పొట్టేలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పొట్టేలు
యు.ఎస్.ప్రయోగ కేంద్రంలో గొర్రెల గుంపు
పరిరక్షణ స్థితి
పెంపుడు జంతువులు
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Animalia
విభాగం: Chordata
తరగతి: Mammalia
క్రమం: Artiodactyla
కుటుంబం: Bovidae
ఉప కుటుంబం: Caprinae
జాతి: Ovis
ప్రజాతి: O. aries
ద్వినామీకరణం
Ovis aries
Linnaeus, 1758
గొర్రెల మంద. నాగార్జున సాగర్ రోడ్డులో తీసిన చిత్రము
భారత దేశం లో ఒక పొట్టేలు
కొమ్ములున్న గొర్రె

పొట్టేలు అంటే మగ గొర్రె .ఏట, పొట్లి అనికూడా ఆంటారు. మాంసాలలో లేతపొట్టేలు మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. గొర్రెలు నాలుగు కాళ్ళు కలిగిన క్షీరదాలు (పాలిచ్చే జంతువులు). వీటిని చాలా దేశాల్లో జీవనాధారం (బతుకు తెరువు) కోసం పెంచుతారు. వీటి ద్వారా లభించే ఉన్ని, మాంసం మొదలైన ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఆస్ట్రేలియా దేశం గొర్రె మాంసానికి, ఉన్నికి ప్రసిద్ధి. మన దేశంలో యాదవులు (గొల్లలు) కులవృత్తి గా వీటిని పెంచుతారు.ఇవి క్షీరదాలు. వీటిని పల్లెల్లో ఎక్కువగా పెంచుతారు. వీటిని మాంసం కొరకు ఎక్కువగా పెంచుతారు. వీటి నుండి అరుదుగా పాలు కూడా తీస్తారు. వీటిలో కిన్ని ఉన్ని గొఱ్ఱె లుంటాయి. వీటిని ఉన్ని కొరకు పెంచుతారు. ఈ ఉన్నితో కంబళ్ళు నేస్తారు. మగ గొఱ్ఱెను పొట్టేలు అంటారు. దీనికి కొమ్ములుంటాయి. ఆడ గొఱ్ఱెలకు కొమ్ములుండవు. కాని అరుదుగా కొన్ని గొఱ్ఱెలకు కొమ్ములుంటాయి. అలాంటి ఒక గొఱ్ఱెను చిత్రంలో చూడ వచ్చు. వీటిని గొల్లలు ఎక్కువ గా పెంచుతారు.

బలి పశువు[మార్చు]

ఆహారం కోసము మరియు మొక్కుల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల పొట్టేళ్లు బలి అవుతున్నాయి.

సంకరజాతి పొట్టేళ్లు[మార్చు]

ప్రపంచం లోనే మొదటిసారిగా డాలీ అనే పొట్టేలు ను జన్యు పరివర్తన పద్దతిద్వారా శాస్త్రవేత్తలు సృష్టించారు. డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్దతి ద్వారా పెద్ద గొఱ్ఱె నుంచి తీసిన జీవకణం ద్వారా 5 జూలై 1996 నాడు పుట్టించారు.

పొట్టేలు మాంసంతో చేసే వంటకాలు[మార్చు]

గొఱ్ఱెలకు సంబందించిన సామెతలు[మార్చు]

  • గొల్ల వాడు గొఱ్ఱెపిల్లను సంకలో పెట్టుకొని ఊరంతా వెతికాడట
  • వాడి దంతా గొఱ్ఱె దాటు వ్వవహారం
  • కర్ర లేని వాడిని గొఱ్ఱె అయినా కరుస్తుంది.
  • గొఱ్ఱె తోక బిత్తెడే
  • జీత బత్యం లేకుండా ..... తోడేలు గొఱ్ఱెలను కాస్తా నన్నదట.
  • గొఱ్ఱెల గోత్రాలు గొల్ల వాని కెరుక.
  • గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

యితర లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పొట్టేలు&oldid=1290693" నుండి వెలికితీశారు