వికీపీడియా:కొత్తపేజీ మార్గదర్శకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వాగతం, కొత్త వ్యాసం మొదలుపెడుతున్నారా..?
అది తెవికీలో ఈసరికే ఉందేమో చూడండి
వేరే పేర్లతో ఉందేమో చూడండి
వ్యాస విషయానికి సంబంధించిన వేరే వ్యాసాల్లో మీరు రాయదలచిన సమాచారం ఉందేమో చూడండి
లేదా! అయితే కొత్త వ్యాసం పేజీని మొదలు పెట్టండి
ఒక్క లైను తోటో, ఒకే వాక్యం తోటో వ్యాసాన్ని సరిపెట్టకండి.
ఒకే దిద్దుబాటులో మొత్తం వ్యాసమంతా రాసెయ్యనక్కరలేదు. ఒక్కో వాక్యాన్నే చేరుస్తూ అనేక సార్లు ప్రచురించవచ్చు.
అలా ప్రచురిస్తూ, మీ చిన్నారి వ్యాసం నెమ్మదిగా ఎదుగుతూ ఉంటే కలిగే ఆనందాన్ని అనుభవించండి.
కనీసం 150 పదాలు ఉంటే, వ్యాసం పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుంది, గమనించండి.
రాసిన పాఠ్యాన్ని ఓసారి సరిచూడండి. వ్యాకరణదోషాలను, అక్షరదోషాలనూ సరిచెయ్యండి.
కనీసం మూడు అంతర్గత లింకులుండేలా చూడండి -అగాధ పేజీ కానివ్వకండి.
ఈ వ్యాసానికి సంబంధించిన ఇతర వ్యాసాల నుండి కనీసం ఒక్క లింకైనా ఇవ్వండి -అనాథను చెయ్యకండి.
వ్యాసాన్ని కనీసం ఒక్క వర్గంలోనైనా చేర్చండి -తెవికీని ఓ క్రమపద్ధతిలో పేర్చండి.
అవసరాన్ని బట్టి మూలాలను ఇవ్వండి -వ్యాసానికి విశ్వసనీయతను పెంచండి.
ఇవి చేసాకే మరో కొత్త వ్యాసం మొదలు పెట్టండి. తెవికీ నాణ్యతను పెంచండి.