భాషా భాగాలు

వికీపీడియా నుండి

వివిధ భాషలలో భాషా భాగాలు వేర్వెరు రకాలుగా విభజించబడ్డాయి.

[మార్చు] చరిత్ర

పదాల వర్గీకరణ చరిత్రలో చాలా పురాతన కాలం నుంచి గమనించవచ్చు. సంస్కృత వ్యాకరణ వేత్త "యాస్కుడు", క్రీ. పూ. 5 లేక 6 వ శతాబ్దంలో రచించిన, ఆరు వేదాంగములలో ఒకటైన 'నిరుక్తము' అనే గ్రంధంలో పదాలను నాలుగు ముఖ్యమైన భాగాలుగా విభజించాడు. [1]

  • నామ -
  • ఆఖ్యాత - క్రియ
  • ఉపసర్గ
  • నిపాత

ఈ నాలుగు భాగాలను రెండు వర్గాలుగా విభజించాడు. (నామ, ఆఖ్యాత) మరియూ (ఉపసర్గ, నిపాత)

[మార్చు] ప్రస్తుత భాషాభాగాలు

తెలుగులో భాషా భాగములు ఐదు.

  • నామవాచకములు - మనుష్యుల పేర్లు, జంతువుల పేర్లు, ప్రదేశముల పేర్లు, వస్తువుల పేర్లు తెలియజేయు పదములు నామ వాచకములు. కృష్ణ, సీత పాఠశాల.
  • సర్వనామములు - నామ వాచకములకు బదులుగా వాడబడునది - నువ్వు, మీరు, నేను.
  • విశేషణములు - గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.
  • అవ్యయములు - లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు - బలే , అక్కడ.
  • క్రియలు - పనులన్నియు క్రియలు - చదువుట, తినుట, నడచుట.

ఈ క్రిందివి కూడా అప్పుడప్పుడూ ప్రస్తావన కొస్తాయి.

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు