బ్రజ్ నారాయణ్ చక్ బస్త్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రజ్ నారాయణ్ చక్‌బస్త్
జననం1882 జనవరి 19
మరణం1926 ఫిబ్రవరి 12 (aged 44)
రాయ్ బరేలి
(now Uttar Pradesh, India)
తల్లిదండ్రులు
  • ఉదిత్ నారాయణ్ చక్‌బస్త్ (తండ్రి)

బ్రజ్ నారాయణ్ చక్‌బస్త్ (1882 - 1926) ఉర్దూ కవి, సాహితీ కారుడు. ఫైజాబాద్ స్థిరపడిన కాశ్మీర్కు చెందిన 'సరస్వత్ బ్రాహ్మణ్' కుటుంబంలో 1882 జనవరి 19 న జన్మించాడు. అతని తండ్రి పండిట్ ఉదిత్ నారాయణ్ చక్‌బస్త్, సిర్కా 1843 లో లక్నోలో జన్మించాడు. అతను కూడా కవి. పండిట్ ఉదిత్ నారాయణ్ డిప్యూటీ కలెక్టరుగా పనిచేసాడు. ఆ సమయంలో ఏ భారతీయుడైనా చేపట్టగల అత్యున్నత పదవి అది.[1] 1887 లో అతని తండ్రి మరణం తరువాత, కుటుంబం లక్నోకు వెళ్లింది. వారు లక్నోలోని కాశ్మీరీ మొహల్లాలో స్థిరపడ్డారు.

చక్‌బస్త్ ప్రారంభ విద్య ఫైజాబాద్‌లో జరిగింది. తరువాత, లక్నోలో మిగిలిన విద్యను పూర్తి చేశాడు. ఆ సమయంలో అలహాబాద్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న లక్నోలోని కానింగ్ కాలేజీ నుండి 1905 లో బిఎ, 1907 లో ఎల్ఎల్బి పట్టా పొందాడు. అతను న్యాయవాదిగా రాణించాడు.

చక్‌బస్త్ 1905 లో వివాహం చేసుకున్నాడు, కాని 1906 లో భార్యను, మొదటి బిడ్డనూ కోల్పోయాడు. 1907 లో మళ్ళీ వివాహం చేసుకున్నాడు. లక్నోలో లాయరుగా స్థిరపడ్డాడు. 1926 ఫిబ్రవరి 12 న, అతను రాయ్ బరేలిలోని రైల్వే స్టేషన్ వద్ద కుప్పకూలిపోయాడు. కొన్ని గంటల తరువాత 44 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

ఇతడి గజల్, నజమ్లు ప్రఖ్యాతి గాంచాయి

మూలాలు[మార్చు]

  1. Chakbast By Saraswati Saran, page 13