ప్రియా సిస్టర్స్
ప్రియా సోదరీమణులు Priya Sisters | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | గాయనులు |
ప్రియా సోదరీమణులు అని పిలువబడే షణ్ముఖప్రియ, హరిప్రియలు ప్రముఖ కర్ణాటక సంగీత గాయనీమణులు.[1] వీరి గురువులు రాధ, జయలక్ష్మి. రాధాజయలక్ష్ములు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు జి.ఎన్.బాలసుబ్రమణియం శిష్యురాళ్ళు.
జీవితం
[మార్చు]ప్రియా సోదరీమణులు తమ 5వ ఏట, తండ్రి గాత్ర సంగీతకారుడు వి. వి. సుబ్బరామ్ నుండి కర్ణాటక సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. ఈయన చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై, హరికేశనల్లూర్ వైద్యలింగ భాగవతార్ శిష్యుడు.[2] వీరి బాల్యం చిత్తూరులో గడిచింది. తర్వాత సంగీతం నేర్చుకోవడం కోసం చెన్నైలో నివాసం ఏర్పరుచుకున్నారు. షణ్ముఖప్రియ జీవశాస్త్రంలో పట్టభద్రురాలు కాగా హరిప్రియ ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసింది. హరిప్రియ అండర్ 15 క్రికెట్ పోటీల్లో కూడా పాల్గొనింది.[3]
వీరు స్వదేశాల్లో, విదేశాల్లో కలిపి మొత్తం 2000 పైచిలుకు కచేరీలలో పాడారు.[4][5] సత్య సాయి బాబా 70 వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా, ఏర్పాటుచేసిన హైదరాబాద్ ఉత్సవం, డుయో ఉత్సవం లలో వీరి కచేరీలను ఏర్పాటుచేశారు. ప్రియా సోదరీమణులు మాజీ రాష్ట్రపతి, ఆర్. వెంకటరామన్ సమక్షంలో తమ సంగీతాన్ని ఆలపించారు.
మూలాలు
[మార్చు]- ↑ "The Hindu : Entertainment Delhi / Music : Mastery on stage". web.archive.org. 29 డిసెంబరు 2009. Archived from the original on 29 డిసెంబరు 2009. Retrieved 9 ఫిబ్రవరి 2024.
- ↑ V, Balasubramanian (4 ఏప్రిల్ 2008). "We owe it to Radha-Jayalakshmi". The Hindu. Archived from the original on 9 ఏప్రిల్ 2008. Retrieved 9 ఏప్రిల్ 2008.
- ↑ "The Hindu : Friday Review Bangalore / Interview : The dulcet duet". web.archive.org. 23 మే 2008. Archived from the original on 23 మే 2008. Retrieved 9 ఫిబ్రవరి 2024.
- ↑ "The Hindu : Entertainment Hyderabad / Music : A musical treat". web.archive.org. 29 జూలై 2008. Archived from the original on 29 జూలై 2008. Retrieved 9 ఫిబ్రవరి 2024.
- ↑ LAKSHMI, VENKATRAMAN (10 జనవరి 2006). "In an expansive mood". The Hindu. Archived from the original on 14 మే 2006. Retrieved 4 మార్చి 2016.