చిలుక

వికీపీడియా నుండి

చిలుక
Yellow-crowned AmazonAmazona ochrecephala ochrecephala
Yellow-crowned Amazon
Amazona ochrecephala ochrecephala
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: పక్షులు
వర్గము: సిట్టసిఫార్మిస్
Wagler, 1830
Systematics
(but see below) Family Cacatuidae(cockatoos)
Family Psittacidae(true parrots)
(paraphyletic)

చిలుక (Parrot) ఒక రంగుల పక్షి. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకొంటుంటారు.

సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.[1][2] వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) మరియు కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా ఆస్ట్రేలాసియా మరియు దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.

చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి.

ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు మరియు చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని మరియు చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి.

చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి.


[మార్చు] భారతదేశములో చిలుక

భారతదేశములో చులుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట కలదు. భారతదేశమునందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.

[మార్చు] మూలాలు

  1. Psittacine. American Heritage Dictionary of the English Language, Fourth Edition. Houghton Mifflin Company (2000). తీసుకొన్న తేదీ: 2007-09-09.
  2. Psittacine. Merriam-Webster Online Dictionary. Merriam-Webster, Inc. తీసుకొన్న తేదీ: 2007-09-09.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B2%E0%B1%81%E0%B0%95" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు