మిన్నియాపోలిస్-సెయింట్ పాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిన్నియాపోలిస్ డౌన్‌టౌన్

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక భాగమైన మిన్నసోటా రాష్ట్రానికి రాజధాని. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరాలను జంట నగరాలుగా వ్యవహరిస్తారు. 2006 జనాభా లెక్కలను అనుసరించి ఈ జంట నగరాల జనాభా 35,00,000 అంచనా. ఈ నగరాలు మిసిసిపీ, మిన్నసోటా, సెయింట్ క్రాయ్ (St.Croix) నదీతీరాలలో విస్తరించి ఉన్నాయి. ఈ నగరాల జనసాంద్రత అమెరికాలో 13వ స్థానంలో ఉంది.

1872 నుండి ఈ నగరాలను జంటనగరాలుగా గుర్తించి, ప్రజలు వీటిని జంటనగరాలుగా పిలవడం మొదలు పెట్టారు. జంటనగరాలుగా గుర్తించబడిన ఈ నగరాలు స్వరూపస్వభావాలు, రూపురేఖలలో మాత్రం పరస్పర విరుద్ధతలు కలిగి ఉంటాయి. నూతన నగరనిర్మాణము, జలరవాణా దారులకు మినియాపోలిస్ ప్రసిద్ధి. ఈ నగర డౌన్‌టౌన్ నూతన రూపకల్పనా పద్ధతులతో నిర్మించబడి ఉంది. సెయింట్ పౌల్ నగరం వంపులు తిరిగిన ఇరుకైన వీధులతో ఉంటుంది. సెయింట్ పాల్‌లో స్థిరపడిన సంప్రదాయాలను అనుసరించే సమూహాలు ఎక్కువగా నివసిస్తున్న కారణంగా పురాతన నిర్మాణాలు ఇక్కడ దర్శనమిస్తాయి. సెయింట్ పాల్ నగరంలో విస్తారంగా ఆకర్షణీయమైన విక్టోరియన్ ఆర్కిటెక్చర్ నిర్మాణాలు ఉంటాయి. అలాగే సంప్రదాయకంగా రెండు వేరుపడి ఉంటాయి. మిన్నియాపోలిస్ స్కాండినేవియన్ ఆధిక్యతగల ప్రాంతం. సెయింట్ పాల్ రోమన్ కాధలిక్, ఐరిష్ సంతతి నివాసం. జంట నగరాల డౌన్ టౌన్ 10 మైళ్ళ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇక్కడ మిన్నసోటా హిందూ దేవాలయం ఉంది.

మిసిసీపీ నదీతీరంలో సెయింట్ పాల్ నగరం

నగర చరిత్ర

[మార్చు]
స్టిల్ వాటర్ దాని పరిసర ప్రాంతం

సెయింట్ క్రాయ్ నది పడమటి తీరంలో ప్రస్తుతపు సెయింట్ పాల్ డౌన్‌టౌన్కు 20 మైళ్ళ దూరంలో మొదటి యురేపియన్ స్టిల్ వాటర్ మిన్నసోటా ఒప్పందంతో ప్రస్తుత స్టిల్ వాటర్ నగరం రూపుదిద్దుకోవడానికి పునాది పడింది. ఈ నగరం మధ్య మిన్నసోటా, విచ్‌కాన్‌సినన్‌ల సరిహద్దు. రెండవ ఒప్పందంతో మిసిసీపీ, మిన్నసోటా నదుల సంగమ ప్రాంతంలో ఫోర్ట్ స్నెల్లింగ్ రేవు నిర్మాణానికి పునాది. ఈ రేవు నిర్మాణం 1820 నుండి 1825 వరకూ కొనసాగింది. సెయింట్ ఆంథోనీ ప్రాంతం వరకూ ఫోర్ట్ స్నెల్లింగ్ ఆధీనంలో ఉంటూ వచ్చింది. ఈ కారణంగా సెయింట్ ఆంధోనీ పేరుతో నది ఉత్తర భాగంలో ఊరు విస్తరిస్తూ వచ్చింది. చాలా సంవత్సరాల వరకు కల్నల్ జాన్ హెచ్ స్ట్వెన్ అనే ఒకే ఒక ఐరోపా దేశస్తుడు మాత్రం నది ఉత్తర ప్రాంతంలో ఫెర్రీ నడుపుతూ నివసిస్తూండేవాడు. క్రమంగా ఈ ప్రాంతంపై ఫోర్ట్ స్నెల్లింగ్ ఆధిపత్యం తగ్గి కొత్తగా వచ్చి చేరిన ప్రజలు స్థిరపడసాగారు. ఊరు వేగంగా అభివృద్ధి చెందడంతో మిన్నియాపోలిస్, సెయింట్ పాల్ ఒకదానితో ఒకటి కలసిపోయాయి.

సహజ సిద్ధమైన భౌగోళిక పరిస్థితులు, ఒప్పందాలు ఈ జంట నగర అభివృద్ధిలో పాలు పంచుకున్నాయి. మిసిసీపీ నదీతీరంలో ఇరువైపులా సజసిద్ధంగా ఉన్న రాళ్ళు బండలు ఈ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా చేశాయి. లాంబర్ట్‌స్ లాండింగ్ చుట్టూ సెయింట్ పాల్ విస్తరించింది. సెయింట్ ఆంధోనీ ఫాల్స్‌కి 7 మైళ్ళ దూరంలో ఉన్న లాంబర్ట్‌స్ లాండింగ్ బోట్‌లలో సరుకు దించడానికి, ఎక్కించడానికి అనువైన ప్రాంతంగా మారింది. అనుకూలమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా మిన్నియాపోలిస్ ప్రాంతం మిల్లుల నగరంగా పేరు పొందింది.

1854 లో రాక్ ఐలాండ్ రైలు రోడ్డు ప్రోత్సాహంతో గ్రాండ్ ఎస్కర్షన్, మిడ్‌వెస్ట్ పేర్లతో నిర్వహించిన విహారయాత్రలు వేలకొలది పర్యాటకులను రైలు, స్టీమ్ బోట్లలో ఈ నగరానికి వచ్చేలా చేశాయి. తూర్పుతీరపు ‌వార్తా పత్రికలలో ప్రచురించిన మిడ్‌వెస్ట్, ఎస్కర్షన్ గురించిన విశేషాలకు హెన్రీ వర్డ్స్‌వర్త్ కావ్యంలో ఈ ప్రాంతము, ప్రజలు వారి నాగరికత గురించిన వర్ణన తోడుకావడంతో తర్వాతి దశాబ్ధాలలో పర్యాటకుల అభిమానం చూరగొనటమే లక్ష్యంగా ఈ ప్రదేశం మారింది.

ఒకప్పుడు స్ట్రీట్ కార్ వ్యవస్థ, ఇంటర్ స్టేట్ రైలు అనేక సర్వీసులు నిర్వహిస్తూ ప్రయాణీకులకు సేవలందించాయి. నగరం లోపల ఇంటర్ స్టేట్ రైల్ సేవలందించగా నగరంలోపలా వెలుపలా స్ట్రీట్ కార్ వ్యవస్థ నగరం లోపలా వెలుపలా తమ సేవలనందించాయి. ధాన్యాలను మిన్నియాపోలిస్ మిల్లులలో చేరవేయడానికి ఇతర వస్తువులను సెయింట్ పాల్‌కు చేరవేయడానికి లాంటి వాణిజ్య అవసరాల నిమిత్తం అనేక వాణిజ్య రైలు సర్వీసులు ఉంటూ వచ్చాయి. మిసిసీపీ నదిపై రైలు వంతెనలు కలిగిన ప్రదేశాలలో మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ కూడా ఒకటి. సెయింట్ పౌల్ జలరవాణాకు కేంద్రమైంది. నది పైతట్టు ప్రదేశం అయిన మినియాపోలిస్లో నిర్మించిన లాకు, డ్యాము దీనికి మరికొంత సహకరించాయి.

మిన్నసోటాకు కొంచెం పైతట్టు ప్రాంతాలలో మిసిసీపీ నదిపై నిర్మించిన డామ్, లాక్

1888 లో ప్రయాణీకుల రద్దీ అత్యున్నత స్థాయికి చేరింది. సెయింట్ పాల్ యూనియన్ డిపో వరకు సుమారు 80,000 మంది ప్రయాణీకులు పయనించి ఉంటారని అంచనా. ఒక రోజుకు 150 రైలు సర్వీసుల వరకు నడిచాయి. దక్షిణ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన రైలు జంక్షన్ల కారణంగా తరువాతి రోజులలో ఈ రద్దీ తగ్గు ముఖం పట్టింది. ఆటోమొబైల్ అభివృద్ధి తరువాత రైలు ప్రయాణాలు మరింత తగ్గు ముఖం పట్టడంతో రైలు కంపెనీలు విశేష ప్రయత్నంతో చికాగో, మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ మధ్య స్ట్రీమ్‌లైన్స్ నడుస్తూ ఉన్నాయి. ఎట్టకేలకు వీటిని పసిఫిక్ నైరుతీతీరం వరకు పొడిగించారు. ప్రస్తుతం ఈ నగరంలో ఆమ్‌ట్రాక్ వారి ఎంపైర్ బిల్డర్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. రైలురోడ్డు నిర్మాణంలో ప్రముఖుడైన జేమ్స్‌ జె. హిల్ గౌరవార్ధం ఎం‌పైర్‌ బిల్డర్‌ పేరు జేమ్స్‌ జె. హిల్ గా మార్చారు. ఆయన సెయింట్ పాల్‌ నగరంలోని సమ్మిట్ అవెన్యూలో స్థిరపడ్డాడు.

సంస్కృతి

[మార్చు]
గడ్డకట్టిన మెడిసిన్‌ సరస్సుపై ప్రదర్శనలిస్తున్న కళాకారులు

మధ్య ప్రాచ్య ప్రాంతానికి ఈ జంటనగరాలు కళా కేంద్రంగా పేరు పొందాయి. ప్రదర్శనలను ఆదరించడంలో ఇక్కడి ప్రజలు ప్రథమ స్థానంలో ఉన్నట్లు గణాంకాల ఆధారిత అంచనా. సంగీత కచేరీలు, హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల ఆదరాన్ని చూరగొన్న వాటిలో కొన్ని. శీతాకాలం చలి, ప్రజలను థియేటర్లకు తీసుకు వస్తుందని కొందరి భావన, కానీ వాస్తవానికి ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉండటం, ప్రజల బలమైన ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణం.

నగర పరిసరాలు

[మార్చు]

ఈ నగరం సరస్సులకు ప్రసిద్ధి. ది గ్రేట్ రివర్ బైసైకిల్ ఫెస్టివల్, దిట్విన్ సిటీస్ మారథాన్, యు.ఎస్ పాండ్ హాకీ ఛాంపియన్ షిప్ పోటీలు నగర ప్రజలకు వినోదం అందించే విషయాలలో కొన్ని. కొంతమంది వీటిని అసౌకర్యంగా భావించినా, ఎక్కువమంది ఆనందిస్తారని పరిశీలనలో తేలింది. నగరంలో ప్రధాన ఔషధ తయారీ కర్మాగారాలకు ఈశాన్య భాగంలో ఉన్న రాచెస్టర్ కేంద్రం.

చాస్కాలో ఉన్న చర్చి

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ క్రైస్తవ మతానికి ప్రముఖ కేంద్రము. రోమన్‌ కాథలిక్ ఆర్చిడయోస్ ఆఫ్ మిన్నియాపోలిస్-సెయింట్ పాల్, ది ఎపిస్కోపల్ డయోస్ ఆఫ్ మిన్నసోటా , ప్రెస్బిటేరియన్ సైనోడ్ ఆఫ్ లేక్ వరసగా మిన్నియాపోలిస్-సెయింట్ పాల్, మిన్నియాపోలిస్, బ్లూమింగ్‌టన్‌లలో స్థాపించబడ్డాయి. అమెరికన్ లూథరన్ చర్చి (TALC), ఇవాంజెలికల్ లూథరన్ చర్చి, లూథరన్ ఫ్రీ చర్చ్, అగస్టానా ఫోర్ట్రెస్ ల ప్రచురణాలయాలు ఇప్పుటికీ ఉన్నాయి. ది మినియాపోలిస్ ఏరియా సైనోడ్, సెయింట్ పాల్ల్ ఏరియా సైనోడ్‌లు అతి పెద్దవి, మొదటివి అయిన సైనోడులు.

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరంలో యూదులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ భారతీయులు కూడా చెప్పుకోతగినంత మంది ఉన్నట్లు అంచనా. 2006లో జంట నగరాల సరిహద్దు ప్రాంతమైన మేపుల్ గ్రోవ్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని తెరిచారు. లావోస్, దక్షిణ ఆఫ్రికాలనుండి వలస వచ్చి, ఇక్కడ స్థిరపడిన జనాభాతో ఇతర మతాలు ఇక్కడ కొంత చోటు చేసుకున్నాయి. ఇక్కడ మసీదులుకూడా చాలానే ఉన్నాయి. చాన్‌హాసన్ సరిహద్దులలో ఎక్కన్‌కార్‌ల మతస్థుల కొరకు టెంపులాఫ్ ఎక్ దేవాలయం ఉంది. వీరే కాక హ్మోంగ్, టిబెటన్ బుద్ధ మతస్థులూ సెయింట్ పౌల్‌లో నివసిస్తున్నారు. 1995లో రోస్‌విల్‌లో హ్మోంగ్ దేవాలయం ఒకటి నిర్మించారు. 2000 లో సెయింట్ పాల్ తూర్పు సరిహద్దు ప్రాంతములో ఉన్న ఓక్‌డేల్‌లో మొట్టమొదటి మోర్మోన్ దేవాలయ నిర్మాణం జరిగింది. ది స్ట్ యూనిటేరియన్ సొసైటీ ఆఫ్ మిన్నియాపోలిస్ లాంటి యూనిటేరియన్ సమాజానికి చెందినవారు చాలా మంది ఇక్కడ నివసిస్తున్నారు. పాగాన్, బుద్ధ మతస్థులు ఇక్కడ నివాసమేపరచుకున్నారు.

భౌగోళికం

[మార్చు]

జంటనగరాలైన మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ ప్రాంతము వేల సంవత్సరాల నుండి నీటితోను మంచుతోనూ ఆవృత్తమై ఉంది. ఇక్కడ భూమిపొరలు మందమైన ఇసుకరాళ్ళతోను, సున్నపురాయితోను నిండి ఉంది. భూమికోత కారణంగా అనేక గుహలు రూపుదిద్దుకున్నాయి. అమెరికాలో మద్యపాన నిషేధం అమలులో ఉన్న సమయంలో దీనిని మరుగైన ప్రదేశంగా వాడుకున్నారు. కొంతమంది రాళ్ళను తొలిచి గుహలను వసతిగా తయారు చేసుకున్నారు. ప్రస్తుతం సెయింట్ పాల్ నగరంలో వీటిలో కొన్నిటిని బాగుపరచి వాబషా స్ట్రీట్ పేరుతో విహార ప్రదేశంగా మార్చారు. వీటిలో కొన్నిమాత్రం శుభ్రపరచబడిన సురక్షిత ప్రదేశాలైనా మిగిలినవి ప్రమాదకరమైనవే. వీటిని గురించి తెలుసుకోవాలని కుతూహలం కొద్దీ వీటిలో ప్రవేశించిన అనేకమంది అస్వస్థులయ్యారు. ఈ ప్రయత్నంలో మరణించినవారి సంఖ్యా ఎక్కువే. ఈ గుహల్లో అప్పుడప్పుడు పొగతో కూడిన మంటలు రేగుతూ ఉంటాయి. ఈ మంటలతో ఆక్సిజన్ తగ్గి పనికిరాని ఆకులు మిగిలి విషపూరిత వాయువులు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. మరణాలకు, అస్వస్థతకు ఇదే కారణంగా భావిస్తున్నారు.

ఇసుకరాళ్ళు, లైమ్‌స్టోన్స్ లోపలి పొరలలో ఉన్న కారణంగా మిగిలిన ప్రదేశాలకంటే ఇక్కడ భూఅంతర్భాగంలో ప్రయాణ మార్గం వేయడం సులువని భావిస్తున్నారు. మిగిలిన ప్రదేశాలకన్నా ఇది ఖర్చు తక్కువైనదని భావిస్తున్నారు. కానీ ఇక్కడి ప్రాజెక్టుల దృష్ట్యా ఇది ఖర్చుతో కూడిన పనిగా భావిస్తున్నారు.

మిన్నటోంకా సరసు

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ పరిసర ప్రాంతాలు సహజ సిద్ధమైన సరసులు ఏర్పడుతూ ఉంటాయి. గడ్డకట్టిన ప్రవాహాల కారణంగా కొన్ని సరసులు విచిత్రమైన ఆకారంతో ఏర్పడుతూ ఉంటాయి.జంట నగరాలకు పశ్చిమంలో ఉన్న మిన్నటోంకా సరసు దీనికి ఒక ఉదాహరణ. నగర పాలిత ప్రాంతం సముద్ర మట్టానికి 1,376 అడుగులు ఉన్నట్లు అంచనా. మిసిసీపీ చివరిభాగం ఎత్తు 666 అడుగులు ఉన్నట్లు అంచనా.

వాతావరణం

[మార్చు]

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరం అత్యధిక శీతల వాతావరణం కలిగిన నగరపాలిత ప్రాంతం. అమెరికాలోనే ఇది అత్యంత శీతల వాతావరణం కలిగిన ప్రాంతం. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ లో హిమపాతం చాలా అధికం.

భవననిర్మాణం

[మార్చు]
మిన్నియాపోలీసులో ఉన్న ఎత్తైన భవనాలు

1929లో మిసిసిపీ పశ్చిమ తీరంలోనే మొట్టమొదటదైన ఆకాశహర్మ్యం (స్కైస్క్రాపర్) ఫోషే టవర్ నిర్మాణం జరిగింది. జంటనగరాల అత్యంత ఎత్తైన నాలుగు ఆకాశహర్మ్యాలు మిన్నియాపోలీసులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో కచ్చితంగా ఎత్తైనది ఏదో నిర్ణయించడంలో కొంత వివాదాలు ఉన్నాయి. మిన్నసోటా వాసులను విచారిస్తే చాలామంది ఐ డి ఎస్ సెంటర్ ఎత్తైనది అంటారు చాలా ఆధారాల కారణంగా 225 సౌత్ సిక్స్ స్వల్పంగా, ఐ డి ఎస్ సెంటర్ కంటే ఎత్తైనదని భావిస్తున్నా 2005 ప్రారంభంలో ఐ డి ఎస్ సెంటర్ అగ్రభాగంలో ఉన్న 16 అడుగుల వాష్ గ్యారేజ్ తో చేర్చి అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపబడింది.ఐ డి ఎస్ సెంటర్ ఎత్తు 792 అడుగులు.225 సౌత్ సిక్స్ స్వల్పంగా, వెల్స్ ఫార్గో సెంటర్ ల మధ్య భేదం ఎత్తులో ఒకటి లేక రెండు అడుగులు మాత్రమే. ఐ డి ఎస్ పైన ఉన్న సమాచార గోపురం (కమ్యూనికేషన్ టవర్) మిన్నియాపోలిస్ లోనే ఎత్తైనది అయినా నగరపురాలలో దీనికంటే ఎత్తైన టవర్స్ ఉన్నాయి.

భవనాలు నిర్మించడమూ, పడగొట్టడమూ తరచుగా జరుగుతూ ఉంటుంది, 19వ దశాబ్ధంలో కొన్ని భవనాలు 6 నుండి 7 సార్లు పడగొట్టి తిరిగి నిర్మించారు. కొన్ని భవనాలు తక్కువ సమయంలోనే ఎనిమిది నుండి సార్లు పడగొట్టి నిర్మించారు. నగరంలో ఒకేశైలిలో నిర్మించిన భవన సముదాయాలు లేనేలేవు. నగరంలోని భవనాలన్నీ వివిధ రకములైన నిర్మాణశైలిలో నిర్మించబడి ఉంటాయి. ఒకప్పుడు నగరంలో ప్రస్తుతమున్న రిచర్సనియన్ రోమనెస్‌క్యూ శైలిలో నిర్మించిన అనేక గొప్ప రాతి భవనాలు, కనీసం రోమనెస్‌క్యూ శైలి ప్రేరణతో నిర్మించిన భవనాలు ఉండేవి. మిన్నియాపోలిస్ సిటీ హాల్ దీనికి ఒక ఉదాహరణ. వ్యక్తిగత నిర్మాణాలైన జేమ్స్ జె. హిల్ హౌస్ లాంటి భవనాలు కూడా వేటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. తరువాతి దశాబ్ధాలలో ఇప్పటికీ భద్రంగా ఉన్న అలాంటి భవనాలను ఆర్ట్ డిగో నిర్మించారు సెయింట్ పాల్ సిటీ హాల్, ఫోష్ టవర్, మినియా పోలిస్ పోస్ట్ ఆఫీస్ లాంటివి వీటిలో చేరినవే.

ఫోర్ట్ స్నెల్లింగ్ మెండోటాల మధ్య మిన్నసోటా నదిపై నిర్మించిన మెండోటా వంతెన

రెండవ ప్రపంచ యుద్దం సమయంలో మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరపురాలలో చేపట్టిన బృహత్తర అభివృద్ధి ప్రణాళికల కారణంగా అనేక భవనాలు ఇప్పుడు వాటి చరిత్రను కోల్పోయాయి. కొన్ని అతిపెద్ద, పఠిష్ఠంగా ఉండి పడగొట్టడం కష్టమైన నిర్మాణాలు మాత్రం మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రదేశంలో భవనాలకంటే వంతెనలకే గుర్తింపు ఎక్కువ. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ వాసుల సౌకర్యం కొరకు 1920 నుండి 1930ల మధ్య అనేక వంతెనలు మిసిసీపీ నదిపై నిర్మించారు. కానీ ప్రస్తుతం అవి పాతబడి కొంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని ఇప్పటికే వాటిరూపురేఖలను కాపాడుతూ సరిదిద్ది బలపరిచే పనులను చేపట్టారు. 10వ అవెన్యూ వంతెన, ఇంటర్ సిటీ బ్రిడ్జ్ (ఫోర్డ్ పార్క్ వే), రాబర్ట్ స్ట్రీట్ వంతెన, పొడవులో మొదటి స్థానంలో ఉన్న మెండోటా వంతెన (దీని పొడవు 4119 అడుగులు) మొదలైన వంతెనలు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ హిస్టారిక్ మాన్యుమెంట్స్ యొక్క జాబితాలో చోటుచేసుకున్నాయి. తరువాతి కాలం నుండి ఈ తరహా నిర్మాణాలు పాతబడి హెన్నెపిన్ అవెన్యూ వంతెనలు నిర్మించడం ప్రారంభించారు. రెండు నగరాల డౌన్ టౌన్‌లలోనూ అధికసంఖ్యలో పాదాచారుల కోసం ఇరు వైపులా గోడలూ, పైకప్పూ కలిగిన స్కైవేస్ నిర్మించబడ్డాయి. స్కైవే నిర్మాణాలు కెనడా తరువాతి స్థానంలో మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ ఉన్నాయి. క్రమంగా స్కైవేస్ వాటి ఆకర్షణను కోల్పోయాయి ప్రజలు వాటిని వాడటం తగ్గించడమూ, పైకప్పు ఉన్న కారణంగా వారాంతాలలో వీటిని మరుగైన ప్రదేశంగా (ప్రత్యేకంగా మిన్నియాపోలిసస్‌లో) వాడటం దీనికి కారణం.

ప్రముఖమైన కొన్ని భవనాలు మిన్నియాపోలీస్‌ను అధునాతనంగా మార్చడంలో సహకరించాయి. ప్రత్యేకంగా 2005 లో తెరవబడిన వాకర్ ఆర్ట్ సెంటర్, గత్రీ థియేటర్. వాకర్ ఆర్ట్ సెంటర్ సెయింట్ పాల్ కన్నా రెండింతలు పెద్దది, వాకర్ ఆర్ట్ సెంటర్ వివిధ కళా సంస్థలకు ఆలవాలం, నూతన పద్ధతులలో ప్రేక్షకులకు వినోదాన్ని అదించడంలో ప్రపంచంలో మొదటి ష్తానంలో ఉంది.2006లో జీన్ నౌవెల్ రూపకల్పనలో నిర్మించబడిన గత్రీ థియేటర్ ఆరంభంలోనే విపరీతంగా మీడియాను ఆకర్షించింది. దీని వైశాల్యం 285,0000 చదరపు అడుగులు. ఈ భవనంలో 1,100 సీట్ల సామర్ధ్యంగల సిగ్నేచర్ ఆఫ్ త్రస్ట్,700 సీట్ల సామర్ధ్యంగల ప్రొసీనియం, సీట్లను అవసరానికి తగినట్లు అమర్చుకోగలిగిన బ్లాక్-బాక్స్ అనే మూడు థియేటర్లు ఉన్నాయి. 1963లో మిన్నియా పోలిస్ డౌన్ టౌన్‌లో ఉన్న 2002లో పాత గత్రీ దియేటర్‌ని నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ అతి ప్రమాదకరమైన చారిత్రక భవనంగా ప్రకటించడంతో 2006లో దానిని పడగొట్టారు.

నగర వర్ణన

[మార్చు]

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ కి చెందిన 11 కౌంటీలు మిన్నసోటా లోను, రెండు కౌంటీలు సరిహద్దులలో ఉన్న విస్కాన్సిన్‌లోనూ ఉన్నాయని అమెరికా గణాంకాల చెప్తున్నాయి. జనసంఖ్య సుమారు 30,00,000 ఉన్నట్లు అంచనా. శీఘ్రగతిని పెరుగుతున్న కారణంగా జనాభా రాబోయే 20 సంవత్సరాలలో 40,00,000 చేరుతుందని అంచనా. మిన్నసోటా రాష్ట్రానికి చెందిన అధిక సంఖ్యాకులు ఈ జంట నగరాలలో నివసిస్తున్నట్లు అంచనా. మిన్నసోటా రాష్ట్రానికి చెందిన నగర వాసులు నాలుగవ భాగం ఈ నగరాలలో నివసిస్తున్నట్లు అంచనా.

అనేక సంఖ్యలో ఉన్న రింగ్‌రోడ్లు ఇక్కడికి వచ్చే అతిధులను, కొత్త నివాసులను కొంత అయోమయంలో పడవేసే మాట నిజం. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరంలో 334 మునిసిపాలిటీలు ఉన్నాయి.

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ ప్రారంభం నుండి ఒకదానితో పోటీ పడుతూనే వచ్చాయి. భవన నిర్మాణంలో వీరు పోటీలు ఒకదానికి మరొక నమూనాలు ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. ఒక దానికంటే ఒకటి పెద్దదిగానూ ఆడంబరంగానూ నిర్మించి తమ ఆధిక్యతను చాటాయి. రెండు నగరాలలో మిన్నసోటా విశ్వవిద్యాలయ కాంపస్‍లు ఉన్నాయి వీటిలో మిన్నియాపోలిస్ కాంపస్ కొంచం పెద్దది. 1915లో సెయింట్ పాల్ నిర్మించిన తరువాత వెంటనే 1926 సెయింట్ మేరీ బసిలికా నిర్మాణం జరిగింది. ఈ పోటి మరింత అధికమై 19, 20 దశాభ్దాల మధ్య ఒక నగరంలో పనిచేసే భవన నిర్మాణ నిపుణులు ఇంకొక నగరంలో పని చేయడానికి నిరాకరించే వారు. ఈ పోటీ కొన్ని సమయాలలో అల్లర్లకు దారి తీస్తూ వచ్చాయి. రెండు అమెరికన్ సంస్థలైన మినియాపోలిస్ మిల్లర్లు, సెయింట్ పాల్ సెయింట్స్ మధ్య పొడచూపిన గోడవ దీనికి ఒక తార్కాణం.

మిన్నసోటా ట్విన్స్ విజయం సాధించిన హ్యుబర్ట్ హంఫ్రీ మెట్రో డోమ్

1950 లో మేజర్ లీగ్ బేస్‌బాల్ వ్యవహారంలో రెండు నగరాలలో రెండు స్టేడియాలు నిర్మించారు. 1996 లో డేలైట్ సేవంగ్ విషయంలో అంగీకారం కుదరని కారణంగా కొన్ని వారాలు సెయింట్ పాల్ వాసులు మిన్నియాపోలిస్ వాసులకంటే ఒక గంట ముందున్నారు.

ఈ పరిస్థితులలో 1961 నుండి కొంచం మార్పు రావడం ఆరంభం అయింది. అమెరికన్ లీగ్ లోని మిన్నసోటా కింగ్స్, నేషనల్ ఫుట్ బాల్ లీగ్ కు చెందిన మిన్నసోటా వైకింగ్స్ ద్వారా మొత్తం రాష్ట్రానికి ఒకే గుర్తింపు రావడంతో అవాంఛనీయ పోటీలు తగ్గు ముఖం పట్టాయి. ఆ తరువాతి కాలంలో ఈ నగరాలను జంట నగరాలుగా వ్యవహరంచడం మొదలుపెట్టారు.1961 తరువాతి కాలంలో జరిగిన క్రీడల పోటీలలో వీరు ఒకటిగా పాల్గొనడం ఆరంభించారు. వైకింగ్స్ ను అనుసరిస్తూ 1967-1973 మధ్య మిన్నసోటా నార్త్ స్టార్స్,1967-1968 మిన్నసోటా మస్కీస్,1968-1969 మిన్నసోటా పైపర్స్,1972-1977 మిన్నసోటా కిక్స్,1984-1988 మిన్నసోటా స్టైకర్స్,1989 నుండి ఇప్పటివరకు ఉన్న మిన్నసోటా టింబర్ వుల్వ్స్, (1990-ప్రస్తుతం) మిన్నసోటా తండర్స్1994-1996 మిన్నసోటా మూస్,199_ప్రస్తుతం) మిన్నసోటా లింక్స్, (2000-ప్రస్తుతం) మిన్నసోటా వైల్డ్, (2005-ప్రస్తుతం) మిన్నసోటా స్వామ్స్ బృందాలు రాష్ట్రం అంతటి చెందినవిగా ఎర్పడి క్రీడా పోటీలలో పాల్గొనడం ప్రారంభించారు.ఈ కారణంగా రెండు నగరాల మధ్య పోటి మనస్తత్వం కూడా తగ్గు ముఖం పట్టింది.

ప్రసార సాధనాలు

[మార్చు]

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ నగరాలలో స్టార్ ట్రిబ్యూన్, సెయింట్ పాల్ పయనీర్ ప్రెస్ అనేవి రెండూ ప్రధాన వార్తా పత్రికలు. ఇవి కాకుండా యూనివర్శిటీ ఆఫ్ మిన్నసోటా విద్యార్థులచే నడపబడే మిన్నసోటా డైలీ జంటనగరాల సమీప ప్రజలకు ఉచిత సేవలందిస్తుంది. సెయింట్ పాల్‌ 90,000 నివాసాలకు వాసులకు ఉచిత సేవలందించే ఈస్ట్ సైడ్ రివ్యూ, కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితమైన సిటీ పేజస్ జంట నగరవాసులకు వార్తలనందిస్తున్నాయి.

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ లో మొట్టమొదటిగా 1948లో (KSTP-TV) దూరదర్శన్ తమ ప్రసారాలను ప్రారంభించింది. మొదటిసారిగా ప్రసారం చేసిన ప్రదర్శన 3,000 టెలివిజన్‌లలో ప్రసారమైంది.ట్విన్‌ సిటీస్ పబ్లిక్ టెలివిజన్నిర్వహణలో కె టి సి ఎ (KTCA), కె టి సి ఐ (KTCI) చానల్స్. స్టాన్లీ ఇ హబ్బర్డ్ నిర్మించిన హబ్బర్డ్ బ్రాడ్ కాస్టింగ్ నిర్వహిస్తున్న కె టీ ఎస్ పి (KSTP), కె ఎస్ ‌టి సి, (KSTC) లు, కె ఎస్ ఎమ్ పి (KMSP) డబ్ల్యు ఎస్ టి సి (WSTC) లు రెండూ కలిసి పోయాయి. కె టి సి ఎ (KTCA) /కె టి సి ఐ (KTCI), కె ఎస్ టి పి (KSTP) /కె ఎస్ టి సి (KSTC) లు సెయింట్ పాల్ ల నుండి పనిచేస్తుంటాయి. డబ్ల్యూ సి సి ఒ (WCCO) ఒక్కటి మాత్రం తన ప్రధాన స్టూడియోలను మిన్నియా పోలిస్లో నిర్మించింది. కె ఎమ్ డబ్ల్యూ బి (KMWB) మిగిలిన ప్రసార కేంద్రాలు నగరపురాలలో ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]
వాకర్ ఆర్ట్ సెంటర్

20వ శతాబ్దంలో ఈ జంటనగరాలలో గుర్తింపదగిన అభివృద్ధి జరిగింది. ఆటొమొబైల్ రంగం సహకారం ఈ అభివృద్ధికి కొంత దోహద మైంది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో కారు, బస్సు, అనేక ఇతర వాహనాలకు అనువుగా నిర్మంచిన అనేక ఫ్రీ వేస్ (రహదార్లు) ప్రయాణీకులకు సహకరిస్తున్నాయి. రహదార్లలో ఒక భాగంగా అనేక ట్రాఫిక్ కెమేరాలు, రాంప్ మీటర్లు ఈ ప్రదేశంలో వాహన ప్రయాణ రద్దీని క్రమబద్దీకరించడానికి పనిచేస్తున్నాయి . హై-ఆక్యుపెన్సీ వెహికల్ (కార్ పూల్) దార్లు ఉన్నందువలన మిగిలిన ప్రదేశాలలో వాటి రద్దీ లేని కారణంగా ప్రయాణీకులకు మరికొంత వసతిగా ఉంటుంది. రద్దీ మరింత పెరిగినప్పుడు మాత్రం బస్సులను రోడ్ షోల్డర్ మూలంగా బైపాసస్‌కు దారి మళ్ళించి ప్రయాణ రద్దీని తగ్గిస్తారు.

మెట్రో ట్రాన్సిట్ బస్

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ లలో ప్రధాన బస్ సర్వీసుమెట్రో ట్రాన్సిట్ . 95% సర్వీసులను మెట్రో ట్రాన్సిస్ట్ అందిస్తుంది. నగరపురాలలో మరికొన్ని సంస్థలు తమ సేవలనందిస్తున్నాయి. జంటనగరాల విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటా-ట్విన్ సిటీస్నిర్వహణలో ఉచిత బస్ సేవలనందిస్తుంది. మిన్నియా పోలిస్ సెయింట్ పాల్ నగరాలమధ్య నడిచే బస్ రాపిడ్ సిస్టమ్లనుండి విశ్వవిద్యాలయాల వరకూ సర్వీసులు ఈ సేవలో ఉంటాయి.

మెట్రో ట్రాన్సిట్ నిర్వహణలో హయవాతా లైన్ లైట్ రైల్ రైల్ సర్వీసులను నడుపుతుంది. ఇది పాత సర్వీసులను పునరుద్దరించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలిత సంస్థలచే నడపబడుతున్న వివిధ సర్వీసులు ప్రయాణీకులకు విశేష సేవలందిస్తున్నాయి. కమ్యూటర్ రైల్స్ఎక్స్‌బర్న్సమూహాలకు తమ సేవలనందిస్తున్నాయి. చికాగో కేంద్రంగా హైస్పీడ్ రైల్ సర్వీసులు నడపటానికి మిన్నసోటా ప్రభుత్వం పరిశీలిస్తుంది.

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ అందిస్తున్న ప్రయాణసౌకర్యాల కొరత ప్రజలను కొంత ఇబ్బంది పెడుతుందని ఇక్కడి ప్రజలు విమర్శిస్తుంటారు. మిగిలిన నగరాలతో పోల్చి చూస్తే ఇక్కడ ఇబ్బంది కొంచం తక్కువే. నగరం అభివృద్ధి చెందుతూ ఉండటం కారణంగా రహదార్లూ వెడల్పు ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉన్నా పెరుగుతున్న జనాభా కాణంగా వాహనరద్దీ పెరగడం వలన మరికొంత వెడల్పు చేయవలసిన అవసరం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలకంటే వేగంగా జనాభా పెరగడం ఇందుకు కారణం.

మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ వాహన రద్దీ అమెరికాలో నగర పరిమాణం గణనలోకి తీసుకుంటే 5వ స్థానంలో ఉంది. 2004లో హయవాతా లైన్ సర్వీసులను ప్రారంభించింది. మిన్నియాపోలిస్‌నూ సెయింట్ పాల్‌ లనూ, యూనివర్శిటినీ కలుపుతూ లైట్ రైల్ లైన్ నడపాలన్న ఆలోచన పరిశీలనలో ఉంది.

విమాన వసతి

[మార్చు]

మెట్రో పాలిటన్ అయిర్ పోర్ట్ కమిషన్ఆధ్వర్యంలో చిన చిన్న విమానాశ్రయాలు అనేకం ఉన్నా మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ ఇన్టర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ (MSP) విమానాశ్రయం ప్రధాన మైనది.ఇది నార్త్ వెస్ట్ ఎయిర్‌వేస్కు కేంద్రం.కొంతమంది ప్రయాణీకులు రాష్ట్ర ఉత్తర భాగం నుండి విమానాలలో ప్రయాణిస్తుంటారు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]