భరతుడు (కురువంశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భరతుడు
చక్రవర్తి
దస్త్రం:Bharat plays with lion cubs.jpg
సింహం పిల్లలతో ఆడుకుంటున్న బాల భరతుడు
Predecessorదుష్యంతుడు
Successorభూమన్యు
జననంసర్వదమన
కణ్వ మహర్షి ఆశ్రమం.
Consortసునంద
Issueభూమన్యు
Houseచంద్రవంశం
రాజవంశంచంద్రవంశం
తండ్రిదుష్యంతుడు
తల్లిశకుంతల

భరతుడు పురాణాల ప్రకారం భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు. ఆయన శకుంతలా, దుష్యంతుల కుమారుడు. భరతుని పేరుమీదుగానే భారతదేశానికి ఆ పేరువచ్చిందని చెబుతారు.

జననం[మార్చు]

భరతుడి జననానికి సంబంధించిన కథ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ ఇతివృత్తం వ్యాసుని మహాభారతంలో వ్రాయగా, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలములో మరింత విపులీకరించి కావ్యంగా రచించారు. విశ్వామిత్రుడు మేనక సంభోగం వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుడి రాజ్యానికి పంపుతాడు. మెదట శకుంతల తన భార్య కాదు భరతుడు తన కుమారుడు కాదు అని అన్న దుష్యంతుడు, ఆకాశవాణి పలుకులతో జరిగిన వృత్తంతం గుర్తు తెచ్చుకొని భరతుడిని కుమారుడిగా అంగీకరిస్తాడు.

భరతుడి తరువాత వంశం[మార్చు]

భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి, హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు

కురు వంశవృక్షం[మార్చు]

చంద్రుడి కొడుకు బుధుడు. బుధుని కుమారుడు పురూరవుడు.పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సర. వారికి ఆరుగురు కుమారులు. వారిలో ఆయుషుడు అనే కుమారునికి కలిగిన నహుషుడు చక్రవర్తి అయ్యాడు. నహుషుని భార్య ప్రియంవద. వారి పుత్రుడు యయాతి. దేవయానీ యయాతికి యదువు, తుర్వసుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు.శర్మిష్ట వలన దృహ్వుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కుమారులు పుట్టారు. శాపకారణంగా యదు వంశస్థులు రాజ్యార్హత శాశ్వతంగా పోగొట్టుకున్నారు, తుర్వసులు కిరాతకులకు రాజులయ్యారు, ద్రూహ్యులు అతని వంశస్థులు జలమయ ప్రదేశాలకు రాజలయ్యారు, అనువు వంశజులు యవ్వనంలోనే మరణం పాలయ్యారు.శర్మిష్ట కుమారుడైన పూరుని చక్రవర్తిని చేసాడు. పూరుని కుమారుడు జనమేజయుడు, అతని కుమారుడు ప్రాచిన్వంతుడు, అతని కుమారుడు సంయాతి అతని కుమారుడు అహంయాతి అతని కుమారుడు సార్వభౌముడు ఆతని కుమారుడు జయత్సేనుడు అతని కుమారుడు అవాచీనుడు అతని కుమారుడు అరిహుడు అతని కుమారుడు మహాభౌముడు అతని కుమారుడు యుతానీకుడు అతని కుమారుడు అక్రోధనుడు అతని కుమారుడు దేవాతిధి అతని కుమారుడు రుచీకుడు అతని కుమారుడు రుక్షుడు అతని కుమారుడు మతినారుడు. మతినారుడు సరస్వతీ తీరాన పన్నెండు సంవత్సరములు సత్రయాగం చేసాడు. సరస్వతీ నది అతనిని భర్తగా చేసుకుంది. వారికి త్రసుడు అనేకుమారుడు కలిగాడు. అతని కుమారుడు ఇలీనుడు అతని కుమారుడు దుష్యంతుడు అతని కుమారుడు భరతుడు వంశకర్త అయ్యాడు. భరతునకు భుమన్యుడు జన్మించాడు. భుమన్యుని కుమారుడు సహోత్రుడు అతని కుమారుడు హస్థి. అతని పేరు మీద హస్థినాపురం వెలసింది. హస్తి కుమారుడు వికుంఠనుడు. అతని కుమారుడు అజఘీడుడు. అజఘీడునకు నూట ఇరవై నాలుగు మంది కుమారులు. వారిలో సంవరణుడు అనే వాడు సూర్యుని కుమార్తె తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి కురు జన్మించాడు. కురు మరొక వంశకర్త అయ్యాడు. అతని కుమారుడు అనశ్వుడు. అతని కుమారుడు పరీక్షిత్తు . అతని కుమారుడు భీమశేనుడు. అతని కుమారుడు ప్రదీపుడు. అతని కుమారుడు ప్రతీపుడు. అతని కుమారుడు శంతనుడు. శంతనునికి గంగాదేవి వలన ప్రభాసుని అంశతో దేవవ్రతుడు జన్మించాడు.పంచభూతముల సాక్షిగా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసాడు. అలా గాంగేయునికి భీష్ముడనే కారణ నామధేయం కలిగింది. శంతనునికి సత్యవతి వలన చిత్రాంగదుడు,విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు.చిత్రాంగదుని చక్రవర్తిని చేసాడు.అహంకారి అయిన చిత్రాంగదుడు ఒకసారి ఒక గంధర్వునితో యుద్ధానికి తలపడి మరణించాడు.తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని చక్రవర్తిని చేసాడు.కాశీరాజు తన కుమార్తెలు అయిన అంబిక,అంబాలికలను విచిత్రవీర్యునకిచ్చి వివాహంచేసాడు. విచిత్ర వీర్యుడు భోగ లాలసుడై చివరకు మరణించాడు. దేవర న్యాయం అనుసరించి అంబికకు వ్యాసుని వలన హంసుడు అనే గంధర్వుడు మహా బలవంతుడైన అంధుడు ఐన ధృతరాష్ట్రుడు జన్మించాడు.రెండవ కోడలయిన అంబాలిక వ్యాసుని తేజస్సుకు భయపడి పాలిపోయినందున ఆమెకు మరుద్గణాంశతో పాండువర్ణం కల పాండురాజు జన్మించాడు. అంబికకు గుడ్డి వాడు జన్మించినందువలన దుఃఖించిన సత్యవతి తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించినా అందుకు ఆమె మనసు సమ్మతించక తన దాసీని అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది. ఆ దాసీకి మాండవ్య మహాముని శాపం అందుకున్న యమధర్మరాజు విదురునిగా జన్మించాడు.దృతరాష్ట్రునికి గాంధారితో ఆమె పది మంది చెల్లెళ్ళతోనూ మరొక నూరు మంది కన్యలతోనూ ధృతరాష్ట్రునికి వివాహం జరిపించాడు. కుంతిభోజుడు తన కుమార్తె కుంతికి స్వయం వరం ప్రకటించాడు. స్వయంవరంలో పృధ పాండురాజుని వరించింది. వారిద్దరికి వివాహం అయింది. ఆతరువాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కుమార్తె మాద్రి వివాహం చేసుకున్నాడు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన కుమారుని పొందింది. అప్పుడు ఆకాశవాణి " ఇతను ధర్ముని వలన పొందింది కనుక ధర్మజుడని,యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్ఠిరుడని పిలువబడుతాడు"అని పలికింది. గాంధారి కుంతిదేవి కంటే ముందే గర్భం ధరించినా ముందుగా ప్రసవించ లేక పోవడంతో అసూయ చెంది తన గర్భాన్ని కొట్టుకుంది. అందువలన ఆమెకు గర్భస్రావం అయింది. అది విని వ్యాసుడు అక్కడకు వచ్చి ఆ మాసం ముక్కలను నూట ఒక్క నేతి కుండలలో భద్రపరిచి గాంధారితో ఆ కుండలను భద్రపరిస్తే వాటి నుండి నూరుగురు పుత్రులు ఒక కుమార్తె కలుగుతుందని చెప్పాడు. పాండురాజుకు మరొక కుమారుడు కావాలని కోరిక కలిగి వాయుదేవుని సాయంతో ఒక కుమారుని పొందమని చెప్పాడు. కుంతి వాయుదేవుని సాయంతో కుమారుని పొందింది. ఆకాశవాణి ఆ కుమారునికి భీమసేనుడు అని నామకరణం చేసింది. హస్థినాపురంలో (డిల్లీ ) గాంధారికి కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. ఒక్కోరోజుకు ఒక్కో కుమారుడు కలిగారు. నూరుగురు కుమారులు జన్మించిన తరువాత దుస్సల అనే కుమార్తె జన్మించింది. పాండురాజు కుంతీ దేవితో దేవతల అధిపతి అయిన ఇంద్రుని అంశతో ఒక కుమారుని పొందమని చెప్పాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై ముల్లోకాలను జయించ కలిగిన కుమారుడు కలుగుతాడని వరమిచ్చాడు. కుంతీ దేవికి ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో తేజోవంతుడైన పుత్రుడు కలిగాడు. అప్పుడు ఆకాశవాణి " ఇతను కార్తవవీరార్జ్యునికంటే వీరుడౌతాడు. కనుక అర్జునుడని పిలువబడుతాడు " అని పలికింది. కుంతీ మాద్రికి మంత్రోపదేశం చేయించగా మాద్రి అశ్వినీ దేవతల అంశతో నకులసహదేవులను పొందింది.

యివి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]