భిల్లు ప్రజలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భిల్లు లేదా భీలు
భిల్ తెగకు చెందిన మధ్యప్రదేశ్ బాలిక
Total population
సుమారు 16 million[1]
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 భారతదేశం16,908,907[2][1]
        మధ్య ప్రదేశ్5,993,921[1]
        గుజరాతు4,215,603[1]
        రాజస్థాన్4,100,264[1]
        మహారాష్ట్ర2,588,658[1]
        కర్నాటక6,204[1]
        త్రిపుర3,105[1]
        ఆంధ్ర ప్రదేశ్604[1]
        చత్తీస్ గఢ్547[1]
మూస:Country data పాకిస్థాన్ (సింధు)474,000[ఆధారం చూపాలి]
భాషలు
భిల్ భాషలు, మరాఠీ , గుజరాతీ , సింధీ భాష
మతం
ఎక్కువగా హిందూ మతం, ఇస్లాం , క్రైస్తవ మైనారిటీలతో.
సంబంధిత జాతి సమూహాలు
ఇండో-ఆర్యన్ ప్రజలు, భేల్ (తెగ), వార్లీ, హల్బా, గుజరాతీ ప్రజలు

భిల్లు లేదా భీలు పశ్చిమ భారతదేశంలో ఇండో-ఆర్యభాషా కుటుంబానికి చెందిన సమూహం. వారు ఇండో-ఆర్య భాషల పశ్చిమ జోను ఉప సమూహమైన భిల్లు భాషలను మాట్లాడతారు. 2013 నాటికి భిల్లు భారతదేశంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన సమూహంగా గుర్తించబడుతుంది.[3] భిల్లులు గుజరాత్, మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ , మహారాష్ట్ర, రాజస్థాన్-పశ్చిమ దక్కను ప్రాంతాలు, మధ్య భారతదేశంలో-అలాగే బంగ్లాదేశు సరిహద్దులో ఉన్న తూర్పు భారతదేశంలోని త్రిపురలో స్థానిక జాతులుగా ఉన్నాయి. భిల్లులు అనేక ప్రాదేశిక విభాగాలుగా విభజించబడ్డాయి. ఇవి అనేక వంశాలను కలిగి ఉన్నాయి. మరాఠీ, గుజరాతీ లేదా హిందూస్థానీ మాండలికం వంటి చాలా మంది భిల్లులు ఇప్పుడు వారు నివసించే ప్రాంతం భాషను మాట్లాడతారు.

చరిత్ర[మార్చు]

బ్రిటీషు వలసరాజ్యాల కాలంలో ముఖ్యంగా 1846, 1857-58, 1868 లలో అనేక సందర్భాలలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న భిల్లులు తిరుగుబాటులలో పాల్గొన్నారు.[4]

ప్రస్తుత పరిస్థితులు[మార్చు]

భారత ప్రభుత్వ రిజర్వేషను కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశు, ఛత్తీసుగఢ్, గుజరాతు, కర్ణాటక, మధ్యప్రదేశు, మహారాష్ట్ర, రాజస్థాను, త్రిపురలలో షెడ్యూల్డు తెగగా వర్గీకరించబడింది.[2]

ఉప-విభాగాలు[మార్చు]

అనేక ప్రాదేశిక విభాగాలుగా విభజించబడింది. వీరిలో అనేక ఉపజాతులు, వంశాలు ఉన్నాయి. రాజస్థానులో వారు భిల్లు గరాసియా, ధోలి భిల్లు, దుంగ్రీ భిల్లు, దుంగ్రీ గరాసియా, మేవాసి భిల్లు, రావలు భిల్లు, తద్వి భిల్లు, భాగాలియా, భిలాలా, పావ్రా, వాసవ, వాసావే మొదలైన ఉపజాతులుగా ఉన్నారు.[5][a]

భాష[మార్చు]

Partial specimen of the Bhili language

భిల్లులు వారి భౌగోళిక విస్తరణ అంతటా సాధారణంగా మాట్లాడే భాష భిలి.[6] భిలి భాషలో సుమారు 36 వరకు గుర్తించబడిన మాండలికాలు ఉన్నాయి. ఉచ్చారణ మాత్రం ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంటుంది.[6][7] భిలి భాష గుజరాతీ మీద ఆధారపడింది. కాని భిలి మాండలికాలు క్రమంగా ఆగ్నేయంలో మరాఠీ, వాయువ్యంలో రాజస్థానీ వంటి విస్తృతంగా మాట్లాడే భాషలలో విలీనం అవుతాయి.[8]భిలి వంటి చిన్న భాషలను మాట్లాడేవారు కొన్నిసార్లు మాతృభాషగా ప్రధాన భాషలను (మరాఠీ లేదా గుజరాతీ వంటివి) కలిగి ఉన్నందున భాష మాట్లాడే వ్యక్తుల అంచనాలు సంఖ్యాపరంగా ఖచ్ఛితంగా నిర్ణయించడం సరికాదు.[9]

సంస్కృతి[మార్చు]

భిల్లులు గొప్ప, ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉన్నారు. భిల్లుల ఉపవిభాగం పిథోరా పెయింటింగుకు ప్రసిద్ధి చెందింది.[10] భిల్లు తెగకు చెందిన సాంప్రదాయ జానపద నృత్యం ఘూమరు.[11][12] ఘూమరు స్త్రీత్వానికి చిహ్నం. యువతులు ఈ నృత్యంలో పాల్గొని, మహిళలాట్వంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు.

కళలు[మార్చు]

భిల్లు పెయింటింగు బహుళ వర్ణ చుక్కలను ఇన్-ఫిల్లింగుగా ఉపయోగించడం ద్వారా వర్గీకరించబడుతుంది. రెడీమేడు రంగులు, కాగితాలను ఉపయోగించి చిత్రించిన మొట్టమొదటి భిల్లు కళాకారుడు భూరి బాయి. ప్రసిద్ధి చెందిన ఇతర తెలిసిన భిల్లు కళాకారులలో లాడో బాయి, షేరు సింగు, రాం సింగు, డబు బారియా గుర్తింపు కలిగి ఉన్నారు. [13]

ఆహారం[మార్చు]

మొక్కజొన్న, ఉల్లిపాయ, వెల్లుల్లి, మిరపకాయలు భిల్లుల ప్రధాన ఆహారాలుగా ఉన్నాయి. ఈపంటలను వారు చిన్నచిన్న వ్యవసాయక్షేత్రాలలో పండిస్తారు. వారు స్థానిక అడవుల నుండి పండ్లు, కూరగాయలను సేకరిస్తారు. పండుగలు వంటి ఇతర ప్రత్యేక సందర్భాలలో మాత్రమే గోధుమలు, బియ్యం ఉపయోగిస్తారు. వారు ఆత్మరక్షణ కోసం స్వీయ-నిర్మిత విల్లు, బాణాలు, కత్తులు, గొడ్డలి మొదలైన ఆయుధాలుగా ఉపయోగిస్తారు. అడవి జంతుజాలాలను వేటాడతారు. అవి వారి ఆహారంలో ప్రధాన భాగంగా ఉంటాయి. వారు మహువా (మధుకా లాంగిఫోలియా) పువ్వు నుండి స్వేదనం చేసిన ఆల్కహాలును బాగా ఉపయోగిస్తున్నారు. పండుగ సందర్భాలలో, డిష్ రిచ్ (మొక్కజొన్న, గోధుమ, బార్లీ, మాల్టు, బియ్యం) నుండి వివిధ ప్రత్యేక ఆహారాలు తయారు చేస్తారు. భిల్లుల సాంప్రదాయ ఆహారాలలో ప్రధాహారం మాంసాహారం.[14]

దుస్తులు[మార్చు]

ఒక భిల్లు యువతి

పురుషుల సాంప్రదాయ దుస్తులు పగ్రి, అంగార్ఖా, ధోవతి, గంచా. సాంప్రదాయకంగా మహిళలు చీర, ఘగ్రా చోలి ధరిస్తారు. భిల్లుల అనేక సాంప్రదాయ ఆభరణాలు ఉన్నాయి. పురుషులు కడా, బాజుబాండు, గొలుసు, చెవి రింగులు, కర్ధాని ధరిస్తారు. మహిళలు హన్స్లీ, ఉంగరాలు, జెలే-జుమ్కే, చెవిపోగులు, నార్నియాను (గాజు), నాథ్ని (ముక్కు-ఆభరణాలు) వంటి వివిధ రకాల ఆభరణాలను ధరిస్తారు. స్త్రీలకు సాధారణంగా వివాహానికి ముందు పచ్చబొట్టు చేస్తారు.[14]

విశ్వాసం, ఆరాధన[మార్చు]

ప్రతి గ్రామానికి దాని స్వంత స్థానిక దేవత (గ్రామదేవత) ఉంది. కుటుంబాలకు వారి జటిదేవ్, కుల్దేవ్, కుల్దేవి (కుల దేవత) కలిగివుంటాయి. దేవతలను రాతి విగ్రహాలుగా చేసుకుని ఆరాధిస్తారు. 'భాటి దేవ్', 'భిలత్ దేవ్' వారి నాగదేవత. 'బాబా దేవ్' వారి గ్రామ దేవుడు. కర్కులియా దేవ్ వారి పంటల దేవుడు, గోపాల దేవ్ వారి మతసంబంధమైన దేవుడు, బాగ్ దేవ్ వారి సింహరూప దేవుడు, భైరవ్ దేవ్ వారి కుక్కరూపంలో ఉన్న దేవుడు. ఇందెల్ దేవ్, బడా దేవ్, మహాదేవెల్, తేజాజీ, లోథా మై, టెక్మా, ఓర్కా చిచ్మా, కాజల్ దేవ్ ఇతర దేవతలను ఆరాధిస్తుంటారు.

వారి శారీరక, మానసిక చికిత్సల కోసం మూఢ నమ్మకాలు, భోపాసుల మీద వారికి తీవ్రమైన నమ్మకం ఉంది. [14]

పండుగలు[మార్చు]

భిల్లులలో అనేక పండుగలు ఉన్నాయి. భిల్లులు రాఖీ, నవరాత్రి, దశర, దీపావళి, హోలీ మొదలైన జరుపుకుంటారు. వీటితో కొన్ని సాంప్రదాయ పండుగలను కూడా జరుపుకుంటారు. అఖతీజు, నవమి, హోవాను మాతా కి చాలవానీ, సావను మాతా కి జాతారు, దివాసా, నవై, భాగోరియా, గాలు, గారు, ధోబి, సంజా, ఇండెలు, దోహా మొదలైన ఉత్సాహవంతమైన ఉత్సవాలు జరుపుకుంటారు.

జిల్లాలలోని వివిధ ప్రదేశాలలో కొన్ని పండుగ సందర్భాలలో నవరాత్రి మేళా, భగోరియా మేళా (హోలీ పండుగ సందర్భంగా) మొదలైన అనేక గిరిజన ఉత్సవాలు జరుగుతాయి. [14] ఉదయపూరు లోని భిల్లు సంఘం ప్రతి సంవత్సరం హోలీ తరువాత గవారీ పండుగను జరుపుకుంటుంది.[15]

సామూహిక దృశ్యం, ఉత్సవాలు[మార్చు]

భిల్లులు వినోదంలో జానపద పాటలు, నృత్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పుట్టిన వేడుకలు, వివాహాలు మొదలైన సాంప్రదాయ వేడుకలలో భిల్లుల శైలిలో కొన్ని ఉత్సవాలలో డ్రం వాయించడంతో పాటు మహిళలు నృత్యం చేస్తారు. వారి సంప్రదాయ నృత్యాలలో లాతి (సిబ్బంది) నృత్యం, ధోలు నృత్యం, వివాహ నృత్యం, హోలీ నృత్యం, యుద్ధ నృత్యం, భగోరియా నృత్యం, దీపావాలు నృత్యం, వేట నృత్యం ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. సంగీత వాయిద్యాలలో హార్మోనియం, సారంగి, కుండి, బన్సూరి, అపాంగ్, ఖాజ్రియా, తబలా, హంజు, మండలు, తాలి ప్రాధాన్యత ఉన్నాయి. ఇవి సాధారణంగా స్థానిక ఉత్పత్తుల నుండి తయారు చేయబడుతూ ఉంటాయి.[14]

ప్రాంతీయ రాజకీయ నిర్మాణం[మార్చు]

సాంప్రదాయ భిల్లు గ్రామాలకు ఒక అధిమతి (గామేటి) నేతృత్వం వహిస్తాడు. చాలా స్థానిక వివాదాలు లేదా సమస్యల మీద గామేటికి అధికారం, నిర్ణయం తీసుకునే అధికారాలు ఉన్నాయి.[16]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. The Vasava and Vasave in Rajasthan may be alternate transliterations of the name for a single community. The sources are unclear regarding this.
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 "A-11 Individual Scheduled Tribe Primary Census Abstract Data and its Appendix". Census of India 2011. Registrar General and Census Commissioner of India. Retrieved 2017-03-24.
  2. 2.0 2.1 "List of notified Scheduled Tribes" (PDF). Census India. Archived from the original (PDF) on 7 November 2013. Retrieved 16 December 2019.
  3. Statistical Profile of Scheduled Tribes in India (PDF). New Delhi: Ministry of Tribal Affairs. 2013. p. 10. Archived from the original (PDF) on 2019-08-20. Retrieved 2019-12-16.
  4. Ghosh, S. K. (1987). Law Enforcement in Tribal Areas. Ashish Publishing House. p. 124.
  5. "List of Scheduled Tribes". Census of India: Government of India. 7 March 2007. Archived from the original on 5 జూన్ 2010. Retrieved 16 December 2019.
  6. 6.0 6.1 Mehta, Sonu (2004). "Bhils - I". In Mehta, Prakash Chandra (ed.). Ethnographic Atlas of Indian Tribes. New Delhi: Discovery Publishing House. p. 191.
  7. Phillips, Maxwell P. (2012). Dialect Continuum in the Bhil Tribal Belt: Grammatical Aspects. University of London. p. 23.
  8. Ratnagar, Shereen (2010). Being Tribal. Delhi: Primus Books.
  9. "Paper No. I - Languages". Census of India 1951. 1954. p. 61.
  10. Pachauri, Swasti (26 June 2014). "Pithora art depicts different hues of tribal life". Indian Express. Retrieved 13 February 2015.
  11. Kumar, Ashok Kiran (2014). Inquisitive Social Sciences. Republic of India: S. Chand Publishing. p. 93. ISBN 9789352831098.
  12. Danver, Steven L. (June 28, 2014). Native People of The World. United States of America: Routledge. p. 522. ISBN 076568294X.
  13. "Bhil Art - How A Tribe Uses Dots To Make Their Story Come Alive". Artisera. Retrieved 2019-03-18.
  14. 14.0 14.1 14.2 14.3 14.4 Ethnobotany of Bhil Tribe. {{cite book}}: |website= ignored (help)
  15. "GAVARI: A tribal dance drama by the Bhil community of Udaipur". mediaindia.eu. Retrieved 4 September 2019.
  16. Winston, Robert, ed. (2004). Human: The Definitive Visual Guide. New York: Dorling Kindersley. p. 439. ISBN 0-7566-0520-2.

అదనపు అధ్యయనం[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]