ప్రతిమాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతిమాదేవి
జననం
మోహిని

(1933-04-09)1933 ఏప్రిల్ 9
మరణం2021 ఏప్రిల్ 6(2021-04-06) (వయసు 87)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1947–2005
జీవిత భాగస్వామిడి. శంకర్ సింగ్
పిల్లలుముగ్గురు కుమారులు (రాజేంద్ర సింగ్ బాబు, సంగ్రామ్ సింగ్, జైరాజ్ సింగ్), ఒక కుమార్తె (విజయలక్ష్మి సింగ్)

ప్రతిమాదేవి (9 ఏప్రిల్ 1933 - 6 ఏప్రిల్ 2021)[1] కన్నడ సినిమా నటి. 1947లో వచ్చిన కృష్ణలీల చిత్రం ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది. జగన్మోహిని (1951)లో ప్రధాన పాత్రలో కూడా నటించింది. బాక్సాఫీస్ వద్ద 100 రోజులు పూర్తి చేసుకున్న మొదటి కన్నడ చిత్రమది. ప్రతిమాదేవి దాదాపు 60కి పైగా చిత్రాలలో నటించింది.[2]

జీవిత చరిత్ర[మార్చు]

ప్రతిమాదేవి 1933 ఏప్రిల్ 9న కర్ణాటక దక్షిణ కెనరా ప్రాంతంలోని కల్లడ్క అనే పట్టణంలో ఉపేంద్ర షెనాయ్ - సరస్వతీబాయి దంపతులకు జన్మించింది. ప్రతిమాదేవి నాలుగైదు సంవత్సరాల వయస్సులో తండ్రిని కోల్పోయింది; దాంతో అమె కుటుంబం మంగళూరుకు, తర్వాత అహ్మదాబాద్‌కు వలస వెళ్ళింది. 1941 తమిళ చిత్రం సావిత్రిలో నారదర్‌గా ఎం.ఎస్ సుబ్బులక్ష్మి పాత్రను చూసిన ప్రతిమాదేవి సినిమాలపై ఆసక్తిని పెంచుకుంది.

కళారంగం[మార్చు]

సినిమాల్లోకి రాకముందు ప్రతిమాదేవి 11 ఏళ్ళ వయసులో వృత్తి నాటకరంగంలో చేరింది.[3] 1947లో కృష్ణలీల సినిమాలో తొలిసారిగా నటించింది. తరువా 1951లో వచ్చిన జగన్మోహిని సినిమాలో కనిపించింది. ఇది థియేటర్లలో 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసిన మొదటి కన్నడ చిత్రంగా నిలిచింది. 1952లో మేకప్ సుబ్బన్నతో కలిసి ప్రతిమాదేవి చేసిన దల్లాలీ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. మహాత్మా ఫిలింస్ బ్యానర్‌లో తన భర్త నిర్మించిన చిత్రాలలో నటించింది.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ప్రతిమాదేవికి డి. శంకర్ సింగ్ తో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు. కొడుకు రాజేంద్ర సింగ్ బాబు (సినిమా దర్శకుడు), సంగ్రామ్ సింగ్, జైరాజ్ సింగ్, కుమార్తె విజయలక్ష్మి సింగ్ (నటి, నిర్మాత).[5][6]

మరణం[మార్చు]

ప్రతిమాదేవి 88 సంవత్సరాల వయస్సులో 2021 ఏప్రిల్ 6న మైసూర్‌లోని సరస్వతీపురలోని తన నివాసంలో మరణించింది.[7]

సినిమాలు[మార్చు]

  1. కృష్ణలీల (1947)...గోపి
  2. శివ పార్వతి (1950)
  3. జగన్మోహిని (1951)
  4. శ్రీ శ్రీనివాస కళ్యాణ (1952)
  5. దల్లాలీ (1952)
  6. చంచల కుమారి (1953)
  7. ముత్తిదెళ్ల చిన్న (1954)
  8. మదిద్దున్ను మహారాయ (1954)
  9. శివశరణే నంబెక్క (1955)
  10. ప్రభులింగ లీలే (1957)
  11. మంగళ సూత్ర (1959)
  12. శివలింగ సాక్షి (1960)
  13. రాజా సత్యవ్రత (1961)
  14. భక్త చేత (1961)...గౌరి
  15. శ్రీ ధర్మస్థల మహాత్మే (1962)
  16. పాలిగె బండద్దె పంచామృత (1963)
  17. పాతాళ మోహిని (1965)
  18. నాగరహావు (1972)
  19. నాగకన్య (1975)
  20. నారద విజయ (1980)
  21. భారీ భర్జరీ బేటే (1981)
  22. ధరణి మండల మధ్యడోలగే (1983)
  23. రామ శామ భామ (2005)

అవార్డులు[మార్చు]

  • 2001 - 02: కర్ణాటక ప్రభుత్వం నుండి డాక్టర్ రాజ్‌కుమార్ అవార్డు

మూలాలు[మార్చు]

  1. "Veteran Actress Prathima Devi Expired". chitraloka.com. Archived from the original on 6 ఫిబ్రవరి 2022. Retrieved 6 February 2022.
  2. "An evening with Jaganmohini". The Hindu. 11 June 2011. Retrieved 6 February 2022.
  3. "Prathima Devi, veteran actor, passes away". The Hindu (in Indian English). 7 April 2021. Retrieved 6 February 2022.
  4. "Remembering Prathima Devi". The Hindu. 8 April 2021.
  5. George, Nina C. (21 August 2016). "When mom's the world". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 6 February 2022.
  6. B. V. Shiva Shankar (16 March 2007). "Sepia stories at 60". The Hindu. Archived from the original on 12 August 2020. Retrieved 6 February 2022.
  7. "Veteran actress Pratima Devi passes away". Times of India. 6 April 2021.

బయటి లింకులు[మార్చు]