నిష్పత్తి

వికీపీడియా నుండి

నిష్పత్తి (Ratio) అనగా రెండు అంతకంటే ఎక్కువ విషయాలను పోల్చి చూపే గణిత విషయము.

వంతులు మరియు శాతాలు కొన్ని ప్రత్యేకమైన నిష్పత్తులు. వంతులు మొత్తంలో భాగాల్ని తెలియజేస్తే, శాతాలు మొత్తాన్ని 100 క్రింద భావించి దానిలోని భాగాల్ని తెలియజేస్తాయి.


ఒక 2:3 ("రెండు ఈజ్ టు మూడు") అనగా ఒక వస్తువు మొత్తంలో రెండు భాగాలు మరియు రెండవ వస్తువు మొత్తంలో మూడు భాగాలు; అంటే మొత్తంలో ఐదు భాగాలున్నాయి అని అర్థం వస్తుంది. ఉదాహరణకు ఒక సంచిలో రెండు ఏపిల్స్ మరియు మూడు బత్తాయిలు ఉంటే వాటి నిష్పత్తి 2:3 అన్నమాట. అయితే ఆ సంచిలోనే మరొక రెండు ఏపిల్స్, మూడు బత్తాయిలు చేర్చిన నిష్పత్తి 4:6 అవుతుంది. ఇది 2:3 కి సమానం. ఇదే ఉదాహరణలో 2/5 లేదా 40 శాతం ఏపిల్స్ మరియు 60 శాతం బత్తాయిలు ఉన్నాయి అని అర్ధం. అలాగే సంచిలో ఐదింట రెండు వంతులు ఏపిల్స్ మరియు ఐదింట మూడు వంతులు బత్తాయిలు ఉన్నాయి అని అర్ధం వస్తుంది.

పేజీకి సంభందించిన లింకులు