నఫీసా జోసెఫ్

వికీపీడియా నుండి
Nafisa Joseph
దస్త్రం:Nafisa Joseph.jpg
జననం మార్చి 28 1978(1978-03-28)
మరణం జూలై 29 2004 (వయసు: 25)
Mumbai, Maharashtra, India

నఫీసా జోసెఫ్ (28 మార్చ్ 1979 -29 జూలై 2004) ఇండియన్ మోడల్ మరియు MTV వీడియో జాకీ. ఈమె 1997 మిస్ ఇండియా యూనివర్స్ విజేత, అదే సంవత్సరపు మిస్ యూనివర్స్ పోటీలో సెమీ-ఫైనలిస్ట్.

విషయ సూచిక

[మార్చు] జీవితచరిత్ర

నఫీసా జోసెఫ్ బెంగుళూర్ లో పెరిగింది. ఈమె కేరలైట్ సిరియన్ క్రిస్టియన్ తండ్రి నిర్మల్ జోసెఫ్, బెంగాలీ తల్లి ఉషా జోసెఫ్ల ఇద్దరు కూతుళ్ళలో చిన్నది, ఈమె తల్ల్లి టాగోర్ వంశస్థురాలు, షర్మిలా టాగోర్ చెల్లి వరస. నఫీసా బెంగుళూర్ లోనే ఉన్న బిషప్ కాటన్ బడిలో, సెయింట్.జోసెఫ్ కళాశాలలో చదువుకుంది. ఈమె కాథలిక్ కానీ ఈమె పేరులోని మొదటి పదం ఇస్లామిక్, ఇది ఈమె తండ్రి తరపు బామ్మ ముస్లిం అన్న నిజాన్ని తెలుపుతుంది.

[మార్చు] వృత్తి జీవితం

జోసెఫ్ 12 ఏళ్ళ వయస్సులో తన పొరుగింటివాళ్ళు ఒక వేర్ హౌస్ ప్రకటనకి మోడల్ గా అవకాశం ఇప్పించటంతో మోడలింగ్ మొదలుపెట్టింది. ప్రసాద్ బిడపా వలన ఈమె మోడల్ గా ఎదిగింది. ఈమె గెలుపొందిన 1997 మిస్ ఇండియా పోటీలో జోసెఫ్ అందరికంటే చిన్నది.

1999లో ఈమె MTV ఇండియా VJ పోటీకి న్యాయనిర్ణేత. ఒక వారం అనంతరం MTV లో ఒక కార్యక్రమం నిర్వహించడానికి ఆమెని స్క్రీన్ టెస్ట్ కి పిలిచారు. ఈమె MTV హౌస్ ఫుల్ షోని సుమారు ఐదేళ్ళపాటు నడిపింది. ఈమె చార్లెస్ ఏంజిల్స్ భారతీయ ప్రతి C.A.T.S టీవి కార్యక్రమంలో సోనీ ఎంటర్టైన్మెంట్ టీవి కి నటించింది. 2004లో స్టార్ వరల్డ్ లో స్టైల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈమె తన కాబోయే భర్త గౌతమ్ ఖండుజా సహకారంతో టీవి ప్రోగ్రామింగ్ విభాగ కంపెనీ 2'స్ ని కూడా ప్రారంభించింది. ఈమె గర్ల్జ్ అనే మాగజైన్ ని ఎడిట్ చేసింది.

మోడలింగ్, నిర్వహణలతోపాటు జోసెఫ్ జంతు ప్రేమికురాలు, ఈమె వీధికుక్కల సంరక్షణ కోసం ప్రచారం (WSD) నిర్వహించింది, పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ అఫ్ యానిమల్స్ (PETA), పీపుల్ ఫర్ యానిమల్స్ (PFA) వంటి జంతు రక్షణ సంస్థలకి ప్రచారం నిర్వహించి, టైమ్స్ అఫ్ ఇండియా బెంగుళూర్ ప్రతికి నఫీసా ఫర్ యానిమల్స్ అనే ప్రతివారపు అంశాన్ని రాసింది.[1]

[మార్చు] మరణం

జోసెఫ్ 2004 జూలై 29న ముంబయ్ లోని తన ఫ్లాట్ లో ఉరి వేసుకొని చనిపోయింది. ఆమె కొన్ని వారాలలో వ్యాపారవేత్త గౌతమ్ ఖండుజాని పెళ్లి చేసుకోవలసిఉంది. ఆమె తల్లిదండ్రుల ప్రకారం ఆమె పెళ్లి ఆగిపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం ఖండుజా రెండేళ్ళ క్రితం విడాకులు తీసుకున్నానని చెప్పి ఇంకా అదే సంబంధంలో కొనసాగడాన్ని జోసెఫ్ కనుగొంది. వాదన జరిగినపుడు ఖండుజా తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఆమె ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నిరాకరించడం లేదా ముందు నమోదు చేసుకొని విఫలమైన విడాకుల పత్రాలని ముందుంచడం. ఇంకా పత్రికా నివేదికల ప్రకారం ఆమె అతని భార్యతో మాట్లాడతానని బెదిరించిన తరువాత అతను ఆమెని బ్లాక్ మైల్ చేసాడు.[2]

జోసెఫ్ తల్లిదండ్రులు ఆమె ఫియాన్సి మీద ఆమె చావుకి కారణమని పోలీసు రిపోర్ట్ పెట్టారు, ఇందులో ఖండుజా పెళ్లి నుంచి కొద్ది రోజులు తప్పించుకోవడానికే ఈ పని చేసాడని, అతనిని విచారించాలని అడిగారు. 2005 నవంబర్లో ఖండుజాకి వ్యతిరేక విచారాన్ని బాంబే హైకోర్టు 2006 జనవరి వరకు నిలిపివేసింది. సుప్రీం కోర్టు ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అప్పగించాల్సిందిగా ఆజ్ఞాపించింది, కానీ 2006 మార్చ్ న ఈ కేసు వాదనకి రావలిసింది.[3]

ఖండుజా నిశ్చితార్థం విఫలమవ్వడం జోసెఫ్ ఆత్మహత్యకి కారణమనడానికి ఎటువంటి ఆధారాలు లేవని వాదించాడు. దీనికి నిదర్శనంగా అతను జోసెఫ్ సమీర్ మల్హోత్రా, సమీర్ సునీల్ లతో ముగిసిన ఆమె పూర్వపు నిశ్చితార్థాలను చూపించాడు.[4]

జోసెఫ్ మరణించిన సంవత్సరం తరువాత C.A.T.S. లో ఆమె స్నేహితురాలు మరియు సహా-నటి, మోడల్ కుల్జిత్ రంధ్వా కూడా ఆత్మహత్య చేసుకుంది.

[మార్చు] సూచనలు

[మార్చు] బాహ్య లింకులు


మూస:Start box |- style="text-align: center;" |- style="text-align:center;" |width="30%" align="center" rowspan="1"|ముందు
Sandhya Chib |width="40%" style="text-align: center;" rowspan="1"|Femina Miss India Universe
1997 |width="30%" align="center" rowspan="1"| తరువాత
Lymaraina D'Souza |- మూస:End box

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు