పురందర దాసు

వికీపీడియా నుండి
పురందర దాసు
జన్మనామం శ్రీనివాస నాయక్
జననం 1484
మూలం Flag of India క్షేమపుర, శివమొగ్గ, కర్ణాటక
మరణం 1564
సాహిత్యం కర్ణాటక సంగీతం
వృత్తులు గాత్రం

పురందర దాసు (Purandara Dasa) (1484 – 1564) (కన్నడ: ಪುರಂದರ ದಾಸ)[1] ప్రప్రధమ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు కర్ణాటక సంగీత పితామహులు.[2][3] ఇతడు రచించిన కీర్తనలు ఎక్కువగా కన్నడంలో, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి .[4] అన్ని కీర్తనలు విష్ణుమూర్తికి అంకితమిస్తూ 'పురందర విఠలా' తోనే అంతం చేశాడు. కొందరి అంచనా ప్రకారం దాసుగారు 475,000 కీర్తనలు రచించారు. అయితే అందులో ఒక వెయ్యి మాత్రమే మనకు లభించాయి.[5] పురందర దాసు కీర్తనలు చాలా పుస్తకాలు మరియు వెబ్ సైటులలో ఉన్నాయి.[6] వీనిలో ఇంచుమించు 225 బహుళ ప్రాచుర్యం పొందినవి అచ్చువేశారు.[7] ఇంచుమించు 100 కీర్తనలు ఇంగ్లీషులో అచ్చువేశారు.[8] పురందర దాసు సంఘంలో అన్ని తరగతుల వారికి చెందిన కీర్తనలు రచించారు. ప్రతి కీర్తన భాషాపరంగా, సంగీతపరంగా అత్యంత విలువలు కలవిగా ప్రశంసించబడ్డాయి.[9]

[మార్చు] జీవితచరిత్ర

పురందర దాసు క్రీ.శ. 1484లో పూనా సమీపాన గల గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి వరదప్ప నాయక్ ప్రముఖ వడ్డీ వ్యాపారి. తల్లిదండ్రులు వేంకటేశ్వరుని భక్తులగుటచేత పురందరునికి శ్రీనివాస నాయక్ అని నామకరణం చేశారు. శ్రీనివాసుడు బాల్యంలో సంస్కృతం, కన్నడం చదువుకున్నాడు. తరువాత సరస్వతీ బాయినిచ్చి పెండ్లి చేశారు. తండ్రి చనిపోయిన తరువాత ఆతని అడుగుజాడలలో వ్యాపారం చేస్తూ లక్షలకు లక్షలు గడించాడు. మిక్కిలి ధనవంతునిగా గణనకెక్కాడు. పిసినారిగా కూడా ప్రసిద్ధిగాంచాడు. ఒకనాడు పరమేశ్వరుడు భార్యద్వారా జ్ఞానోదయం కలిగించాడు. పిదప తన సర్వస్వం బీదలకు పంచిపెట్టి, కట్టుబట్టలతో విద్యానగరం (విజయనగరం) చేరాడు. వ్యాసరాయలను ఆశ్రయించాడు. నాటి నుండి శ్రీనివాసులు పురందర దాసుగా దేశం నలుమూలలా హరినామ సంకీర్తనం చేస్తూ తిరిగాడు. సాధారణ భక్తి భావం మొదలుకొని, కీలకమైన తత్త్వబోధ ఆయన కీర్తనలలో కనిపిస్తాయి.


పురందరదాసు ఎనభై సంవత్సరాలు జీవించి క్రీ.శ. 1564లో కాలధర్మం చెందాడు. పుట్టుకతో మహారాష్ట్ర వాడైనా కన్నడ భాషలో రచనలు చేసి, కన్నడ దేశంలోనే అధిక భాగం గడిపి, కర్ణాటక ప్రజలకు ప్రీతిపాత్రుడైనాడు.

[మార్చు] మూలాలు

  1. A concise history of Karnataka from pre-historic times to the present (1980) by Suryanath Kamath, Published by Jupiter books Bangalore
  2. A musical tribute was paid to Sri Purandaradasa, http://www.hinduonnet.com/thehindu/2005/02/10/stories/2005021004860300.htm
  3. The Music of India (1996) By Reginald Massey,and Jamila Massey foreword by Ravi Shankar, Abhinav Publications ISBN:8170173329, Page 57
  4. Official website by Government of Karnataka http://www.dasasahitya.org
  5. http://www.dvaita.org/haridasa/dasas/purandara/p_dasa1.html
  6. Lyrics of songs by Purandara Dasa http://www.cs.toronto.edu/~kulki/kannada/dasa.html
  7. Purandara Daasa Haadugalu (1996) by KavyaPremi, Samaja Publishers, Shivaji Road, Dhardwad
  8. Songs of Three Great South Indian Saints by William J. Jackson (2002), Oxford India Paper, ISBN 0-19-566051-X
  9. T.V.Subba Rao, eminent musicologist http://www.hindu.com/fr/2006/10/20/stories/2006102000060300.htm
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు