పొన్ రాధాకృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొన్ రాధాకృష్ణన్
పొన్ రాధాకృష్ణన్


ఆర్ధిక శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
3 సెప్టెంబర్ 2017 – 24 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అర్జున్ రామ్ మేఘవాల్
తరువాత అనురాగ్ సింగ్ ఠాకూర్

కేంద్ర రహదార్లు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 3 సెప్టెంబర్ 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు కృష్ణన్ పాల్ గుర్జార్
తరువాత వీ.కే.సింగ్
పదవీ కాలం
8 సెప్టెంబర్ 2003 – 22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు శ్రీపాద యశోనాయక్
తరువాత కే. హెచ్. మునియప్ప

షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 24 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు కృష్ణన్ పాల్ గుర్జార్
తరువాత మన్‌సుఖ్ మాండవీయ

Member of the [[ భారతీయుడు Parliament]]
for కన్యాకుమారి లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
5 జూన్ 2014 – 18 జూన్ 2019
ముందు జె. హెలెన్ డేవిడ్సన్
తరువాత హెచ్. వసంత్ కుమార్

Member of Parliament
for నాగర్‌కోయిల్‌ లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1999 – 2004
ముందు ఎన్. డెన్నిస్
తరువాత ఏ. వీ. బెల్లర్మిన్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-03-01) 1952 మార్చి 1 (వయసు 72)
నాగర్‌కోయిల్‌, తమిళనాడు, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు పొన్నయ్య అయ్యప్పన్, తంగాకాని
నివాసం నాగర్‌కోయిల్‌, కన్యాకుమారి జిల్లా , తమిళనాడు, భారతదేశం
వృత్తి న్యాయవాది, రాజకీయ నాయకుడు

పొన్ రాధాకృష్ణన్ (జననం 1952 మార్చి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో ఆర్థిక, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పొన్ రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లా, అలంతంగరై గ్రామంలో 1952 మార్చి 1న పొన్నయ అయ్యప్పన్, తంగకాని దంపతులకు జన్మించాడు. ఆయన చెన్నైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

పొన్ రాధాకృష్ణన్ 1981లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చేరి ఆ తరువాత కార్యదర్శి నియమితుడయ్యాడు. ఆయన 1991 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కోయిల్‌ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. రాధాకృష్ణన్ 1999 లోక్‌సభ ఎన్నికలలో నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత పట్టణాభివృద్ధి & పేదరిక నిర్మూలన శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశాడు.

పొన్ రాధాకృష్ణన్ 2004, 2009, 2019, 2021 (ఉప ఎన్నిక) పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో కన్యాకుమారి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో భారీ పరిశ్రమలు, షిప్పింగ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2]

లోక్‌సభ ఎన్నికలలో పోటీ[మార్చు]

సంవత్సరం ఎన్నికల పార్టీ నియోజకవర్గం పేరు ఫలితం ఓట్లు ఓటు %
1991 10వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ నాగర్‌కోయిల్ 3వ స్థానం 1,02,029 18.82%
1996 11వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ నాగర్‌కోయిల్ 2వ స్థానం 1,69,885 30.25%
1998 12వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ నాగర్‌కోయిల్ 2వ స్థానం 2,67,426 45.08%
1999 13వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ నాగర్‌కోయిల్ విజేత 3,07,319 50.21%
2004 14వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ నాగర్‌కోయిల్ 2వ స్థానం 2,45,797 36.49%
2009 15వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ కన్యాకుమారి 2వ స్థానం 2,54,474 33.20 %
2014 16వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ కన్యాకుమారి విజేత 3,72,906 37.62 %
2019 17వ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ కన్యాకుమారి 2వ స్థానం 3,67,302 35.04 %
2021 ఉప ఎన్నిక 2021 భారతీయ జనతా పార్టీ కన్యాకుమారి 2వ స్థానం 438,087 39.92%

నిర్వహించిన పదవులు[మార్చు]

  • 1999 - 13వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
  • 1999 నుండి 2000 వరకు - సభ్యుడు, పరిశ్రమపై స్టాండింగ్ కమిటీ.
  • 2000 - సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, ఉపరితల రవాణా శాఖ మంత్రి .
  • 2000 నుండి 2003 వరకు - తమిళనాడు రాష్ట్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి.
  • 2003 - తమిళనాడు పట్టణాభివృద్ధి & పేదరిక నిర్మూలన శాఖ మంత్రి.
  • 2003 - తమిళనాడు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి.
  • 2014 - 16వ లోక్‌సభకు 2వసారి ఎన్నికయ్యాడు.
  • 2014 నుండి 2014 వరకు - కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి.
  • 2014 నుండి 2017 వరకు - కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ & షిప్పింగ్ శాఖ మంత్రి.
  • 2017 నుండి 2019 వరకు - కేంద్ర ఆర్థిక & షిప్పింగ్ శాఖ మంత్రి.

మూలాలు[మార్చు]

  1. "PRESS COMMUNIQUE - President of India allocates portfolios of the Council of Ministers". pib.nic.in. Retrieved 2017-09-05.
  2. Lok Sabha (2017). "Pon Radhakrishnan". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.