పశుపతి నాగనాథ కవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పశుపతి నాగనాథ కవి తెలుగు కవి, సంస్కృత పండితుడు.

జీవిత విశేషాలు[మార్చు]

నాగనాథ కవి శాసన ప్రమాణాల ప్రకారం ఇతను సా.శ.1369 కాలం నాటి వాడు[1]. ఇతని తండ్రి గారు పశుపతి. అందుకే ఆయనను పశుపతి నాగనాథ కవిగా వ్యవహరిస్తారు. ఇతను అనపోతనాయకుని ఆస్థాన కవి. అనపోతనాయకుడు పద్మ నాయకులలో ఆరవ వాడు. ఇతని గురువు విశ్వేశ్వర కవి చంద్రుడు. గురువు గారు చమత్కార చంద్రిక అనే కావ్యాలంకార గ్రంథం వ్రాసాడు. ఇందులో కావ్య గుణ దోషాల గురించి విపులమైన చర్చ జరిపాడు. ఇదియే కాక విశ్వస్వర కవి చమత్కార చంద్రిక, కందర్ప సంభవం, కరునాకందళం, వీర భద్ర విభ్రున్జనం వంటి పెక్కు రచనలు చేసాడు. అతని శిష్యుడైన నాగ నాథ కవి సంస్కృత, తెలుగు భాషాల్లో పండితుడు.

నాగనాథ కవి రచనలు[మార్చు]

మదన విలాసం అనే భాణం వ్రాసినట్లు విష్ణు పురాణాన్ని తెనిగించినట్లు శాసన ప్రమాణాల ద్వారా తెలియవస్తున్నది గానీ ఇవి రెండూ అలభ్యాలు[1]. మదన విలాసం గురించి నిడదవోలు వెంకట రావు గారు, చాగంటి శేషయ్య గారు పరిశోధనలు చేసారు. సా.శ. 1530-1550 మధ్యన వెన్నెలకంటి సూరన కుడా విష్ణు పురాణాన్ని తెనిగించాడు[2]. నాగనాథ కవి ముఖ్యంగా శాసన లేఖకుడు. చారిత్రాత్మకమైన ఐనవోలు శాసనం సా.శ. 1369 నాటిది. దీని లేఖకుడు నాగనాథ కవి.

ఇతనిని కొరవి గోపా రాజు పూర్వ కవిగా స్తుతించాడు. కొరవి గోపా రాజు పెద తండ్రులు అనపోతనాయిని గారి కుమారుడైన సింగమనాయినమంవారి ఆస్థానంలో మంత్రులు. అందుచేత అప్పటికి పద్మ నాయిక ఆస్థానంలో ప్రముఖుడైన పశుపతి నాగ నాథ కవిని స్తుతించి ఉండవచ్చు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]