మందనపల్లి
మందనపల్లి, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన శివారు గ్రామం. మందన్‌పల్లి గ్రామ పంచాయతిని 8 వార్డులుగా విభజించారు.[1]
గ్రామ చరిత్ర
[మార్చు]మందనపల్లిః సాయిగూడెం, కొల్లూరుల నడిమి ఊరు మందనపల్లి.గ్రామంలో ప్రాచీనమైన రాజరాజేశ్వరుని (శివుని) గుడి ఉంది. ఈ గుడిని వెయ్యేండ్ల కింద ఎల్లంభట్టనే పండితుడు కట్టించాడట.ఇతని పేరు మీద ఒక కుంట, కుంటకట్ట ఉన్నాయి.ఆ తర్వాత కాలంలో శిథిలమైన దేవాలయాన్ని కొత్తూరి చిన్న సిద్ధిరామయ్య జీర్ణోద్ధారణ చేసాడు.గుడి కవతల కొద్ది దూరంలో గజం దూరాలతో 3 బొడ్రాళ్ళున్నాయి.వందల ఏండ్ల కింద వరదల కారణంగా ఊరును 3 సార్లు పునర్నిర్మాణం చేసారని గ్రామస్థులు చెప్పారు.బహుశః ఆ సమయంలోనే సాయిగూడెం కూడా వరదమట్టితో పూడిపోయి వుంటుంది. బొడ్రాళ్ళకు అరమైలు దూరంలో పరుపుబండ మీద గిద్దలమ్మ దేవత చెక్కివుంది. చతుర్భుజియైన ఈ దేవతనిక్కడ ఎందుకు చెక్కారో? అక్కడే ఆ బండ మీద పాదాలగుర్తులు చెక్కబడివున్నాయి. మరికొంత దూరంలో చౌడలమ్మగుడి ఉంది. (మందనపల్లి వాసి అయిలవీరన్న చెప్పిన సమాచారం.)
విద్య
[మార్చు]ఈ గ్రామంలో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ఉంది.[2]
గ్రామ జనాభా
[మార్చు]- ↑ "Gram Panchayat (ग्राम पंचायत): MANDANPALLY (మందనపల్లి )". localbodydata.com. Archived from the original on 2023-12-28. Retrieved 2023-12-28.
- ↑ "Gram Panchayat (ग्राम पंचायत): MANDANPALLY (మందనపల్లి )". localbodydata.com. Archived from the original on 2023-12-28. Retrieved 2023-12-28.