బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన, పునరావాస కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమల తిరుపతి దేవస్థానం

బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధనా, పునరావాస కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం చేత నడుపబడుతున్న సేవా సంస్థ.

ఇది 1985 సంవత్సరం తిరుపతిలో స్థాపించబడింది. ఈ సంస్థ ఆర్థోపెడిక్స్ (శల్యవైద్యం) రంగంలో అనేక విధాలుగా జన్మతా కలిగిన లోపాలు, సెరిబ్రల్ పాల్సీ రోగులు, పోలియో వ్యాధిగ్రస్థులకు విలువైన చికిత్సలనందిస్తూ, నిరుపేదల సేవలో అంకితభావంతో సేవచేస్తున్నది. ఈ కేంద్రంలో 250 పడకల సామర్ధ్యంతో, నాలుగు ఆపరేషన్ థియేటర్లతో ఎయిర్ కండిషన్ తో కూడిన ఆసుపత్రి ఉంది.

చరిత్ర[మార్చు]

బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన , పునరావాస కేంద్రం1994 లో BIRRD ట్రస్ట్‌గా మార్చబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల నుంచి వచ్చే విరాళాలకు సమానంగా సరిపోయే గ్రాంట్‌ను ఈ సంస్థకు అందచేస్తుంది . BIRRD కు దాతల నుంచి విరాళాలకు భారత ఆదాయపు పన్ను చట్టం క్రింద 100% మినహాయింపు ప్రతిపాదన వీరి పరిశీలనలో ఉంది. BIRRD ఆంధ్రప్రదేశ్‌లో పోలియో బాధిత పిల్లలకు సంబంధించిన విషయ డేటాను స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేకరిస్తున్నారు, ఈ డేటా పరిశీలన తరువాత జిల్లా స్థాయిలో రోగులను పరీక్షిస్తారు, ఇప్పటికే మూడు జిల్లాలను ఈ పథకం అమలు చేస్తున్నారు.[1] తిరుమల తిరుపతి దేవస్థానము వారు BIRRD ఆసుపత్రికకు రోగులను దృష్టి లో ఉంచుకొని అదనపు ఆపరేషన్ థియేటర్లను కట్టాలని నిర్ణయించుకొన్నది. ప్రస్తుతము దక్షిణాది ప్రజలే గాక ఉత్తరాది నుంచి వచ్చే రోగులు కూడా ఎక్కువగా వస్తున్నారు.[2]

మూలాలు[మార్చు]

  1. "BALAJI INSTITUTE OF SURGERY, RESEARCH AND REHABILITATION FOR THE DISABLED". tirumala.org/. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 12 February 2021.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. operation theatres, BIRRD to get more (February 10, 2021). "BIRRD to get more operation theatres". divya-bharat.com/. Archived from the original on 12 ఫిబ్రవరి 2021. Retrieved 12 February 2021.