Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

పలుపులవీడు

వికీపీడియా నుండి
(పాపులవీడు నుండి దారిమార్పు చెందింది)


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం, ముండ్లపాడు పంచాయతీ బురుజుపల్లె గ్రామానికి కొద్ది దూరంలో అడవిప్రాంతం ఉంది. అక్కడ చరిత్రకు అందని కాలంలో నల్లమల అడవిలో ఉలింద చెట్టు క్రింద శివలింగం వుండేది. దానిని ఆటవికులు, సాధువులు వెళ్ళి పూజించేవారు.

స్థలపురాణం

[మార్చు]

కాశీ పట్టణాన్ని బ్రుగువ రాజు పాలించేవాడు. ఆయనకు సంతానం లేక కాశీ విశ్వేశ్వరుని గురించి ధ్యానించి పూజించడంతో పురుష సంతానం కలిగింది. అతని ముఖముకు వికృతమైన మాంసపు కండలు వేలాడుతూ జన్మించాడు. ఆ కుమారున్ని చూసి రాజు మిక్కిలి చింతించి దిగులులో పరుండి నిద్రించు చుండగా ఒకనాటి రాత్రి కలలలో కాల భైరవుడు కనిపించి మీకుమారున్ని దక్షిణా పదమున పుణ్య తీర్ధములులలో స్నానమాడించిన ఆ మాంసపు కండలు ఊడి పోవునని తెలిపెను. దానితో రాజు శ్రీశైల క్షేత్రములు దర్శించి చివరకు పాపులవీడుకు వచ్చి ఆ శివలింగమును పూజించి ప్రక్కనే ఉన్న నీటి పడియలో కుమారున్ని స్నానం చేయించాడు. వెంటనే ఆ పిల్లవాని ముఖానికి వున్న మాంసపు ఖండలు వూడిపోయాయి. అందుచేత పలుపు ఆకారం నున్న మాంసపు ఖండములు ఊడిపోయిన చోటు కావున దానికి పలుపులవీడు అని నామకరణం చేసి ఆ శివలింగమునకు గుడి కట్టించి బ్రుగువ రాజు వెళ్ళెను. అప్పటి నుండి ఆ దేవాలయమునకు పలుపులవీడు బీరవీశ్వరుడు అని పిలిచెడివారు. 1214 సంవత్సరమున సరెయ్న ఆనంద నామ సంవతరమున మనుమ సిద్ధి మహారాజు సామంతుడైన రాయదేవ మహారాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరింఛి ఆలయానికి కొద్దిపాటి భూవసతి కల్పించారు. ఈ విషయం తెలుపు శాసనం అచట ఉంది. సమీపంలోని కొత్తకోట గ్రామం ను పాలించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇచ్చట కోనేటిని త్రవ్వించారని జనులు అనుకుంటారు.

ఈ పురాతన శ్రీ భైరవేశ్వరుని ఆలయం (శివాలయం) వద్ద, గర్భగుడి ఆవరణలో, మండపం జీర్ణోద్ధరణ పనులు, రెండు నెలల నుండి నిర్వహించుచున్నారు.

మూలాలు

[మార్చు]