హస్తినాపురం
| ?हस्तिनापुर హస్తినాపురం ఉత్తరప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 202 మీ (663 అడుగులు) |
| జిల్లా(లు) | మీరట్ జిల్లా |
| జనాభా | 21 (2001) |
| కోడులు • పిన్‌కోడు |
• 250 404 |
హస్తినాపురం మహాభారతంనందు పేర్కొనబడిన ఒక పట్టణం. ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఉన్నది. ఢిల్లీ నుండి 110 కి.మీ, మీరట్ నుండి 37 కి.మీ దూరంలో ఉన్నది.
పురాణ ప్రాముఖ్యత
పురాణకాలమునందు హస్తినాపురం కురువంశపు రాజుల రాజధానిగా ఉండినది. మహాభారతంలోని సంఘటనల్లో చాలావరకూ హస్తినాపురమునందే జరిగాయి. హైందవ గ్రంథాలలో దీని మొదటి ప్రస్తావన చంద్రవంశపు రాజైన భరతుని రాజధానిగా వస్తుంది.
మధ్యయుగ కాలంలో బాబర్ భారతదేశంపై దండెత్తినపుడు హస్తినాపురంపైన కూడా దాడి జరిగినది. దేవాలయాలపై ఫిరంగులు గురిపెట్టబడ్డాయి. తదనంతర కాలంలో గుజ్జర్ కులస్థుడైన రాజా నయన్ సింగ్ నాగర్ హస్తినాపురాన్ని పరిపాలించాడు. ఇతని హయాంలో హస్తినాపురం మరియు పరిసర ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించబడ్డాయి.
జనాభా వివరాలు
ప్రస్తుతం హస్తినాపురం పట్టణం 21,248(2001 లెక్కలు) జనాభాతో నగర పంచాయతీగా ఉన్నది. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. అక్షరాస్యత 68%.
దర్శనీయ స్థలాలు
దిగంబర జైన బాబా మందిరం, జంబూద్వీప్, కైలాస్ పర్వత్, పాండేశ్వర్ గుడి ముఖ్యమైన గుళ్ళు.