మతిమరపు వ్యాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మతిమరపు వ్యాధి
SpecialtyNeurology Edit this on Wikidata
Frequency5.05% (ఐరోపా)

మతిమరపు వ్యాధి (అల్జీమర్స్) ఒక దీర్ఘకాలిక న్యూరోడీజెనరేటివ్ వ్యాధి. ఇది నెమ్మదిగా ప్రారంభమై కాలం గడిచేకొద్దీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.[1][2] డెమెన్షియా 60 నుంచి 70 శాతం కేసుల్లో దీనివల్లనే సంభవిస్తుంది. ఈ వ్యాధికి ముందు ఎక్కువగా కనిపించే లక్షణం ఇటీవలే జరిగిన సంఘటనలు మరిచిపోవడం (short-term memory). ఈ వ్యాధి ముదిరే కొద్దీ భాషతో వచ్చే సమస్యలు, స్థితిభ్రాంతి (disorientation) (ఎక్కడున్నారో మరిచిపోవడం), ప్రవర్తనలో తేడాలు, స్ఫూర్తి కొరవడటం, దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోలేకపోవడం, సమస్యాత్మక ప్రవర్తనలు మొదలైనవి. ఈ వ్యాధి ఇంకా ముదిరేకొద్దీ కుటుంబం నుంచి సమాజం నుంచీ దూరం కావడం ప్రారంభిస్తారు. క్రమంగా శరీర కార్యకలాపాలు ఆగిపోయి, మరణం సంభవిస్తుంది.[3] ఈ వ్యాధి ముదిరే కాలంలో పలు వ్యత్యాసాలున్నప్పటికీ, నిర్ధారణ జరిగిన తర్వాత రోగి జీవితకాలం సుమారు మూడు నుంచి తొమ్మిది సంవత్సరాలు.[4][5]

సాధారణంగా 65 ఏళ్ళ పైబడిన వారిలో కనిపించే వ్యాధి ఇది. జ్ఞాపకశక్తి మందగించడం దీని ముఖ్య లక్షణం. దీన్ని అలోయిస్ అల్జీమర్స్ అనే జర్మన్ మానసిక శాస్త్రవేత్త 1906 లో మొట్టమొదటి సారిగా వివరించాడు.

అల్జీమర్స్ వ్యాధి జ్ఞాపకశక్తి, ఇతర ముఖ్యమైన మానసిక విధులు నాశనం చేసే ఒక ప్రగతిశీల వ్యాధి. మొట్టమొదట, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఎవరైనా తేలికపాటి గందరగోళాన్ని గుర్తించడం, కష్టపడటం గమనించవచ్చు. చివరికి, వ్యాధి ఉన్న వారు తమ జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తులను మరచిపోతారు. నాటకీయ వ్యక్తిత్వ మార్పులకు గురవుతారు. అల్జీమర్స్ వ్యాధి చాలా సాధారణమైనది. అల్జీమర్స్ అనేది మేధోపరమైన, సామాజిక నైపుణ్యాల నష్టం. అల్జీమర్స్ వ్యాధిలో, మెదడు కణాలు క్షీణించి చనిపోతాయి, ఇది జ్ఞాపకశక్తి, మానసిక పనితీరులో స్థిరమైన క్షీణతకు కారణమవుతుంది.

కారణాలు[మార్చు]

అల్జీమర్స్ వ్యాధిలో, మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను ఆపడానికి అమిలోయిడ్ అనే ప్రోటీన్‌ను శరీరంలో ఉత్పత్తి చేయలి. అందుకని శరీరం ప్రయత్నిస్తుంది. అలా అని అమిలోయిడ్ ప్రోటిన్ ఎక్కువ అయితే, అమీలోడ్ డిపాజిట్లు మెదడులో వృద్ధి చెందుతాయి. ఇది మరింత క్షీణతకు దారితీస్తుంది. అమీయోయిడ్ ఈ నిక్షేపాలు “ఫలకాలు” గా సూచించబడతాయి. ఇవి మెదడు కణాలు చీల్చి, “టంగ్లేస్” గా ఏర్పడతాయి, ఇది మెదడు నిర్మాణం లో మార్పులకు దారితీసి, మెదడు కణాలు చనిపోయేలా చేస్తుంది. ఫలకాలు, టాంగ్ల నిర్మాణం కూడా కొన్ని ముఖ్యమైన మెదడు రసాయనాల ఉత్పత్తిని నిరోదిస్తాయి.[6] అల్జీమర్స్ వ్యాధులకు ఎటువంటి కారణం లేనప్పటికీ, ఈ పరిస్థితి అభివృద్ధిలో ఈ కింది కారకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కొన్ని పరిశోధన అధ్యయనాలు సూచిస్తున్నాయి:

  • జన్యు కారకాలు: కొన్ని జన్యువుల ఉనికిని, లేదా మార్పులు వంటివి
  • పర్యావరణ కారకాలు: కొన్ని పర్యావరణ ద్రావకాల (ఉదాహరణకు: పురుగుమందులు, గ్లూ, పైపొరలు) లేదా కొన్ని వైరస్లు లేదా బ్యాక్టీరియా సంక్రమణ
  • జీవనశైలి కారకాలు:వ్యాయామం లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం,నాణ్యమైన పళ్ళు, కూరగాయలు లేని ఆహారం తీసుకోవడం.
ఈ జీవనశైలి, పర్యావరణ, జన్యు ప్రమాద కారకాల కలయిక మెదడులో ఒక అసాధారణ జీవ ప్రక్రియను ప్రేరేపిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు, దశాబ్దాలుగా అల్జీమర్స్– చిత్తవైకల్యం ఫలితంగా ఇది జరుగుతుంది.

మూలాలు[మార్చు]

  1. Burns A, Iliffe S (February 2009). "Alzheimer's disease". BMJ. 338: b158. doi:10.1136/bmj.b158. PMID 19196745.
  2. "Dementia Fact sheet". World Health Organization. 12 December 2017.
  3. "About Alzheimer's Disease: Symptoms". National Institute on Aging. Archived from the original on 15 January 2012. Retrieved 28 December 2011.
  4. Querfurth HW, LaFerla FM (January 2010). "Alzheimer's disease". The New England Journal of Medicine. 362 (4): 329–44. doi:10.1056/NEJMra0909142. PMID 20107219.
  5. Todd S, Barr S, Roberts M, Passmore AP (November 2013). "Survival in dementia and predictors of mortality: a review". International Journal of Geriatric Psychiatry. 28 (11): 1109–24. doi:10.1002/gps.3946. PMID 23526458.
  6. Madhuri. "అల్జీమర్స్ అంటే ఏమిటి? అల్జీమర్స్ లక్షణాలు, కారణాలు, నిర్ధారణ పరిక్షలు | Medlife Blog: Health and Wellness Tips". Archived from the original on 2020-06-03. Retrieved 2020-05-17.