నల్లాల ఓదేలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లాల ఓదేలు
నల్లాల ఓదేలు


మాజీ శాసనసభ్యుడు
పదవీ కాలం
2009 - 2014, 2014 - 2018
ముందు జి.వినోద్
తరువాత బాల్క సుమన్
నియోజకవర్గం చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-07-10)1964 జూలై 10
మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా,తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ (2022 మే 19 నుండి 2022 అక్టోబర్ 05)
(2023 సెప్టెంబర్ 15 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాజం - పోశమ్మ
జీవిత భాగస్వామి భాగ్యలక్ష్మి
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

నల్లాల ఓదేలు, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.[1] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున 2009 నుండి 2018 వరకు చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఓదేలు 1964, జూలై 10న రాజం - పోశమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని మందమర్రి గ్రామంలో జన్మించాడు. ఓదేలు 1989లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పూర్తిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఓదేలుకు కోటపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఓదేలు ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్ గా కొంతకాలం పనిచేశాడు.[4]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

ఓదేలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 13వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా గెలుపొందాడు.[5] ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఓదేలు 2010, జూలై 30న జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యాడు. 2014లలో జరిగిన తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్ పై గెలుపొందాడు.[6][7] తెలంగాణ చీఫ్‌ విప్‌ గా నియమితులయ్యాడు.[8]

నల్లాల ఓదెలు టీఆర్‌ఎస్‌ పార్టీకి 2022 మే 19న రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[9][10] ఆయన 2022 అక్టోబర్ 05న ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాడు.[11] నల్లాల ఓదేలు 2023 సెప్టెంబర్ 15న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[12]

సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ ప్రత్యర్థి పార్టీ
2009 చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నల్లాల ఓదేలు టిఆర్ఎస్ జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ
2010 'ఉప ఎన్నిక' చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నల్లాల ఓదేలు టిఆర్ఎస్ జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ
2014 చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నల్లాల ఓదేలు టిఆర్ఎస్ జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ

మూలాలు[మార్చు]

  1. "Nallala Odelu MLA of Chennur (SC) Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-03-05. Retrieved 2022-02-10.
  2. "Andhra Pradesh News : Telangana activists boycott A.P. Formation Day fete". The Hindu. 2010-11-02. Archived from the original on 2010-11-05. Retrieved 2013-08-04.
  3. "Nallala Odelu (Member's Profile - Legislative Assembly - Telangana-Legislature)". www.telanganalegislature.org.in. Archived from the original on 2022-02-10. Retrieved 2022-02-10.
  4. "Nallala Odelu | MLA | TRS | Chennur | Adilabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-12. Archived from the original on 2021-04-20. Retrieved 2022-02-10.
  5. I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  7. "Nallala Odelu(TRS):Constituency- CHENNUR(ADILABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Archived from the original on 2017-09-20. Retrieved 2022-02-10.
  8. నేటిఏపి.కాం. "టీ చీఫ్ విప్ నల్లాల ఓదేలు". netiap.com. Archived from the original on 14 June 2014. Retrieved 27 February 2017.
  9. HMTV (19 May 2022). "కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  10. Eenadu (19 May 2022). "తెరాసతో తెగదెంపులు.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  11. HMTV (5 October 2022). "సొంతగూటికి నల్లాల ఓదెలు దంపతులు". Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
  12. V6 Velugu (16 September 2023). "మళ్లీ హస్తం గూటికి.. నల్లాల ఓదెలు దంపతులు". Archived from the original on 17 September 2023. Retrieved 17 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)