రంథం ఉందని, అందులో తాము దేవల మహర్షి సంతానమని చెబుతారు)

దేవాంగ ( దేవాంగ శెట్టి,దేవాంగ చెట్టియార్ అని కూడా పిలుస్తారు).దక్షిణ భారతదేశానికి చెందిన హిందూ కులం.వీరు వస్త్ర వ్యాపారం, చేనేత, వ్యవసాయం చేస్తారు.కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో నివసిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన తరగతులు BC.బి.గ్రూపు లోని ఉన్నరు.

పురాణం

[మార్చు]

వీరు హిందు మతాన్ని ఆచరిస్తారు.ఆంధ్రప్రదేశ్,కర్ణాటక రాష్ట్రాలలో చేనేత వృత్తి చేసుకొనేవారు. విజయనగర సామ్రాజ్య పాలనలో తమిళనాడుకు వలస వెళ్ళి చెన్నై ప్రాంతంలో వస్త్ర వ్యాపారం చేశారు.హిందూ కుల వ్యవస్థలో శూద్ర హోదాలో ఉన్నారు.బ్రాహ్మణ హోదాను పొందేందుకు దేవాంగులకు పవిత్రమైన దేవాంగ పురాణాన్ని ఉపయోగిస్తారు.వీరికి దేవాంగ పురాణం అనే గ్రంథం ఉందని, అందులో తాము దేవల మహర్షి సంతానమని చెబుతారు. వీరిలో చాలామందికి జంధ్యాలు ఉంటాయి. వీరు వీరశైవ మతస్తులు. శ్రీ శైలం లో శివరాత్రి నాడు, దిగంబరంగా, దేవాంగులు శిఖరం ఎక్కి వస్త్రం కప్పుతారు. వీరిలో, చాలామందికి,శివునికి సంబందించిన పేర్లు మల్లేశ్వర , మల్లీశ్వరి, వీరభద్ర , భద్రకాళి , బసవ, శంకర, పార్వతి, పెట్టుకుంటారు. వీరభద్ర సంబరం జరుపుతారు.దేవాంగులు సొమ్ము జంగాలు పాలు అనే నానుడి ఉంది. దేవాంగులు ఎక్కువగా ఉండే గ్రామాలలో వీరభద్ర స్వామి గుడి , చాముండేశ్వరి గుడి తప్పకుండా ఉంటాయి. పెళ్ళికి ముందు వీరు వీరభద్ర పూజ చేస్తారు. కోనసీమ ప్రాంతంలో ప్రభలు తయారుచేసి, ప్రభల తీర్థం కి తీసుకు వెళతారు. ఆ సమయంలో, ఎవరి ప్రభ ఎక్కువ ఎత్తుగా ఉందో నిర్ణయిస్తారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దేవాంగ&oldid=4186780" నుండి వెలికితీశారు