Coordinates: 23°13′48″N 69°42′39″E / 23.230127°N 69.710821°E / 23.230127; 69.710821

మధాపర్ (గుజరాత్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధాపర్
గ్రామం
మధాపర్ గేట్
మధాపర్ ఎంట్రెన్స్ గేట్
మధాపర్ is located in Gujarat
మధాపర్
మధాపర్
గుజరాత్, భారతదేశం
Coordinates: 23°13′48″N 69°42′39″E / 23.230127°N 69.710821°E / 23.230127; 69.710821
దేశం India
రాష్ట్రంగుజరాత్
జిల్లాకఛ్
Area
 • Total43.67 km2 (16.86 sq mi)
Elevation
105.156 మీ (345.000 అ.)
Languages
 • Officialగుజరాతీ, కచ్చి భాష
Time zoneUTC+5:30 (IST)
PIN
370020
Telephone code2832
Vehicle registrationGJ-12

మధాపర్, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, కఛ్ జిల్లా, భుజ్ తాలూకాలో ఉన్న గ్రామం. ఇది బ్యాంకు డిపాజిట్ల పరంగా ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం. సుమారు 7600 కుటుంబాలున్న ఈ గ్రామంలోని 17 బ్యాంకుల్లో 5,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.[1]

ప్రస్తుత స్థితి[మార్చు]

ఇటీవలి కాలంలో కొత్త చెరువులు, ఆనకట్టలు, బోరు బావులతో గ్రామం సస్యశ్యామలంగా మారింది. కొత్త ఆరోగ్య కేంద్రాలు, స్పోర్ట్స్ పార్కులు, దేవాలయాలు వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది.

చరిత్ర[మార్చు]

చారిత్రక ప్రదేశం అయిన నాని బా వావ్

కచ్ మిస్ట్రీలు స్థాపించిన 18 గ్రామాలలో మధాపర్ ఒకటి. 12వ శతాబ్దంలో, కఛ్ గుర్జర్ క్షత్రియులు అని కూడా పిలువబడే ఈ వర్గానికి చెందిన చాలా మంది ప్రజలు మొదట ధనేటి అనే గ్రామంలో స్థిరపడ్డారు, తరువాత అంజర్, భుజ్ గ్రామాల మధ్య స్థిరపడ్డారు. [2] [3] [4] 1473–1474 సంవత్సరంలో ధనేటి గ్రామం నుండి జునావాస్ గ్రామానికి మారిన మాధ కంజి సోలంకి అనే వ్యక్తి పేరు మీదుగా ఆ ఊరికి మధాపర్ అనే పేరు వచ్చింది.[5] మాధ కంజి గుజరాత్‌లోని సోలంకి రాజవంశానికి చెందిన హేమ్‌రాజ్ హర్దాస్ మూడవ తరం వారసుడు, అతను హలార్ ప్రాంతం నుండి ధనేటికి, తరువాత మధాపర్ కు మారాడు. [6] [7] ఈ యోధులైన క్షత్రియులు తరువాత ప్రధానంగా వారి వృత్తి కారణంగా మిస్ట్రీచే గుర్తించబడ్డారు. ఈ మిస్ట్రీలు జునావాస్‌ను అభివృద్ధి చేశారు, అన్ని ప్రారంభ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, గ్రామంలోని దేవాలయాలు, కఛ్ లోని ఇతర వాస్తుశిల్పాల నిర్మాణానికి చాలా దోహదపడ్డారు. సా.శ. 1576 ప్రాంతంలో పటేల్ కాన్బి సంఘం ఈ గ్రామంలోకి ప్రవేశించింది. నవోవాస్ (కొత్త నివాసం) 1857లో ప్రారంభించబడింది, ఆ సమయానికి మధాపర్ రద్దీగా మారింది, కాన్బిస్ ​​వంటి ఇతర సంఘాలు కూడా పెరిగాయి, అభివృద్ధి చెందాయి.[6]

భూకంపం[మార్చు]

26 జనవరి 2001న వచ్చిన భూకంపం కారణంగా జునావాస్ (పాత నివాసం) లో ప్రత్యేకమైన వాస్తుశిల్పాలు ఉన్న మిస్ట్రీల శతాబ్దాల నాటి కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి.[8]

పాఠశాలలు[మార్చు]

మొదటి ప్రభుత్వ బాలుర పాఠశాల 1884లో ప్రారంభించబడింది. మిస్ట్రీ వర్గానికి చెందిన భీమ్‌జీ దేవ్‌జీ రాథోడ్ 1900లో మధాపర్ లో మొదటి బాలికల పాఠశాలను నిర్మించి ప్రారంభించాడు. మొదటి ఉన్నత పాఠశాల, మధాపర్ సరస్వతి విద్యాలయ ఉన్నత పాఠశాల, 1968లో స్థాపించబడింది.[7]

దేవాలయాలు[మార్చు]

సనాతన్ ఠాకోర్ మందిర్, మహాదేవ్ మందిర్, బార్లా మందిర్, స్వామినారాయణ టెంపుల్ (1949) మధాపర్ లో ఉన్నాయి. సోలంకి మొమై మాత ఆలయాలు, రాథోడ్లు కూడా ఉన్నాయి. పాత ఠాకోర్ మందిర్ రికార్డుల ప్రకారం, శివ మందిరం, ప్రసిద్ధ బార్లా దేవాలయాన్ని 1880-1890లో మిస్ట్రీ వర్గానికి చెందిన మిస్ట్రీ మందన్ జివానీ చౌహాన్, సింధ్‌లో రైల్వే కాంట్రాక్ట్ పనుల ద్వారా సంపాదించిన డబ్బుతో నిర్మించాడు. యక్ష్ మందిర్ లేదా జఖ్ బౌటెరా (72) ఆలయం పట్టణంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయం, ఇది జఖ్ వర్గానికి చెందిన 72 యక్షలు లేదా జఖ్ బొటేరా జానపద దేవతలను ఇందులో ప్రతిష్టించారు.[9]

సరస్సులు[మార్చు]

మధాపర్ లో రెండు పెద్ద సరస్సులు ఉన్నాయి. ఒకటి జగసాగర్, దీనిని 1900 సంవత్సరంలో మిస్ట్రీ రైల్వే కాంట్రాక్టర్ జగమల్ భీమా రాథోడ్ నిర్మించినందువలన దానికి అతని పేరు పెట్టారు. అతని సోదరుడు, కరాసన్ భీమా రాథోడ్ కూడా సురల్‌భిత్ ఆలయానికి సమీపంలో మెట్లతో ఒక కృత్రిమ సరస్సును నిర్మించాడు, దీనిని నేడు కరాసన్ భీమ్‌జీ చెరువు అని పిలుస్తారు. మరొకటి మేఘరాజ్జీ సరస్సు దీనికి కఛ్ రాష్ట్ర చివరి పాలకుడైన మేఘరాజ్జీ పేరు పెట్టారు.[7]

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

వ్యవసాయం[మార్చు]

ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాంతంలో పండే చాలా వ్యవసాయ ఉత్పత్తులు ముంబై నగరానికి ఎగుమతి అవుతాయి. ఇక్కడ ప్రధానంగా మొక్కజొన్న, మామిడి, చెరకు సాగు చేస్తారు.

విదేశీ పెట్టుబడులు[మార్చు]

మధాపర్ లోని చాలా మంది నివాసితులు యుకె, యుఎస్, కెనడా వంటి విదేశాలలో పనిచేస్తున్నారు. తమ పొదుపును సొంత గ్రామంలోనే ఉంచుకుంటారు. గ్రామాల్లో బ్యాంకు డిపాజిట్లు దాదాపు రూ. 5,000 కోట్లు. ఈ గ్రామం భారతదేశంలో ఒక ప్రత్యేక పేరు సంపాదించింది, ఇది ఎన్ఆర్ఐ డిపాజిట్ల బేరోమీటర్‌గా పరిగణించబడుతుంది.

మూలాలు[మార్చు]

  1. "దునియాలో ధనికమైన గ్రామం: ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు.. ఎక్కడ అంటే". telugu.oneindia.com. 2021-08-09. Retrieved 2023-06-23.
  2. "18 villages founded by Kutch Gurjar Kshatriyas". Archived from the original on 3 March 2011. Retrieved 29 October 2009.
  3. Gurjar Kshatriyas, also known as Mistris, came to Kutch from Rajasthan. They are skilled in building construction. They first established themselves at Dhaneti and were granted 18 villages by the rulers of Kutch. They are famous designers and developers of buildings and bridges
  4. Press Report on Houses, History of Mistiris of Kutch Archived 2012-12-20 at the Wayback Machine
  5. "The name of village Madhapar was given on the name of one Mr. Madha Kanji Solanki (3rd generation of Mr. Hemraj Hardas) who had shifted from Dhaneti village to Madhapar in the year 1473-74". Archived from the original on 3 March 2011. Retrieved 29 October 2009.
  6. 6.0 6.1 Kutch Gurjar Kshatriya Community: A brief History & Glory:by Raja Pawan Jethwa. (Kolkata, 2007). Section II: Mileage wise available Details of Railway lines laid.Pages:63 to 70
  7. 7.0 7.1 7.2 Mistri of Kutch, Madhapur History, Madhapar was founded by Madha Kanji Solanki, Suralbhit Temple Renovation, History of development of Madhapar over centuries, etc. in Patel community document
  8. "Bhuj earthquake of 2001 | India | Britannica". www.britannica.com. 2023-06-15. Retrieved 2023-06-23.
  9. "સને 1881માં રેલ્વેમાં કામોમાં કમાણી કર્યા બાદ માધાપર ગામે માંડણભાઇ જીવાણીએ ઠાકર મંદિર અને શિવમંદિર, બારલા મંદિર બંધાવેલ". Archived from the original on 2018-05-28. Retrieved 2023-06-23.