బరుయా(బంగ్లాదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Barua/Maramagyi/Marmagri
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
బంగ్లాదేశ్ Bangladesh
మయన్మార్ Myanmar
India India
భాషలు
Bengali and Chittagonian
మతం
Theravada Buddhism
Buddhist temple on Maheshkhali Island in Chittagong Division, Bangladesh

బారుయా (బెంగాలీ:বড়ুয়া) అనేది బెంగాలీ మాట్లాడే ఇండో-ఆర్యన్ జాతి సమూహం. ఇది బంగ్లాదేశులోని చిట్టగాంగు విభాగానికి చెందినది. మయన్మారులోని రాఖైను రాష్ట్రంలో వారిని మరామగి లేదా మరామగ్రి అని పిలుస్తారు. వీరు ఈశాన్యభారతదేశంలో త్రిపుర భూభాగాలు ఉన్నారు.[1][2] అరకానీలు కాలక్రమంలో బరుయా బౌద్ధులు ఐదు వేల సంవత్సరాలు అక్కడ నివసించిన బంగ్లాదేశుప్రాచీన స్థానిక ప్రజలుగా భావిస్తున్నారు.[3]వారు సాధారణంగా వారి చివరి పేరు "బరుయా" ద్వారా గుర్తించబడతారు.

చిట్టగాంగును గతంలో "చైత్యగ్రామం" "బౌద్ధ మందిరాలతో కూడిన పట్టణం" అని పిలిచేవారు.[4] ఇది 10 వ శతాబ్దంలో మహాయాన బౌద్ధమతకేంద్రంగా ఉంది. మాగు అనేది బౌద్ధులకు ఉపయోగించే సాధారణ పదం; బారువాను రాజ్బన్సీ "రాయలు సంతతికి చెందినవారు" అని కూడా పిలుస్తారు.

వారు ఆర్యవర్త (ఆర్యన్ల దేశం) నుండి వచ్చారని వారు నొక్కిచెప్పారు. దీనిని పాలి గ్రంథాలలో మజ్జిమాదేసా లేదా మధ్యదేశ అని పిలుస్తారు. [5] చిట్టగాంగులోని బెంగాలీ మాట్లాడే బరుయా ప్రజలు అస్సాంకు చెందిన అస్సామీ బరుయాలకు భిన్నంగా అందరూ బౌద్ధులుగా ఉన్నారు. బరుయా "బరు"అంటే "గొప్ప", "ఆర్య" అంటే "గొప్పవారు" అని అర్ధం.

ఒక మాగు రాజు జయచందు 16 వ శతాబ్దంలో చిట్టగాంగు ప్రాంతాన్ని పరిపాలించాడు.[6]

థెరవాడ బుద్ధిజం[మార్చు]

Buddhist Monastery in Moheshkhali
Dipa Ma, a prominent Buddhist master in Asia of Barua descent.

బరుయాలు మహాయాన బౌద్ధమతాన్ని అనుసరించేవారుగా ఉంటారు. 19 వ శతాబ్దం మధ్యకాలం వరకు వారు కొన్ని హిందూ ఆచారాలను అనుసరించారు. 1856 లో అరాకనుకు చెందిన సాఘరాజు శరమేధ మహతేరా (1801-82), బోధు గయా నుండి తిరిగి వచ్చి చిట్టగాంగుకు ఆహ్వానించబడ్డారు. [7]19 వ శతాబ్దం మధ్యలో బరుయాలు బర్మా, శ్రీలంక నుండి థెరావాడ బౌద్ధులతో పరిచయం ఏర్పడిన తరువాత థెరావాడ బౌద్ధమతం అనుచరులుగా ఉన్నారు.[8]

ఆధునిక కాలంలో 1885 లో జమీందార్, హరగోబింద ముట్సుద్ది ఆర్ధిక సహాయంతో ఎకార్య పున్నేచారా చిట్టగాంగులోని పహర్తాలిలో మొట్టమొదటి పాలి పాఠశాల స్థాపించాడు.[9]1892 అక్టోబరు 5 న కలకత్తాలో కృపాషరను మహాస్తవీరు " బౌద్ధ ధర్మాంకురు సభ " అనే బౌద్ధ మత సంస్థ స్థాపించాడు.[10] కృపాషరను మహాస్తవీరు దాని మొదటి అధ్యక్షుడుగానూ, సురేంద్రలాలు ముత్సుద్ది దాని కార్యదర్శిగా ఉన్నాడు. ధర్మన్కూరు సభ పత్రికకు జగజ్జ్యోతి, గుణలంగ్కరు స్థవిరు, శ్రామను పున్నానంద స్వామి సంపాదకులుగా పనిచేసారు. ఇది 1908 లో మొదట ప్రచురించబడింది. తరువాత దీనిని బెనిమాధబు బరుయా కూడా సవరించారు.

ప్రఖ్యాత పరిశోధకుడు డాక్టరు బెనిమాదాబు బరుయా (1888-1948), చిట్టగాంగు లోని రౌజాను థానా ఆధ్వర్యంలో ఉన్న మహాముని గ్రామంలో 1888 లో జన్మించాడు. ఆయన కవిరాజ రాజచంద్ర తాలూక్దరు కుమారుడు. బెనిమాదాబు ‘బరుయా’ బిరుదును స్వీకరించారు. 1913 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పాలిలో ఎంఏ పట్టా పొందారు. కలకత్తా సిటీ కాలేజీ, కలకత్తా లా కాలేజీలోలలో లా చదివాడు. ఆయన బరుయా సమాజంలో బౌద్ధమతం పునరుజ్జీవనం మార్గదర్శకులలో ఒకడు అయ్యాడు. బెనిమాదాబు 1912 లో మహాముని ఆంగ్లో-పాలి ఇన్స్టిట్యూషనులో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. 1913-14 నుండి కలకత్తా విశ్వవిద్యాలయంలోని పాలి విభాగంలో లెక్చరరుగా పనిచేశారు. అతను 1914 లో ప్రభుత్వ స్కాలర్‌షిప్పులో ఇంగ్లాండుకు వెళ్లాడు. లండను విశ్వవిద్యాలయం నుండి గ్రీకు, ఆధునిక ఐరోపా తత్వశాస్త్రంలో ఎంఏ సంపాదించాడు. 1917 లో ఆయనకు డి.లిట్ లభించింది. లండను విశ్వవిద్యాలయం చేత. ఆయన అలా చేసిన మొదటి ఆసియనుగా గుర్తించబడ్డాడు. 1918 లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత బెనిమాదాబు కలకత్తా విశ్వవిద్యాలయంలో తిరిగి చేరాడు. మ తరువాత ప్రొఫెసరు పదవికి పదోన్నతి పొందాడు. ఆయన అదే విశ్వవిద్యాలయంలోని ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి (1919-48), సంస్కృతం (1927-48) విభాగాలలో పనిచేసి పాలిలోని ఎంఏ కోర్సు సిలబస్‌ను మెరుగుపరిచాడు.[11]

1917 లో అనగరికా ధర్మపాల చిట్టగాంగును సందర్శించారు. అక్కడ అతను 9 ఏళ్ల బాలుడిని ప్రభావితం చేశాడు. తరువాత ఆయన ప్రసిద్ధ పాలి పరిశోధకుడు ప్రొఫెసరు ద్విజేంద్ర లాలు బారువా అయ్యాడు.[12]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. The thousand-petalled lotus: an English Buddhist in India, Sangharakshita (Bhikshu), Heinemann, 1976, p. 265
  2. Hattaway, Paul (2004). Peoples of the Buddhist World: A Christian Prayer Diary. ISBN 9780878083619.
  3. http://www.buddhanet.net/e-learning/buddhistworld/bangladesh-txt.htm
  4. The Buddhists of Chittagong, Appendix to Chapter 3, Bengal district gazetteers, 1908, p. 65
  5. Buddhism in Bangladesh
  6. Magh raiders in Bengal, Jamini Mohan Ghosh Bookland, 1960p. 55
  7. South Asian Buddhism: A Survey, Stephen C. Berkwitz, Routledge, 2012, p. 184
  8. Young East, 1979, Volumes 5-7, pp. 25-26
  9. Buddhist Education in Bangladesh: Challenges and Possibilities, Sajal Barua, Feb. 27, 2015
  10. Mahasthavir, Kripasharan, 5 May 2014
  11. Dr. B.M. Barua Birth Centenary Commemoration Volume, 1989, Bauddha Dharmankur Sabha, 1989
  12. Sugat Barua, The Maha Bodhi,1891-1991, Volumes 98-99; Maha-Bodhi Society, p. 307

మూస:Tribes of Bangladesh మూస:Ethnic groups in Myanmar

వెలుపలి లింకులు[మార్చు]