మీరట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?मेरठ
మీరట్
ఉత్తర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 28°35′N 77°25′E / 28.59°N 77.42°E / 28.59; 77.42
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 224 మీ (735 అడుగులు)
జిల్లా(లు) మీరట్ జిల్లా
జనాభా
జనసాంద్రత
14 (2011)
• 8,123/కి.మీ² (21,038/చ.మై)
కోడులు
టెలిఫోను

• +91-121

మీరట్ (Meerut) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా మరియు ప్రముఖ నగరము. ఈ పురాతన నగరం జాతీయ రాజధాని ఢిల్లీకి 70 కి.మీ దూరంలోనూ, రాష్ట్ర రాజధాని లక్నోకి 453 కి.మీ దూరంలోనూ ఉన్నది. ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో ఢిల్లీ తర్వాత రెండవ పెద్ద ప్రాంతం. మీరట్ జనసమ్మర్ధ నగరం.

పురాణ ప్రాముఖ్యత:

మీరట్ నగరం మయరాష్ట్రంగా రావణుని మామయైన మయాసురునిచేత స్థాపించబడింది. రామాయణం ప్రకారం మీరట్ మయాసురుని రాజధాని. అందుకే ఈ పట్టణం "రావణ్ కీ ససురాల్" గా కూడా ప్రసిద్ధి చెందింది.

మీరట్ సైనిక స్థావరం

మీరట్‌లోని సైనిక స్థావరం విస్తీర్ణరీత్యా, జనాభారీత్యా భారతదేశంలో రెండవ పెద్ద సైనిక స్థావరము. ఇది 1803 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీచే స్థాపించబడినది. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమైనది కూడా ఇక్కడ నుండే.

రవాణా సౌకర్యాలు

విమానయానం అత్యంత సమీపంలోని విమానాశ్రయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలోని రద్దీని తగ్గించు ఉద్దేశ్యంలో మీరట్ వద్ద ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయటకు ప్రతిపాదనలున్నవి.

రహదారి మార్గాలు: ఢిల్లీ, నొయిడా, ఫరీదాబాద్, ఘాజియాబాద్, హరిద్వార్ మున్నగు ప్రధాన పట్టణాలతో మీరట్‌కు చక్కని రహదారి సౌకర్యం ఉన్నది. మూడు జాతీయ రహదారులు 58,119 మరియు 235 నగరం గుండా పోతున్నాయి. ప్రస్తుతం నిర్మాణదశలో నున్న ఎగువ గంగా కాలువ ఎక్స్‌ప్రెస్ మార్గం కూడా మీరట్ గుండా పోతున్నది. 2007 సంవత్సరంలో మెట్రోపాలిటన్ గా ప్రకటింపబడినప్పటి నుండి నగరంలో జె.ఎన్.ఎన్.యు.అర్.ఎం పధకం అమలుజరుపబడి, అనేక బస్సులు తిరుగుచున్నవి. ఇవి కాక అనేక స్థానిక బస్సు సర్వీసులు, ఆటోరిక్షాలు మహానగర రవాణాకి ఉపయోగపడుతున్నాయి.

రైలు మార్గం:

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=మీరట్&oldid=1356238" నుండి వెలికితీశారు