మాయలోకం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మాయలోకం (1945)
Mayalokam cinema poster.jpg
దర్శకత్వం గూడవల్లి రామబ్రహ్మం
తారాగణం కన్నాంబ,
సి.ఎస్.ఆర్.ఆంజనేయులు,
గోవిందరాజులు సుబ్బారావు,
ఎస్.వరలక్ష్మి,
పద్మనాభం,
అక్కినేని నాగేశ్వరరావు - చిన్న పాత్రలో,
పి.శాంతకుమారి,
ఎమ్.వి.రాజమ్మ,
టి.జి.కమలాదేవి
సంగీతం గాలి పెంచల నరసింహారావు
నేపథ్య గానం పి.శాంతకుమారి,
ఎస్.వరలక్ష్మి
సంభాషణలు త్రిపురనేని గోపీచంద్
కూర్పు మాణిక్యం
నిర్మాణ సంస్థ సారధీ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో కాంభోజరాజు కథ ఆధారంగా నిర్మించిన తెలుగు సినిమా మాయాలోకం. రైతుబిడ్డ, మాలపిల్ల వంటి సాంఘిక చిత్రాల్లో ఒక ఒరవడిని ప్రవేశపెట్టిన గూడవల్లికి, ఈ జానపద చిత్రం కూడా హిట్‌ అవడంతో మంచి గుర్తింపు పెరిగింది.[1]

డాక్టర్ గోవిందరాజుల వెంకట సుబ్బారావు, కన్నాంబ, సి.ఎస్.ఆర్, శాంతకుమారి, అక్కినేని, ఎస్.వరలక్ష్మి, గిడుగు సీతాపతి, లంక సత్యం, టి.జి.కమలాదేవి మొదలైన భారీ తారాగణంతో ఈ చిత్రాన్నినిర్మించారు. సంభాషణలు త్రిపురనేని గోపీచంద్ రాయగా, గాలిపెంచల నరసింహారావు సమకూర్చారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన రెండవ చిత్రం. చిత్రంలోని ఏడుగురు చిన్న రాజకుమారులలో మొదటి వానిగా బాలనటుడు బి.పద్మనాభం నటించారు.[2]

సంక్షిప్త కథ[మార్చు]

శాంభవీ పురానికి రాజు కాంభోజరాజు. ఆ రాజుకు ఏడుగురు భార్యలు. దానవాది రాజకుమార్తెలు ఆరుగురు. నేత్రవాది రాజ కుమార్తె మాణిక్యాల దేవి ఏడవ భార్య. ఆమె శివభక్తురాలు. కైలాసంలోకి శని ప్రవేశించి మహారాజులను పట్టి వాళ్ళ సౌఖ్యాలను అనుభవించే వరం ఇవ్వాలని శివుడిని ప్రార్థిస్తాడు. తన భక్తుడైన, సంతానహీనుడైన కాంభోజ మహారాజును పట్టి పీడించమని చెబుతాడు. తర్వాత శివుడి మీద రాజుకు కోపం వచ్చి శివుడి విగ్రహాలు కోటలో ఉండకూడదని ఆజ్ఞాపిస్తాడు. కర్మశర్మ రూపంలో శని రాజ్యంలోకి ప్రవేశించి మహారాజుని ముప్పుతిప్పలు పెడతాడు. కర్మశర్మ వరప్రసాదంతో రాజుగారి ఆరుగురు భార్యలు అవివేకులు, అప్రయోజకులు అయిన కొడుకుల్ని కంటారు. ఏడవ భార్య మాణికాంబదేవికి పుట్టే సంతానం రాజు అవుతాడని రాజగురువు జోష్యం చెప్పడం వళ్ళ అసూయతో మిగిలిన భార్యలు గర్భవతిగా వున్న ఆమెను చంపే ప్రయత్నంలో అడవికి పంపిస్తారు. అడవిలో కాంభోజరాజు చిన భార్య మగ శిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువే ఎదిగి సాహసోపేతుడైన శరాబందిరాజు (అక్కినేని). రాజు పశ్చాత్తాపంతో విచారగ్రస్తుడై మంచంపడతాడు. ఆయన జబ్బును నయం చేయడానికి మందులు తీసుకొని వచ్చేందుకు ఆరుగురు కుమారులు బయలుదేరతారు. సాహసకృత్యాలే ఊపిరిగా అడవిలో పెరిగిన శరాబందిరాజు తల్లితండ్రులను తిరిగి ప్రయత్నంలో రాజధానికి వచ్చి సవతి సోదరుల వల్ల అనేక అవమానాలను, హేళనలను ఎదుర్కొంటాడు. తనూ మందును వెతకటానికి బయలుదేరి కీలుగుఱ్ఱంలాంటి గుఱ్ఱాన్ని ఎక్కి ఏడు సముద్రాలు దాటి, శరాబందిరాజు, రత్నగంధి (శాంతకుమారి), యోజనగంధి (ఎమ్.వి.రాజమ్మ) ల సహాయంతో తండ్రి జబ్బును నయం చేసే మందును సంపాదిస్తాడు. అంతే కాకుండా తన సోదరులను రంగసాని (యస్.వరలక్ష్మి) చెర నుండి విడిపిస్తాడు.[3] మందు తెచ్చి తండ్రిని ఆరోగ్యవంతున్ని చేస్తాడు. సవతి తల్లులు, వారి పరివారం శరాబంది రాజుని గుర్తించి చంప ప్రయత్నిస్తారు. శరాబందిరాజు వారిని జయిస్తాడు.

విశేషాలు[మార్చు]

చిత్రంలో "మందులున్నాయి బాబూ, చాలా మందులున్నాయి. మంచు కొండల నుంచి తీసిన మందులున్నాయి..." అనే పాట. రామ చాలింక నీదు బీరముల్‌ అనే పద్యం కూడా అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ఆలపించాడు. 'మాయాలోకం'లో హీరో శరాబంది రాజు వేషం నిజానికంత పెద్దదేమీ కాకపోయినా ముగ్గుర్ని పెళ్ళాడటంతో ఆ వేషానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఆ వేషం అక్కినేనే వెయ్యాలని ఘంటసాల బలరామయ్య కోరిక. మాయాలోకం తన రెండవ చిత్రం అయినా, తన నట జీవితంలో స్థిరపడటానికి గట్టి కృషి చేయించిన మొదటి అని అక్కినేని చెప్పుకున్నాడు.[4]

పాటలు[మార్చు]

మాయాలోకం సినిమాలో రంగసాని పాత్ర పోషించిన ఎస్.వరలక్ష్మి
  1. చెలియా మనకేలనే వారి జోలి
  2. మోహనాంగ రార నవ మోహనాంగ రారా
  3. అకటా నా జీవనదీ యిది యేమి అడవుల గుట్టలబడి పారున్
  4. అక్షయలింగవిభో స్వయంభో రక్షించుము నీ వారము శంభో
  5. అరెరే దట్టీగట్టీ మందుకోసమై రాకుమారులంతా
  6. అతి విచిత్రమౌ నీ మహిమను తెలియగ మనుజుల తరమా
  7. బలే బలే నవభోజారాజా ప్రభువులౌతారా
  8. ఏ విధి సేయదువో ఈశా నా కే విధి సేయదువో
  9. ఎవరోయీ నీవెవరోయీ ఈ మాట తెలిపి పోవోయి
  10. కోటలోన కాంభోజరాజు క్రుంగి కుమిలిపోయీ
  11. మనదే ప్రపంచమంతా ఆ హా మానినియేగా జగన్నియంతా
  12. రామ చాలింక నీదు బీరములు చాలు ధర్మమూర్తి వటంచు
  13. శరత్కౌముదీ ముదిత యామినీ హృదయములో నవోదయములో
  14. శ్రీజానకీదేవి సీమంతమునకు శ్రీ శారదా గిరీజా చేరి దీవించిరి
  15. తారీనాననీ ననీ తరీనననీనా అహ తారీనాననీ తరీననీనా

మూలాలు[మార్చు]

  1. 1945లో కాసులు కురిపించిన స్వర్గసీమ,మాయాలోకం - ఆంధ్రప్రభ మార్చి 24, 2011
  2. శ్రీ గూడవల్లి రామబ్రహ్మం, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, శ్రీ గాయత్రి ప్రింటర్స్, తెనాలి, 2004.
  3. MAYALOKAM (1945) - The Hindu April 1, 2012
  4. “మాయలోకం"కి 65 - ఆంధ్రప్రభ అక్టోబర్ 7, 2010
"http://te.wikipedia.org/w/index.php?title=మాయలోకం&oldid=1029205" నుండి వెలికితీశారు