మాథ్యూ మోట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాథ్యూ మోట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మాథ్యూ పీటర్ మోట్
పుట్టిన తేదీ (1973-10-03) 1973 అక్టోబరు 3 (వయసు 50)
చార్లెవిల్, క్వీన్స్‌లాండ్, ఆస్ట్రేలియా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటరు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1994/95–1997/98క్వీన్స్‌లాండ్
1998/99–2003/04విక్టోరియా
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 66 24
చేసిన పరుగులు 3,723 452
బ్యాటింగు సగటు 33.84 22.60
100లు/50లు 7/20 0/2
అత్యధిక స్కోరు 216 55*
వేసిన బంతులు 856 165
వికెట్లు 7 6
బౌలింగు సగటు 65.00 28.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/35 2/2
క్యాచ్‌లు/స్టంపింగులు 55/– 8/–
మూలం: CricInfo, 2022 జూన్ 17

మాథ్యూ పీటర్ మోట్ (జననం 1973 అక్టోబరు 3) ఆస్ట్రేలియాకుచ్ చెందిన క్రికెట్ కోచ్, మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటరు. అతను ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు మాజీ కోచ్. ప్రస్తుతం ఇంగ్లాండ్ పురుషుల వైట్-బాల్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. 2022 T20 ప్రపంచ కప్ విజేతగా జట్టును నడిపించాడు.

ఆటగాడిగా[మార్చు]

మోట్ విక్టోరియన్ బుష్‌రేంజర్స్, క్వీన్స్‌లాండ్ బుల్స్ ల తరఫున ఆడాడు. అతను 1995లో అడిలైడ్‌లోని ఆస్ట్రేలియన్ క్రికెట్ అకాడమీలో భాగంగా ఉన్నాడు. ఎడమచేతి వాటం బ్యాటరైన మోట్, 1994-95లో క్వీన్స్‌లాండ్ తరపున ఆడుతూ ఫస్ట్-క్లాస్ లో అడుగుపెట్టాడు. 1996–97 షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌లో క్వీన్స్‌లాండ్ కోసం కీలకమైన 86 పరుగులు చేశాడు. అతను 1998-99 సీజన్ కోసం విక్టోరియాకు మకాం మార్చుకుని, ఎగువ వరుస బ్యాటింగులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతని మొదటి సీజన్‌లో న్యూ సౌత్ వేల్స్, వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై సెంచరీలు చేసాడు. తరువాతి వేసవిలో 841 ఫస్ట్-క్లాస్ పరుగులు చేసి, తొమ్మిదేళ్లలో మొదటిసారిగా విక్టోరియా ఫైనల్‌కు చేరుకోవడంలో తోడ్పడ్డాడు. విక్టోరియాతో అతని కెరీర్‌లో ఒక ముఖ్యాంశం జాసన్ ఆర్న్‌బెర్గర్‌తో 223 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం. [1] 2004లో 66 ఆటల తరువాత, 33.84 సగటుతో 3723 పరుగులతో ఏడు సెంచరీలతో తన కెరీర్‌ను ముగించాడు. [2]

కోచింగ్ కెరీర్[మార్చు]

2007–08కి న్యూ సౌత్ వేల్స్ బ్లూస్‌, మోట్‌ను కోచ్‌గా నియమించుకుంది.[3] కోచ్‌గా అతని మొదటి సీజన్‌లో న్యూ సౌత్ వేల్స్, పురా కప్‌ను గెలుచుకుంది.

2011 జనవరి 14 న గ్లామోర్గాన్ కౌంటీ క్రికెట్ క్లబ్ తన 1వ XI జట్టుకు కోచ్‌గా మోట్‌తో మూడు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. 2013 ఆగస్టు 20 న సీజన్ ముగిసిన తర్వాత మోట్, గ్లామోర్గాన్‌ను విడిచిపెట్టాడు. [4] అతను గ్లామోర్గాన్‌ను 2013 యార్క్‌షైర్ బ్యాంక్ 40 ఫైనల్‌కు నడిపించాడు, అక్కడ వారు నాటింగ్‌హామ్‌షైర్ చేతిలో ఓడిపోయారు.

2015 మార్చిలో మోట్, క్యాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్ స్థానంలో ఆస్ట్రేలియా మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా చేరాడు. [5] 2017 ఏప్రిల్‌లో అతను, 2020 వరకు ఆస్ట్రేలియన్ మహిళల జట్టుకు కోచ్‌గా మళ్లీ సంతకం చేసాడు. [6] 2020లో, టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.


2022 మేలో, మోట్‌ను ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వైట్-బాల్ కోచ్‌గా ప్రకటించారు. [7]

మోట్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పురుషుల T20 జట్టుకు కోచ్‌గా పనిచేసి, 2022 నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగిన ఐసిసి ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించాడు.

మూలాలు[మార్చు]

  1. The Age, "Openers rally Vics with 223-run stand" 3 February 2003
  2. Cricinfo "Matthew Mott"
  3. Foxsports "Mott new Blues coach" 19 June 2007
  4. "Glamorgan part with head of elite performance Matthew Mott". BBC Sport. Retrieved 25 October 2013.
  5. Cherny, Daniel (24 March 2015). "Matthew Mott named new coach of Southern Stars". The Sydney Morning Herald. Retrieved 26 November 2018.
  6. "Matthew Mott re-signs as Southern Stars coach Australia". Fox Sports (Australia). News Corp Australia. 11 April 2017. Retrieved 26 November 2018.
  7. "Matthew Mott: England name Australia women's boss as their new men's white-ball coach". BBC Sport. 18 May 2021. Retrieved 18 May 2021.