Jump to content

నీలగిరి తైలం

వికీపీడియా నుండి
మందుగా నీలగిరితైలం(యూకలిప్టస్)

నీలగిరి చెట్టును జామాయిల్ అని కూడా అంటారు. దీనిని ఇంగ్లిషులో యూకలిప్టస్ అంటారు. ఈ చెట్టు నుంచి లభించే తైలాన్ని నీలగిరి తైలం అంటారు. నీలగిరి కొండలలో పెరగటం వల్ల ఈ చెట్లకు నీలగిరి చెట్టు అనే పేరు వచ్చింది. ఈ చెట్టు ఆకులను నలిపితే జండు బామ్ మాదిరిగా ఘాటైన వాసన వస్తుంది.
నూనె రంగులేని లేదా లేత పసుపు రంగు ద్రవ్యం.నీలగిరి తైలం వోలటైల్ ద్రవ్యం.అనగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారు పదార్థాలను వోలటైల్ లు అంటారు.నీలగిరి తైలం ఒకఘాటైన విశిష్టమైన సువాసన కల్గి వున్నది.పలుచనిద్రవాం,అనగా సిగ్నత తక్కువ వున్న ద్రవం.

నీలగిరి/యూకలిప్టస్ తైలం ఆవశ్యక నూనెలుకు చెందిన నూనె/తైలం.నీలగిరి తైలం లేదా యూకలిప్టస్ నూనె ఒక ఆవశ్యక నూనె. నీలగిరి తైలాన్ని యూకలిప్టస్ ఆకుల నుండి తీస్తారు.స్టీము డిస్టిలేసను పద్ధతిలో ఆకులనుండి ఉత్పత్తి చేస్తారు.ఈ నూనెను వైద్యపరంగా వాళ్ళునొప్పులు,తలనొప్పి,కీళ్ల నొప్పుల వంటి వాటికి మర్దన నూనెగా ఉపయోగిస్తారు. ఆమ్టే కాకుండా యాంటీ సెప్టిక్ గా,సువాసన ఇచ్చు ద్రవ్యంగా,క్రిమి కీటకాలను పారదోలుతాకు ఉపయోగిస్తారు. నీలగిరి తైలాన్ని మందుల తయారీలో,సుగంధ ద్రవ్యాల తయారీలో, పారిశ్రామికంగా ఉపయోగిస్తారు.

చెట్లు చల్లని వాతావరణ ప్రాంతాలలోనే పెరుగుతాయి. ఈ చెట్లనుంచి వీచేగాలి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. నీలగిరి చెట్టు ఆకులు, వేళ్ళు, చెట్టుబెరడు ఆయుర్వేద వైద్యంలో వాడబడుతుంది. నీలగిరి తైలం ఔషధంగా ఉపయోగిస్తుంది. ఈ తైలాన్ని ఇంగ్లీషులో యూకలిప్టస్‌ ఆయిల్‌ అంటారు.
1. ఈ తైలం వాసన ఘాటుగా ఉంటుంది. ఇది నొప్పులకు నివారణగా పనిచేస్తుంది.
2. తలనొప్పితో బాధపడేవారు నీలగిరి తైలాన్ని నుదుటికి పట్టిస్తే, నొప్పి తగ్గిపోతుంది.
3. ఈ తైలాన్ని సన్నని క్లాత్‌మీద వేసి వాసన చూస్తుంటే జలుబు, గొంతునొప్పి తగ్గి పోతుంది.
4. మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే యూకలిప్టస్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసి, వేడినీటితో కాపడం పెట్టాలి.
5. మడమ నొప్పి వచ్చి నడవలేకపోతూంటే ఆ ప్రాంతంలో నీలగిరి తైలంతో బాగా మసాజ్‌ చేయాలి.
6. గోరువెచ్చని నీటిలో మూడు, నాలుగు చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి త్రాగినట్లయి తే అజీర్ణం, అజీర్తి విరేచనాలు తగ్గుతాయి.
7. నడుం నొప్పితో బాధపడేవారు నీలగిరి తైలాన్ని వేడినీటిలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం పెడితేనొప్పి ఉపశ మిస్తుంది.
8. ఒళ్ళు నొప్పులుగా ఉంటే, స్నానం చేసే నీటిలో ఏడెనిమిది చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి స్నానం చేస్తే నొప్పులన్నీ తగ్గిపోతాయి.
9. పిప్పి పన్నుతో చెంపవాచి బాధ కలుగుతున్నప్పుడు, చెంప మీద యూకలి ప్టస్‌ ఆయిల్‌ను రాస్తే నొప్పి తగ్గుతుంది.
10. నీలగిరి తైలం వాడకం వల్ల చర్మానికి ఎటువంటి ఎలర్జీలు ఏర్పడవు.
శ్వాసకోశంలో చేరే పాథో జెనిక్ బాక్టీరియా నాశక మందుల్లో ఉపయోగిస్తారు.ఇన్హేలరులో ఉపయోగిస్తారు.శ్వాస కోశ ఇబ్బంది వున్నవాళ్లకుdecongestant గా యూకలిప్టస్ నూనె వున్న మందులను ఉపయోగిస్తారు. anti-inflammatory గుణం వున్నందున ముక్కు శ్వాస నాళం కుండా నీరు కారడం ఆపును.యూకలిప్టస్ నూనెలోని ఇతర ముఖ్య రసాయనాలైన యూకలిప్టోల్,ఆల్ఫా టేర్పినోల్,,వంటివి నూనె త్వరగా ఆవిరి ఆవడం వలన చల్లదనాన్ని ఇచ్చును. anti-inflammatory and analgesic గుణాలు కల్గి వున్నది.యూకలిప్టస్ నూనె మంచి వాసన ను వెలువరించు ఆరోమాటిక్ సమూహానికి చెందిన సువాసన రసాయనాలను కల్గివున్నందున ఈ నూనెను సుగంధ /పరిమళ ద్రవ్యాలలో తక్కువ ప్రమాణంలో(.002%) ఉపయోగిస్తారు.డెటెర్జెంటులు,సబ్బులు తయారీలో కూడా యూకలిప్టస్ నూనెను ఉపయోగిస్తారు.

నూనె ఉత్పతి

[మార్చు]

నీలగిరి తైలాన్ని దక్షిన ఆఫ్రికా, పోర్చుగళ్, స్పైన్, బ్రెజిల్,ఆస్ట్రేలియా,,చీలే, స్వాజిలాండ్ దేశాల్లో ఎక్కువ గా ఉత్పత్తి చేస్తారు.నీలగిరి తైలం లో సినోల్(cineole)ఎక్కువ పరిమాణంలో వుండును. యూకలిప్టస్ చెట్టుల్లో పలురకాలు వున్నాయి. నీలగిరి తైలాన్నిఎక్కువ గా యూకలిప్టస్ గ్లోబులస్ చెట్టు ఆకులనుండి ఉత్పత్తి చేస్తున్నప్పటికి, యూకలిప్టస్ కోచీ., యూకలిప్ట స్ బ్రాక్టియా చెట్టా ఆకులనుండి ఉత్పత్తి చేసిన నూనెలో సినోల్ శాతం అధికంగా వుండును. వాటి నూనెలో సినోల్ 80-95% వరకు ఉండును. యూకలిప్టస్ సిట్రీయోడోర అనే చెట్టు ఆకుల నుండి తీసిన నూనెను ఎక్కువ పెర్ఫ్యూమ్స్/సుగంధ ద్రవ్యాలు (perfume) తయారీలో ఉపయోగిస్తారు.సినోల్ ఎక్కువ ఉన్న యూకలిప్టస్ నూనెను ఔషడ తయారీ రంగంలో జలుబు, ఇన్ఫ్లూయోజా ల నివారణ మందులలో ఉపయోగిస్తారు.

నూనె భౌతిక లక్షణాలు

[మార్చు]
వరుస సంఖ్య గుణం మితి
1 అణుఫార్ములా C10H18O
2 అణు భారం 154.253
3 బాష్పీభవన స్థానం 349 to 351° F
4 ద్రవీభవన స్థానం 34.7° F
4 సాంద్రత 0.9267 గ్రాములు/సెం.మీ3,20 deg వద్ద
5 ద్రావణీయత ఈథరు.ఆల్కహాల్ క్లోరోఫారమ్ వంటి వాటిలోకరుగును.

భద్రత, విషప్రభావం

[మార్చు]

యూకలిప్టస్ నూనెను నేరుగా తక్కువ ప్రమాణంలో కడులోకి తీసుకున్న ప్రమాదమేమి లేదు.కానీ ఎక్క్య్వ ప్రమాణంలో కడుపులోకి తీసుకున్న ఆరోగ్ర్యకరమైన ఇబ్బందులుఏర్పడును.ఆజీర్తి చెయ్యవచ్చును.ఒక కేజీ శారీరక బరువుకు 0.05-0.5 మిల్లీ లీటరు ప్రమాణం మానిసికి ప్రాణాంతకం కావొచ్చును .చిన్న పిల్లలైన 4-5 మిల్లీ లీటర్లు తీసుకున్న ప్రాణాంతకం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

నీలగిరి చెట్టు