వికీపీడియా:సహాయ కేంద్రం
|
|
| కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి. |
- ప్రాపంచిక ప్రశ్నల కొరకు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?), ముందు తెవికీలో శోధన చేసి ఆతరువాత అవసరమైతే సంప్రదింపుల కేంద్రం ( Reference Desk) చూడండి.
- అడిగే ముందు, మీ ప్రశ్న తరచూ అడిగే ప్రశ్నలలో ఇప్పటికే సమాధానము ఉందేమే చూడండి.
- సాంకేతిక విషయాలపై సమాచారం కొరకు రచ్చబండ చూడండి.
- సభ్యుల మధ్య వివాదాల పరిష్కారం కొరకు వివాద పరిష్కారం చూడండి.
సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.
ప్రశ్న ఎలా అడగాలి
- ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి.
- ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
- సూటిగా, వివరంగా అడగండి.
- ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే,
~~~~అని టైపు చెయ్యండి. లేకపోతే, మీ పేరు రాయవచ్చు లేదాఆకాశరామన్నఅని రాయవచ్చు. - ప్రశ్నలకు ఈ-మెయిల్ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్ కు గోప్యత ఉండదు.
- అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి.
- మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు.
- అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.
- ప్రశ్న తెలుగులోనే అడగండి.
- ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్ ఇంజిన్ కాదు.
సమాధానం ఎలా ఇవ్వాలి
- వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి.
- క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి.
- సమాధానం తెలుగులోనే ఇవ్వండి.
- వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది.
- వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, చర్చా పేజీ చూడండి.
[మార్చు] net
how to download any video from google.co.in?
[మార్చు] pratyeka - Instead of 'PravesInchu', it is Printed as 'PravesAnchu'
In the Sign In / Sign Up page under Pratyeka Category, the heading is wrongly written as PravesAnchu instead of PravesInchu. Please correct.
- ✔ అచ్చుతప్పుని గుర్తించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు. దీన్ని సరిచేసాను. ఆ మార్పు మరికొద్దిసేపట్లో తెవికీలో ప్రతిఫలిస్తుంది. —వీవెన్ (చర్చ) 09:11, 6 మార్చి 2012 (UTC)
[మార్చు] I have written some telugu literature how can i upload
I have written some telugu literature how can i upload sreenivasa sooktulu, patalu, kavithalu,-- yedla srinivasa rao
- మీ స్వంత కృతులైతే, వాటిని ఇతరులు అభివృద్ధి చేయవచ్చు అనుకుంటే వికీబుక్స్ లో చేర్చవచ్చు. లేకపోతే మీ స్వంత బ్లాగు లేక వెబ్సైటు లోచేర్చుకోండి. మరిన్ని వివరాలకు ఏది వికీపీడియా కాదుచూడండి. --అర్జున (చర్చ) 03:07, 12 మార్చి 2012 (UTC)
[మార్చు] లాగిన్ అయ్యాక,తెలుగులో టైపు చెయ్యలేక పోవుచున్నాను
[మార్చు] Problem to type in telugu after login
after login in my account,when I click edit box of the essay page or 'prayoga shala'edit box,the editorial symbols and boxes appearing in multicolor and I am not able to type in Telugu.But if I enter edit without logging in my account,I can type in Telugu.In this regard I invite co-menbers suggestions and advices.Rama krishna reddy.P 05:44, 15 మార్చి 2012 (UTC)
- Kindly press Escape key once and try to type. Chavakiran (చర్చ) 05:48, 15 మార్చి 2012 (UTC)
Sri chavikiran,Even after pressing ESc button I am not able to type in Telugu. can you Please give any other suggestionRama krishna reddy.P 07:21, 15 మార్చి 2012 (UTC)
-
- ప్రస్తుతానికి http://lekhini.org నందు టైప్ చేసి ఇక్కడ అతికించండి. ఈ లోపులో మీ సమస్యను పరిశీలిద్దాం. మీ బ్రౌజర్ ఏమిటి? వేరే బ్రౌజరులో ప్రయత్నించారా? Chavakiran (చర్చ) 07:52, 15 మార్చి 2012 (UTC)
- బ్రౌజర్ మారిస్తే మీ సమస్య తీరవచ్చును.Rajasekhar1961 (చర్చ) 12:43, 15 మార్చి 2012 (UTC)
[మార్చు] కాలిక్యులెసన్ సమీకరణాలు వ్రాయడం
నేను నూనెగింజలను,నూనెలను పరిక్షించే పద్ధతులను వ్రాద్దామనుకుంటున్నాను.వ్యాసం చివర లెక్కించే విధానం(calculation)వ్యాయాల్సివుంటుంది. ప్రయోగశాలలో ప్రయత్నించాను.కాని కుదరలేదు.సలహ యివ్వగలరు.ఉదాహరణకు(w3-w1)X 100 divided by (w2-w1).Rama krishna reddy.P 09:58, 17 ఏప్రిల్ 2012 (UTC)
[మార్చు] ఫార్ములాలు/ఇక్వెసన్ లను వ్రాయడం ఎలా?
సైంస్ కు చెందిన ఫార్ములాలు ఎలా వ్రాయాలి.? ఉదా:(w1-w2) X100 whole divided by (w1-w) Rama krishna reddy.P 15:58, 7 మే 2012 (UTC)
[మార్చు] తెలుగు పదాలు
నేను గత రెండు సంవస్త్సరములుగ అచ్చ తెలుగు పదాల కోసము వెతుకుతున్నాను,. కాని ఆసించిన ఫలితం దక్కలెదు.... కావున మన తెలుగు వికీ లొ అటువంటి అనుసన్దానము ఎద్యెన ఉన్నచొ తెలపగలరు...క్రుతగ్నుడ్ని
- అచ్చ తెలుగు పదాలు అంటే ఏమిటి? అవి మీకు ఎలా ఉపయోగంగా వుంటాయో వివరించండి. --అర్జున (చర్చ) 08:32, 17 మే 2012 (UTC)
- క్షమించాలి,అంటె ఒక నిగంటువు లంటిది కావాలని నా అంతరార్తము(ఇందులొ నిగంటువు అనె పదం కూడ అచ్చ తెలుగు అని నా అర్థము) .. స్పందించినందుకు క్రుతఙతలు అర్జున్ గారు.
- నిఘంటువు చూడండి. వికీ ప్రాజెక్టుల వారి నిఘంటువు విక్షనరీకూడా చూడవచ్చు.--అర్జున (చర్చ) 09:59, 17 మే 2012 (UTC)
- అర్జున్ గారు మీకు క్రుతఙ్నుడిని, అలగే పర్యాయ పదాలు సమూహము వెబ్సయిట్ లెదా ఎదయిన అనుసందానము పంపగలరు. సతీష్ రత్నం
- పర్యాయ పదాలు మన నిఘంటువులలో ప్రధాన అర్థం తరువాత వరుసనే రాస్తారు. నాకు తెలిసి ఇంగ్లీషు థెసారస్ లాగా మన తెలుగులో రాలేదు. తెలుగు -ఇంగ్లీషు పై ఆసక్తి వుంటే వేమూరి గారి తెలుగు ఇంగ్లీషు నిఘంటువు చూడవచ్చు.--అర్జున (చర్చ) 12:47, 17 మే 2012 (UTC)
- అర్జున్ గారు మీకు క్రుతఙ్నుడిని, అలగే పర్యాయ పదాలు సమూహము వెబ్సయిట్ లెదా ఎదయిన అనుసందానము పంపగలరు. సతీష్ రత్నం
- నిఘంటువు చూడండి. వికీ ప్రాజెక్టుల వారి నిఘంటువు విక్షనరీకూడా చూడవచ్చు.--అర్జున (చర్చ) 09:59, 17 మే 2012 (UTC)
- క్షమించాలి,అంటె ఒక నిగంటువు లంటిది కావాలని నా అంతరార్తము(ఇందులొ నిగంటువు అనె పదం కూడ అచ్చ తెలుగు అని నా అర్థము) .. స్పందించినందుకు క్రుతఙతలు అర్జున్ గారు.
[మార్చు] give a telugu names list to name our get together party....
we want to name our get together party in telugu. so plz send some unique names list in telugu which will apt for the function...
thank u పై వ్యాఖ్య అనామక సంపాదకుడు మే 26 2012 న రాశారు.