బ్లూ పారట్‌ఫిష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్లూ పారట్‌ఫిష్
Blue parrotfish
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
S. coeruleus
Binomial name
Scarus coeruleus
Edwards, 1771 [2]

నీలి చేప లేదా బ్లూ పారట్‌ఫిష్ అనునది అంతరించి పోవుచున్న ఒక అరుదైన చేప జాతి.

విశేషాలు[మార్చు]

  • ఈ చేపలు ఎక్కువగా కోరల్ రీఫ్ రాళ్ల దగ్గర ఉంటాయి.
  • ఇది సుమారు 29 అంగుళాల వరకు ఎదుగుతుంది.
  • నోట్లో దంతాలతో పాటు దీనికి గొంతులోనూ పళ్లుంటాయి. వీటిని పారింగ్జల్ టూత్ అంటారు.
  • చిలుక ముక్కులాంటి దీని దవడ, దంతాలతో రాళ్లపై ఉన్న ఆల్గేను తొలుస్తూ కడుపు నింపుకుంటుంది.
  • గొంతులోని పళ్లతో ఏకంగా రాళ్లనే ఇసుకలా తొలిచి అందులో నాచును తినేస్తుంది. అలా రోజు మొత్తంలో 80 శాతం సమయం ఇది ఆహార వేటలో గడుపుతుంది.
  • చిలుక ముక్కులాంటి దవడ ఉంటుంది కాబట్టి ఈ జాతి చేపల్ని ప్యారట్‌ఫిష్ అంటారు. కానీ దీని రంగుని బట్టి బ్లూ ప్యారట్‌ఫిష్ అని పేరు పెట్టారు.
  • ఆహారం కోసం సముద్రంలో పగడపు దీవుల్లోని రాళ్లను పళ్లతో గీరడం వల్ల బోలెడంత ఇసుక తయారవుతుంది. ఇలా ఒకో చేప ఏడాదికి సుమారు 90 కిలోల ఇసుకను తయారుచేస్తుందని అంచనా. కొన్ని బీచ్‌ల్లో తెల్లగా కనిపించే ఇసుక వీటి వల్ల ఏర్పడినదే.
  • వీటికి కూడా బ్లూ క్వాబ్స్, బ్లూ ప్యారట్స్, బ్లూమ్యాన్ అంటూ చాలా పేర్లు ఉన్నాయి.
  • ఇవి ఎక్కువగా అట్లాంటిక్, కరిబీయన్ సముద్రాల్లో ఉంటాయి.

పరిరక్షణ[మార్చు]

ఈ చేప ఆల్గేను తిని రీఫ్‌లపై దాని వ్యాప్తిని ఆపడం ద్వారా మిగతా చేపలకు కూడా రీఫ్‌లు ఆవాసమవుతున్నాయి. కానీ ఈ నీలి చేప క్రమంగా అంతరించిపోతుండడం వల్ల రీఫ్‌లపై నాచు అధికంగా పేరుకుపోయి బోలెడు చేప జాతులకు నష్టం కలుగుతోంది. ముఖ్యంగా బ్రెజిల్‌ లోని సముద్రాల్లోని రీఫ్‌లు బాగా దెబ్బతింటున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ఈ చేపను కాపాడే చర్యలు మొదలెట్టారు.

మూలాలు[మార్చు]

  1. Rocha, L.A., Choat, J.H., Clements, K.D., Russell, B., Myers, R., Lazuardi, M.E., Muljadi, A., Pardede, S. & Rahardjo, P. 2012. Scarus coeruleus. In: IUCN 2012. IUCN Red List of Threatened Species. Version 2012.2. <www.iucnredlist.org>. Downloaded on 9 January 2013.
  2. "Blue parrotfish". FishBase.org. Retrieved 4 February 2012.

బయటి లంకెలు[మార్చు]