బాబ్‌కాక్ అండ్ విల్‌కాక్సు బాయిలరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాబ్‌కాక్ ఆండ్ విల్‌కాక్సు బాయిలరు
బాబ్‌కాక్ ఆండ్ విల్‌కాక్సుబాయిలరు
బాబ్‌కాక్ ఆండ్ విల్‌కాక్సుబాయిలరు

బాబ్‌కాక్ అండ్ విల్‌కాక్స్ బాయిలరు వాటరు ట్యూబు బాయిలరు.బాయిలరు యొక్క స్టీము వాటరు డ్రమ్ము, వాటరు ట్యూబుల బండిల్ భూసమాంతరంగా ఉన్నప్పటికీ, ట్యూబుబండిల్ కొద్దిగా ఏటవాలుగా వుండును. రిఫ్రాక్టరి ఇటుకలతో కట్టిన ఫర్నేసులోపల ట్యూబుల బండిల్ దాని పైన స్టీము వాటరు డ్రమ్ము వుండును. వాటరు ట్యూబు బాయిలరు అయినను బందిల్ లోణి వాటరు ట్యూబులు ట్యూబులు వంపులు లేకుండా సరళంగా వుండును. బాబ్‌కాక్ అండ్ విల్‌కాక్స్ బాయిలరులో ఎక్కువ పీడనంతో స్టీమును ఉత్పత్తి చెయ్యవచ్చును. బాబ్‌కాక్ అండ్ విల్‌కాక్స్ బాయిలరు బొగ్గును ఇంధనంగా వాడు బాయిలరు అయినప్పటికీ బర్నరు లను అమర్చి ఆయిల్/ద్రవ ఇంధనాన్ని కూడా వాడవచ్చును.ఎక్కువ పరిమాణంలో, ఎక్కువ పీడనంతో స్టీము ఉత్పత్తి చేయు సామర్ధ్యం ఉన్నందున ఈ బాయిలరును విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలలో టర్బైనుల తిప్పుటకు ఉపయోగిస్తారు.

బాయిలరు రూపకర్తలు[మార్చు]

జార్జి హెర్మన్ బాబ్కాక్ అనే అమెరికా ఉత్పాదకుడు, స్టీఫెన్ విల్‌కాక్సు అనే aతనితో కలిసి బాబ్‌కాక్ అండ్ విల్‌కాక్ బాయిలరును రూపకల్పన చేసి యాజమాన్యహక్కులు పొందాడు.వీరిద్దరు కలిసి బాబ్ కాక్ అండ్ విల్ కాక్ బాయిలరు కంపెనిని స్థాపించి 1867 లో మొదటగా ఈ బాయిలరును నిర్మించి ఉపయోగంలోకి తెచ్చారు.

బాయిలరు లోని ప్రధానబాగాలు[మార్చు]

1.స్టీము, వాటరు డ్రమ్ము.దీన్నే బాయిలరు షెల్ అనికూడా అంటారు,2.వాటరు ట్యూబులు, 3.అప్‌టేక్ హెడరు, డౌన్ కమరు, 4.గ్రేట్,5.ఫర్నేసు, 6.బాఫెల్ పలకలు, 7.సూపరు హీటరు,8.బుదర పేటిక (Mud box)9.మ్యాన్ హోల్ (ప్రవేశబిలం),10.డాంపరు అనేవి ప్రధాన బాగాలు[1].

స్టీము,వాటరు డ్రమ్ము.[మార్చు]

దీన్నే బాయిలరు షెల్ అనికూడా అంటారు.ఇది పొడవుగా క్షితిజసమాంతర స్తుపాకారంగా వున్నలోహ నిర్మాణం.రెండు చివరలు ఉబ్బుగా (చాప రూపంలో) ఉండును. సాధారణంగా స్టీము, వాటరు డ్రమ్ము 8 మీటర్ల పొడవు,2 మీటర్ల వ్యాసం కల్గి ఉండును.ఇందులో సగం ఎత్తువరకు నీరు వుండగా మిగిలిన సగ భాగంలో స్టీము వుండును. ఈ డ్రమ్ము పైభాగాన సేఫ్టి వాల్వులు, ప్రధాన స్టీము వాల్వు/కవాటం, ఎయిర్ వెంట్ వాల్వు, స్టీము ప్రెసరు డయల్ గేజి వుండును. డ్రమ్ముపక్క భాగంలో వాటరు గేజి, వాటరు ఫీడ్ వాల్వు వుండును.

వాటరు ట్యూబులు[మార్చు]

స్టీము, వాటరు డ్రమ్ముకింది భాగాన పర్నేసులో వాటరు ట్యూబులు వుండును.వీటి రెండు చివరల హెడరులు ఉండును.ట్యూబులు 10-15 డిగ్రీల ఏటవాలుగా అమర్చబడి వుండును.

అప్‌టేక్ హేడరు, డౌన్‌టేక్ హేడరు[మార్చు]

ట్యూబుల బండిలు ఏటవాలుతలంలో పైకి వున్న హేడరును అప్‌టేక్ హేడరు అని, ట్యూబుల కింది ఏటవాలు తలంలో వున్న హేడరును డౌన్ కమర్/డౌన్‌టేక్ హేడరు (down-comer) అంటారు.ఈరెండు హెడరులట్యూబు ప్లేటులకు వాటరు ట్యూబులు అడ్డుగా, నిలువుగా పలు వరుసలలో బిగింపబడి వుండును.ఈ హెడరులను మూత/కవరు అనే కప్పువంటి నిర్మాణం బలమైన బోల్టుల ద్వారా హెడరులకు బిగింపబడి వుండును.బాయిలరు నిర్వహణ సమయంలో ఈ కవరులను విప్పి ట్యూబుల లోపలి భాగాలను తనిఖి చేసి పేరుకు పోయిన స్కేలును తొలగించెదరు. ఈ రెండు హేడరులు రెండు పైపుల ద్వారా స్టీము, వాటరు డ్రమ్ముకు కలుపబడి వుండును.

గ్రేట్[మార్చు]

ఇది ఫర్నేసు ముందు భాగంలో వుండును. కాస్ట్ ఐరన్ పలకలను వరుసగా పేర్చి గ్రేట్ ను తయారు చేస్తారు.పలక పలక మధ్యన సన్నని ఖాళీలు వుండును. ఈ గ్రేట్ మీదనే బొగ్గును పేర్చి మండించేదరు.గ్రేట్ ముందు భాగాన ఒకటి లేదా రెండు ఫైరు డోరు లుండి వాటి ద్వారా బొగ్గును గ్రేటుకు అందించెదరు.బాబ్ కాక్ బాయిలర్లో గ్రేట్ ఫిక్సుడు గ్రేట్. గ్రేట్ కున్న రంధ్రాల ద్వారా బూడిద కిందనున్న బూడిద గుంటలో జమ అగును.అంతే కాకుండా గ్రేట్ పలకలకున్న రంధ్రాల ద్వారా, ఫైరు డోరు రంధ్రాల ద్వారా దహనానికి అవసరమైన గాలిఅందును.

ఫర్నేసు[మార్చు]

ఫర్నేసు అనేది ట్యూబుల బండిల్ హేడరులలో అప్ టేకరు హెడరు వైపు ఉండును.ఫర్నేసు లోని బాగమే గ్రేట్

బాఫెల్స్[మార్చు]

ఈబాఫెల్స్ (Baffles) వలన ఫ్లూగ్యాసులు పలు దపాలుగా ట్యూబుల మధ్య గుండా పయనించి, ట్యూబులలోని నీటిని వేడెక్కించును. అటు పిమ్మట రిఫ్రాక్టరి ఇటుకల నిర్మాణం/గూడులకు కలుపబడిన చిమ్నీకి వెళ్ళును. ఈ బాఫెల్స్ ఫైరుబ్రిక్సు/వేడిని తటుకొను ఇటుకలుచే నిర్మింపబడి వుండును.ఇవి రెండు లేక మూడు వుండును.

సూపరు హీటరు[మార్చు]

ఈ సూపరు హీటరులో స్టీమును మరల వేడిచేసి స్టీము ఉష్ణోగ్రత పెరిగేలా చేస్తారు.ఇది బాయిలరులో స్టీము డ్రమ్ము, ట్యూబు హెడరుల మధ్యన ఉండును.

మడ్ బాక్సు/బురదపేటిక[మార్చు]

ఇది డౌన్ కమరు హెడరు చివర ఉండును. వాటరు స్టీముగా మారు క్రమంలో కరిగిన పదార్థాల నిష్పత్తి పెరిగి చిక్కని బురద వంటి పదార్ధం ఏర్పడును. వాటరులోని మట్టివంటి బురదను వంటి పదార్థాలు ఇక్కడ జమ అగును.ఇలాంటి చిక్కని నీటిని బ్లోడౌన్ కాక్ తెరచి నీటిని బయటికి పంపెదరు.

మ్యాన్ హోల్(ప్రవేశబిలం)[మార్చు]

బాయిలరును ఆపి నపుడు లోపలి వెళ్ళి పరిశీలించి తగిన మరమత్తులు చెయ్యుటకు అవసరమైనమ్యాన్ హోల్ డోరులు వుండును

డాంపరు[మార్చు]

ఇది బాయిలరు వెనుకభాగం నుండి చిమ్నీ/పొగగొట్టానికి వెళ్ళు ఫ్లూగ్యాసెస్/ఇంధనదహన వాయువుల (పొగ) వేగాన్ని నియంత్రించుటకు ఉపయోగపడు భాగం.దీనిని పైకి కిందికి జరపడం ద్వారా చిమ్నీకి వెళ్ళు పొగ యొక్క పరిమాణాన్ని పెంచడం తగ్గించడం జరుగును.

బాయిలరు ఉపకరణాలు[మార్చు]

డయల్ ప్రెసరు గేజి, సేఫ్టివాల్వులు, ప్రధాన స్టీము వాల్వు, ఫీడ్ చెక్ వాల్వు, బ్లోడౌన్‌ వాల్వు, వాటరు గేజి

పని చెయ్యు విధానం[మార్చు]

వాటరు ట్యూబు బండిల్, బాయిలరు వాటరు, స్టీము డ్రమ్ములో సగం వరకు నీరు నింపిన తరువాత, బాయిలరు ఫర్నేసు ముందు భాగాన, వాటరు ట్యూబుల ఎడమ పక్కన (అప్ టేక్ హేడరు /రైజరు హేడరు కింద వున్న గ్రేట్ పై బొగ్గును తగు ప్రమాణంలో పేర్చి అంటించేదరు. బొగ్గు ఆక్సీకరణం/దహనం వలన ఏర్పడిన వేడివాయువులు/ఫ్లూ గ్యాసులు పైకి లేచి, మొదటగా అప్‌టేకు హేడరు వైపు వాటరు పైపులను తాకును.వాటరు ట్యూబుల మధ్య అమర్చిన బాఫెల్స్ (ఫైరు ఇటుకల నిర్మాణం) వలన ఉత్పన్న వేడి వాయువులు ట్యూబుల మధ్య గుండా మూడు సార్లు పైకి కిందికి ట్యూబుల వెలుపలి ఉపరితలాన్ని తాకుతూ పయనించి, బాయిలరు వెనుక నున్న డాంపరు ప్లేటుద్వారా చిమ్నీకి వెళ్ళును.ఈ విధంగా వేడి వాయువులు పలుమార్లు ట్యూబుల ఉపరితలాన్ని తాకుతూ పయనించడం వలన వేడి వాయువుల అధికఉష్ణోగ్రత (వేడి) ఉష్ణ సంవహనం వలన ట్యూబుల్లోని నీటికి మార్పిడి చెంది నీరు ఆవిరిగా మారును. డౌన్ కమరు ద్వారా తక్కువ ఉష్ణోగ్రత వున్న నీరు ట్యూబుల్లోకి ప్రవహించగా, వేడివాయువుల (పొగ) వలన వేడెక్కిన నీరు+స్టీము అప్‌టేకు హేడరు పైపు/గొట్టం ద్వారా వాటరు, స్టీము డ్రమ్ములోకి ప్రవహించును. చిమ్నీకి చేరిన తక్కువ ఉష్ణోగ్రతవున్న (200-250°C) ఫ్లూ గ్యాసులు వాతావరణంలో కలుయును.చిమ్నీ ఎత్తు కనిష్ఠం 35-40 మీటర్ల ఎత్తు వుండును.వాటరు డ్రమ్ములో పైభాగంలో జమ అయ్యిన స్టీము, అక్కడ వున్న యాంటి ప్రిమింగు బాక్సుచేరును.ఈ బాక్సు వలన నీరు లేదా పొంగు/నురుగు వంటిది స్టీము నుండి వేరు పడును.ఈ యాంటి ప్రిమింగు బాక్సు నుండి ఒక ట్యూబు తిరిగి బాయిలరు డ్రమ్ముకింద, ట్యూబుబండిల్ పైభాగాన ఉన్న సూపరు హీటరుకు కలుపబడి వుండును. సూపరు హీటరులో వేడెక్కిన స్టీము బాయిలరు డ్రమ్ము పైబాగాన ఉన్న ప్రధాన స్టీమువాల్వుకు వెళ్ళును. అవసరమైనపుడు ఈ ప్రధాన స్తిఇము వాల్వును తెరచి అవసరమున్న చోటుకు స్టీమును పంపెదరు[2][1]

బాయిలరు సామార్ధ్యం[మార్చు]

బాబ్‌కాక్ ఆండ్ విల్‌కాక్సు బాయిలరులో 8,200 నుండి 260,000 lb/h (1 నుండి 33 kg/s) స్టీమును ఉత్పత్తి చెయ్యవచ్చును.అలాగే బాయిలరు స్టీముపీడనం 250 -1250 psi (1.7 - 7.2 MPa) వరకు పొందవచ్చును, [3]

బాయిలరులోని విశిష్ట అంశాలు[మార్చు]

  • 1.ఫైరు ట్యూబు బాయిలరు కన్న ఇంధన ఉష్ణ వినిమయ సామర్ధ్యం ఎక్కువ
  • 2.పాడైన ట్యూబులను సులభంగా మార్చవచ్చును.
  • 3.బాయిలరు లోని అన్ని భాగాలను అనుకూలంగా పరీక్షించు, మరమత్తులు చెయ్యు సానుకూలత వున్నది
  • 4.అధిక పీడనంతో ఎక్కువ పరిమాణంలో స్టీమును త్వరగా ఉత్పత్తి చెయ్య వచ్చును.
  • 5.బాయిలరు యొక్క ఉక్కు నిర్మాణ భాగాలని రిప్రాక్టరి నిర్మాణంతో సంబంధం లేకుండా రూపకల్పనచెయ్యబడి ఉన్నందున, తేలికగా బాయిలరుభాగాల విస్తరణచెయ్యవచ్చు
  • 6.వాటరుట్యూబుల సమూహాన్ని 10-15డిగ్రీల ఏటవాలుగా ఉన్నందున బాయిలరులో నీరు త్వరగా ఒకచోటు నుండి మరో చోటుకు సహజ ప్రసరణ చెందును

అనుకూల అంశాలు[మార్చు]

ఫైరు ట్యూబు బాయిలరుకన్న ఈ బాయిరులోని అనుకూల అంశాలు[1][మార్చు]

  • 1.ఈ బాయిలరులో ఎక్కువ పీడనంతో స్టీము ఉత్పత్తి అగును.
  • 2.మిగతా వాటరు ట్యూబు బాయిలరు లతో పోల్చిన ట్యూబుల హిటింగు సర్ఫేస్ ఏరియా/ వేడెక్కు ఉపరితల వైశాల్యం ఎక్కువ
  • 3.ఫైరు ట్యూబు బాయిలరుల కన్న తక్కువ నీరు ట్యూబులలో ఉండటం వలనా చాలా త్వరగా స్టీమును ఉత్పత్తి అగును.కావున బాయిలరులో అవసరానికి తగిన విధంగా స్టీమును త్వరగా పొందవచ్చును.
  • 4.ట్యూబులలో నీరు ప్రవహించు దిశకు పూర్తి వ్యతిరేక దిశలో ఫ్లూ గ్యాసులు పయనించడం వలన ఫ్లూ గ్యాసుల గరిష్ఠ ఉష్ణం నీటికి బదిలీ అగును.
  • 5.బాయిలరు ఉక్కు నిర్మాణ భాగాలను సులభంగా విడదీసి మరల జోడించవచ్చును.అమ్దువల ఈ బాయిలరును తయారీ స్థావరం నుండి వినియోగ స్థావరానికి రవాణా కావించడం సులభం.
  • 6.ట్యూబులు ఎక్కువ తాపక ఉపరితల వైశాల్యం కల్గి ఉన్నందున ఒకటి రెండు ట్యూబులు పాడైనను బాయిలరు స్టీము ఉత్పాదకతలో పెద్ద తేడా వుండదు.ముఖ్యంగా విద్యుతు ఉత్పాదకత కేంద్రాలలో ఈ బాయిలరు చాలా చక్కగా పని చేయును

అనాను కూలతలు[మార్చు]

  • 1.బాయిలరుకు అందించు నీటిని సరిగా శుద్ధిచెయ్యక పోయిన నీటి పొలుసులు/చిక్కని ఘనపదార్థాలు (scale) ట్యూబులలో త్వరగా పేరుకు పొయ్యి బాయిలరు సామర్ధ్యం తగ్గిపోవును.
  • 2.బాయిలరు నిర్వహణ ఖర్చు ఎక్కువ.
  • 3.ఏదైనా కారణాలచే కొద్ది సమయం పాటు నీరు అందక పోయిన బాయిలరు త్వరగా వేడెక్కి ట్యూబులు పాడై పోవును.అందువలన బాయిలరు పనిచేయునపుడు నీటిమట్టం తగ్గకుండా జాగ్రత్తగా చూస్తూవుండాలి.

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Construction of Babcock and Wilcox Boiler". mechanical-engineering-info.blogspot.in. Archived from the original on 2017-06-24. Retrieved 2018-01-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Lab Manual". engineering.myindialist.com. Archived from the original on 2017-05-09. Retrieved 2018-01-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Water-Tube Package Boilers". babcock.com. Archived from the original on 2018-01-28. Retrieved 2018-01-27.