వశిష్ట మహర్షి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
వశిష్ట మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి. సప్త ఋషులలో వశిష్ట మహర్షి కూడా ఒకడు. బ్రహ్మ యొక్క మానస పుతృడు. బ్రహ్మ యొక్క సంకల్ప బలంచేత జన్మించాడు.[1] సూర్యవంశానికి రాజపురోహితుడు. ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఙాలకు మెచ్చి కామధేనువు పుత్రిక అయిన నందిని అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత మరియు పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి జేష్టుడు. ఈతని భార్య యద్రుశ్యంన్తి. శక్తి పుత్రుడే పరాశరుడు.
ఇంకను వశిష్టుడు కుమారులుగా చిత్రకేతువు, పురోచిషుడు, విరచుడు, మిత్రుడు, వుల్భకుడు, వసుబృద్ధాకుడు మరియు ద్యుమన్తుడు అని ప్రసిద్ద గ్రంధముల వలన తెలియు చున్నది.
సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విధ్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.