దేవల మహర్షి
వికీపీడియా నుండి
- దేవ మనువు నకు ప్రజాపతి అను కుమారుడు కలిగెను. ఈ ప్రజా పతికి ధూమ్ర, బ్రహ్మవిద్య, మనస్విని, రతి, శ్వాస, శాండిలి, ప్రభాత అను ఏడుగురు భార్యల వలన ధరుడు, ధృవుడు, సోముడు, అహుడు, అనిలుడు, అగ్ని, ప్రత్యూషుడు మరియు ప్రభానుడు అను ఎనమండుగురు కుమారులు కలిగారు. ఈ ఎనమండుగురు పుత్రులు తదుపరి అష్టవసువులు గా ప్రసిద్ధి చెందినారు.
- ప్రజాపతి మరియు ప్రభాత లకు కలిగిన పుత్రుడు ప్రత్యూషుడు. ప్రత్యూషునకు వివాహము చేసుకొనిన తదుపరి ఇరువురు కుమారులను పొందెను. అందులో పెద్దవాడు దేవలుడు, రెండవ సంతానము విభువు.
- దేవలుడు శరీరము నలుపు వర్ణము కలిగి ఉండుటచే అతనికిఅసితుడు అని పేరు కూడా తదుపరి వచ్చినది.