మంగళగిరి శ్రీనివాసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dr. Mangalagiri Srinivasulu
డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు
జననండాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు
గ్రామం : బోయిన్ పల్లి , మండలం : మిడ్జిల్
నివాస ప్రాంతంమహబూబ్ నగర్
వృత్తిసహాయ ఆచార్యులు, పాలమూరు విశ్వవిద్యాలయం
ప్రసిద్ధికవి, పరిశోధకులు, విమర్శకులు
మతంహిందూ

మంగళగిరి శ్రీనివాసులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన, కవి, రచయిత, సాహిత్య పరిశోధకుడు,విమర్శకుడు. వృత్తిరీత్యా పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతను సాహిత్యానికి సంబంధించి జాతీయ,అంతర్జాతీయ సదస్సులలో 30కి పైగా పత్ర సమర్పణలు చేశాడు.కేంద్ర సాహిత్య అకాడమీ, యు.జి.సి.సెమినార్లలో, అనేక కవిసమ్మేళనాలలో పాల్గొన్నాడు. ఇతని కవితలు, గేయాలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు అనేక దిన,వార,మాస,త్త్రైమాసిక,వార్షిక పత్రికలలో వెలువడ్డాయి.

కుటుంబ నేపథ్యం[మార్చు]

మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్ మండలం , బోయిన్‌పల్లి ఇతని స్వగ్రామం. 1985 జనవరి 10 వ తేదిన జన్మించాడు. తల్లిదండ్రులు మంగళగిరి శంకర్ బాయి, మంగళగిరి రామచందర్ జీ. ఈ దంపతులకు ఇతను 5వ సంతానం.

విద్యాబ్యాసం[మార్చు]

ప్రాథమిక విద్య బోయిన్ పల్లి లో,ఉన్నత పాఠశాల విద్య మిడ్జిల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మిడ్జిల్‌లో, డిగ్రీ విద్య కల్వకుర్తి లో,తెలుగు పండిత శిక్షణ ఉపాధ్యాయ విద్యను SVTPT మిర్యాలగూడలో, వీటితో పాటు స్నాతకోత్తర విద్య ఎం.ఏ తెలుగును ఉస్మానియ విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశాడు. UGC NET కూడా సాధించాడు.

సాహిత్య పరిశోధన[మార్చు]

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 'ఆంధ్ర సారస్వత పరిషత్తు - తెలుగు భాషా సాహిత్య సేవ ' (నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు) అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేసి

2018లో డాక్టరేట్ పట్టాను పొందాడు. ఇతను పలు సాహిత్య  సాంస్కృతిక సంస్థలలో  క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.

ఉద్యోగ జీవితం[మార్చు]

తెలుగు పండిత శిక్షణ అనంతరం తెలుగు ఉపాధ్యాయుడిగా 2009-2010లో నవ్య గ్రామర్ ఉన్నత పాఠశాలలో , హైమవతి ఉన్నత పాఠశాలలో, జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశాడు. ఇతనికి పోటీపరీక్షలకు తెలుగు బోధకుడిగా పలు విద్యాసంస్థలలో పనిచేసి అనుభవం ఉన్నది. ప్రస్తుతం స్నాతకోత్తర కేంద్రం,గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు(సి)గా పనిచేస్తున్నాడు.

నాటకరంగం[మార్చు]

వీరికి నాటకరంగంలో కూడా ప్రవేశం ఉంది. ఆదిశిలాక్షేత్ర వైభవం (పౌరాణిక పద్య నాటకం)అనే నాటకంలో చిత్రవిభీషణ మహారాజు పాత్రను పోషించారు. ఈ నాటకాన్ని పల్లెర్ల రామ్మోహన్ రావు గారు రచించగా రామలింగయ్య గారి దర్శకత్వంలో 2022లో త్యాగరాజ గానసభ, హైదరాబాద్ లో తొలిసారిగా ప్రదర్శించారు. ఈ నాటకం జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ క్షేత్రమాహాత్మ్య౦ గురించి తెలుపుతుంది.

మంగళగిరి శ్రీనివాసులు పుస్తకాలు

రచనలు[మార్చు]

ఇతను కవితలు, కథలు, పాటలు, పద్యాలు, వ్యాసాలు మొదలగు ప్రక్రియలలో రచనలు చేశాడు. ఇప్పటికి ఆరు పుస్తకాలు ముద్రించాడు. అవి

  1. ఆరెకటిక కులగోత్ర వృత్తి పురాణం[1]
  2. సంగడి (సాహిత్య వ్యాసాల సంపుటి)[2]
  3. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా సాహిత్య సేవ (సిద్ధాంత గ్రంధం)[3]
  4. వివేచన (సాహిత్య వ్యాస సంపుటి)[4]
  5. ఆరెకటిక మొగ్గలు (మొగ్గలు)[5]
  6. ఊట (వచన కవిత్వం)[6]

పురస్కారాలు[మార్చు]

  1. కులసాహిత్యరత్న 2015,
  2. బంగి బాలయ్య స్మారక సాహిత్య అవార్డు 2016,
  3. ఉత్తమకవి సత్కారం 2016,
  4. జాతీయ ఎక్సలెన్స్ అవార్డ్ కటిక్ శిరోమణి 2016,
  5. మహాత్మా జ్యోతిరావుపూలే జాతీయ అవార్డు -2018
  6. సేవభారతి పురస్కారం 2019,
  7. గాంధీ సాహిత్యరత్న -2020
  8. మన తెలుగుతేజం జాతీయ అవార్డు -2021
  9. కాళోజీ విశిష్ట పురస్కారం -2022
  10. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం -2022[7]

వివిధ సంస్ధలతో అనుబంధం[మార్చు]

  1. అఖిల భారతీయ ఆరెకటిక సంఘం సాంస్కృతిక శాఖ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
  2. జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక సభ్యులు
  3. గద్వాల సాహితీ సమితి సభ్యులు

మూలాలు[మార్చు]

  1. ఆరెకటిక కులగోత్ర వృత్తి పురాణం-మంగళగిరి శ్రీనివాసులు, ఆకాష్ ప్రచురణలు,ఆగస్టు,2015
  2. సంగడి-మంగళగిరి శ్రీనివాసులు, ఆకాష్ ప్రచురణలు,ఫిబ్రవరి,2019
  3. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా సాహిత్య సేవ-మంగళగిరి శ్రీనివాసులు, అపర్ణా ప్రచురణలు, జనవరి,2020
  4. వివేచన-మంగళగిరి శ్రీనివాసులు, బాలాజీ ప్రచురణలు,జూలై,2021
  5. ఆరెకటిక మొగ్గలు-మంగళగిరి శ్రీనివాసులు, మంగళగిరి ప్రచురణలు,మహబూబ్ నగర్,ఆగస్ట్,2022
  6. ఊట-మంగళగిరి శ్రీనివాసులు, మంగళగిరి ప్రచురణలు,మహబూబ్ నగర్,సెప్టెంబర్,2023
  7. ఊట (వచన కవిత్వం) - మంగళగిరి శ్రీనివాసులు, చివరిపేజి, మంగళగిరి ప్రచురణలు, మహబూబ్ నగర్, సెప్టెంబర్,2023